Madhu Name Song

Shiva
By Shiva

మధు – పేరుతో సాంగ్ డౌన్లోడ్

Madhu Name Song Download

మధు – సాంగ్ ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరిచయం :-

హాయ్ హలో ఫ్రెండ్స్ – నా పేరు శివకుమార్ గత కొన్ని నెలలుగా ట్రెండింగ్ లో ఉన్న పేజ్ మనది. Shiva K Creations అంటే తెలియని వాళ్లు లేరు. ఇప్పటివరకు చేసిన అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. ఎంతోమందికి నచ్చాయి. ఇలాగే నన్ను నా టాలెంట్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే కొనసాగితే ఈ పాటలు రాసే నా జర్నీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే మీ అందరి నేమ్స్ తో కూడా సాంగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నాకైతే ఈ జర్నీ ని కొనసాగించాలని ఉంది. మరి నాతో పాటు మీ ఎంకరేజ్మెంట్ కూడా వస్తుందని అనుకుంటున్నాను.

వివరణ :-

ప్రతి ఒక్కరికి సాంగ్స్ అనేవి చాలా ఇష్టం. మ్యూజిక్ ని వింటూ ఈ లోకాన్నే మరిచిపోతారు. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టుగా ఎంజాయ్ చేస్తారు. జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా కాసేపు మ్యూజిక్ వింటూ స్వర్గంలో ఉన్నట్టు హాయిగా ఎంజాయ్ చేస్తారు. నిజానికి మ్యూజిక్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎన్నోసార్లు పరిస్థితి కష్టంగా అనిపించినప్పుడు మ్యూజిక్ వింటూ ఆ పరిస్థితిని మరిచిపోయి ఎంజాయ్ చేసేవాడిని. ఏదైనా పని చేసేటప్పుడు ఉత్సాహం కోసం కొన్నిసార్లు పాటలు వినేవాడిని. మోటివేషన్ కావలసినప్పుడు కూడా లైఫ్ లో ఊపు తెప్పించే పాటలు వినేవాడిని.

ఈరోజు పొద్దున్న కూడా ఒక పాట విన్నాను. ఆ పాట వినడానికి చాలా వినసొంపుగా ఉంది. ఆ పాటలో ఉన్న మాధుర్యం అద్భుతం. ఆ పాటకి ఒక యూట్యూబర్ ఎన్నిసార్లు పెట్టిన వినాలనిపించే పాట అని పెట్టాడు.

నిజానికి అలాగే ఉంది ఆ పాట. రైటర్ ఎవరో కానీ చాలా బాగా రాశారు. ఇంతకీ ఆ పాట ఏ పాట అని అనుకుంటున్నారు కదా. మూవీ పేరు తెలియదు కానీ పాట పేరు చెప్తాను వింటే మీరు కూడా వినండి. యవ్వన వీణ – పువ్వుల వాన ఈ సాంగ్ చాలా బాగుంది. ఖాళీ ఉంటే ఒకసారి వినండి. ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని వినండి. ఆ పాట విన్నాక మీరు చాలా రిఫ్లెక్షన్ ఫీలవుతారు.


విషయం ఏమిటంటే :-

పాటలనేవి చాలామందికి ఇష్టం. కొంతమంది డైలీ లైఫ్ లో పాటలు వినడం అనేది ఒక హ్యాబిట్ గా ఉంటుంది. ప్రతిరోజు అలా జాబ్ కి వెళ్లేటప్పుడు, కాలేజీకి వెళ్లేటప్పుడు జర్నీలో సాంగ్స్ వింటూ ఉంటారు. ముఖ్యంగా బస్సులో కూర్చుని కిటికీలోంచి బయటికి లొకేషన్ చూస్తూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటే ఆ ఫీల్ వేరు అంతే. అలా మీరు ఎప్పుడైనా చేశారా. నేను డిగ్రీ కాలేజ్ కి వెళ్లేటప్పుడు అలాంటి ఫీల్ ని ఎంజాయ్ చేశాను. కొన్నిసార్లు ట్రైన్ జర్నీస్ కూడా ఇలా పాటలు వింటూ ఎన్నో చేస్తాను. ముఖ్యంగా నేను సోలోగా ట్రావెల్ చేసినప్పుడు జర్నీ ఎంజాయ్ చేయడానికి ఇలా చేసేవాడిని. అయితే ఇలా పాటలు చాలామంది ఎంజాయ్ చేస్తారు. అదే పాటలు వాళ్ళ పేరు మీద ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఆ ఆలోచన గాలిలో తేలిపోయేలా చేస్తుంది.

అందుకే ఈ పేరుతో సాంగ్స్ అనేది స్టార్ట్ చేశాము. ఎక్కడికి వెళ్లినా పేరుతో సాంగ్స్ చేయడం వల్ల వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ముఖంలో ఆనందం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

షూటింగ్ లోకేషన్ :-

ఈ తయారుచేసిన తర్వాత ఒక మంచి లొకేషన్ లో ఈ పాట రిలీజ్ ని చేయాలి అనుకున్నాను. దానికోసం ఎక్కడెక్కడ అని వెతికితే రాజమండ్రిలో Glow గార్డెన్ పార్క్ దొరికింది. ఆ లొకేషన్ కి కరెక్ట్ గా 6 గంటలకు చేరుకున్నాము. అప్పుడే పార్కులో లైటింగ్ ఆన్ అయిపోయింది. చూడగానే లోపలికి వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఫోన్ పే తో టికెట్స్ తీసుకోవచ్చు అనుకుంటే ఫోన్ పే లేదంట. క్యాష్ కూడా మేము తీసుకెళ్లలేదు. ఎలాగా రా బాబు అని అనుకొని కాసేపు అక్కడ కూర్చున్నాం బయటే. బయట కూడా లొకేషన్ బాగానే ఉంది. రాజమండ్రిలో అలాంటి లొకేషన్స్ చాలా ఉంటాయి. తిరుగుతుంటే స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. బండిలో పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు ఉండాలే కానీ మనల్ని ఎవరూ ఆపే వారే లేరు.

ఎప్పుడో ఏదో డబ్బున్న వాళ్ళలాగా అయిపోతామని కలలు కంటూ ఉండిపోతాము. ఇలా సమయాన్ని వృధా చేసుకుంటాము. అలా చేసే కంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుతో ఎంతో కొంత ఎంజాయ్ చేయడం మంచిది.

బేకరీ అతను :-

ఆ పార్కుకి రిలేటెడ్ గా ఒక బేకరీ ఉంది. అతనికి ఫోన్ పే చేసి డబ్బులు అడిగితే ఇస్తాడేమో అనుకున్నాము. వెళ్లి కేవలం డబ్బులు మాత్రమే అడిగితే బాగోదు అని నేను మా తమ్ముడు కలిసి కర్రీ పఫ్లో ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇంకా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. బిల్ అయితే 60 రూపాయలు అయింది. ఈ 60 తో పాటు ఇంకొక ₹100 ఫోన్ పే చేస్తాము టికెట్స్ తీసుకోవడానికి ఫోన్ పే లేదంట అని చెప్పాము. అప్పుడు అతను సరే ఫోన్ పే చేయండి నేను వాళ్లకు చెప్తాను అని అంటున్నాడు. ఫోన్ పే చేసాము అతను వెళ్లి ఆ పార్క్ ఎంట్రీ టికెట్స్ వాళ్లకి చెప్పాడు. నాకు డబ్బులు ఫోన్ పే చేశారు మీరు టికెట్స్ ఇవ్వండి అని అన్నారు. మాకు టికెట్స్ వచ్చేసాయి.

చల్ చలో అంటూ లోపలికి వెళ్ళిపోయాము. నిజానికి బయట లొకేషన్ కూడా చాలా బాగుంది. వీడియో తీద్దామా అనిపించింది. లోపలికి వెళ్ళాక ఒకసారి బయటికి వస్తానేమో అనుకున్నాం. లోపలికి బయటికి తిరగడానికి లేదు. ఎందుకంటే టికెట్ మొత్తానికి తీసుకొని పార్క్ పలికి పంపిస్తున్నారు.


కాబట్టి బయటికి వెళ్తే గనుక మళ్లీ మా దగ్గర టికెట్ ఉండదు. లోపలికి మళ్ళీ వెళ్లాలంటే టికెట్ లేదని లోపలికి పంపించరు. అందుకే ఇంకా బయటికి రాకుండా లోపలే షూటింగ్ చేసుకున్నాము. బయటికి వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకున్నాము. కానీ వీలు కాలేదు ఎందుకంటే బయట లైటింగ్ అంత ఫోకస్డ్ గా లేదు.

లోపల అయితే మేము అనుకున్నట్టుగా చాలా వీడియోస్ షూటింగ్ చేసాము. మేం వీడియోస్ తీసుకుంటుండగా ఒక బ్రో వచ్చాడు. బ్రో మీరు చేసే సాంగ్స్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం అని అన్నాడు. ఇంకా కొంతమంది అమ్మాయిలు కూడా కలవడానికి ట్రై చేస్తారు. కానీ మేము షూటింగ్ పనిలో ఉండటం వల్ల మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మా దగ్గరికి రాలేదు. వీడియో షూటింగ్ అయ్యాక కలుద్దాం అనుకున్నాం. కానీ మేము షూటింగ్ చేయడమే చాలా సమయం పట్టింది. ఈలోపు వాళ్లు వెళ్లిపోయారు.

రాసిపెట్టి ఉండాలి :-

కొంతమంది మనుషులను కలవాలంటే రాసిపెట్టి ఉండాలేమో అనిపించింది. వీడియోలో తీస్తూ నేను కనీసం చూడలేదు ఒక బ్రోని. కానీ అతనే నా దగ్గరకు వచ్చి పలకరించాడు. కానీ కొంతమందిని వాళ్ళు పలకరిద్దామని అనుకున్నప్పుడు నేను చూశాను. కానీ వాళ్లతో మాట్లాడడానికి అవలేదు. అంతేలే ఏదైనా ఒక సంఘటన జరగాలి అంటే రాసిపెట్టి ఉండాలేమో. మళ్లీ రాజమండ్రిలో షూటింగ్ చేసేటప్పుడు కలిసి అవకాశం ఉందో లేదో చూడాలి.

రాజమండ్రిలో షూటింగ్ చేయగలిగే ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఒకసారి తేజు పేరు మీద సాంగ్ చేసినప్పుడు గోదావరి బ్రిడ్జి దగ్గర తీశాము. ఆ వీడియో కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో క్వాలిటీ అండ్ సాంగ్ చాలా అద్భుతంగా అనిపించింది. రాజమండ్రి ట్రిప్ వెళ్ళినందుకల్లా మేము అనుకున్న వీడియోస్ కి క్లిక్స్ బాగా వచ్చాయి.

అవకాశం :-

ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఎడిటింగ్ చేస్తున్నాము. ఎడిటింగ్ చేస్తూ లైఫ్ ని మాకు నచ్చినట్టుగా మేము తయారు చేసుకున్నాం. లైఫ్ లో ఏ వస్తువులు కావాలో అవన్నీ సంపాదించాము. ఒక ప్రొఫెషన్ ని మనం సెట్ చేసుకుంటే మన లైఫ్ కి కావాల్సిన థింగ్స్ అన్ని సెట్ చేస్తుంది. అవకాశం దానంతటదే రావచ్చు రాకపోవచ్చు. మాకైతే దానంతట అది రాలేదు మేమే ఒక అవకాశాన్ని కల్పించుకున్నాము. అఫ్కోర్స్ దీని వెనకాల భగవంతుడు సపోర్ట్ కచ్చితంగా ఉంది అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ లో వెళ్లడానికి దేవుడి సహకారం చాలా అవసరం. మేము ఏమనుకున్నా అది జరిగింది అంటే కచ్చితంగా దేవుడు మాకు హెల్ప్ చేశాడని చెబుతాం.

ఎందుకంటే కొంతమంది ప్రయత్నం చేయరు. కొంతమంది ప్రయత్నం చేసిన ఒక్కోసారి వారికి పరిస్థితులు అనుకూలించవు. కానీ ఆ పరిస్థితులకి మనం లొంగిపోకుండా ప్రయత్నం ఎప్పుడైతే ఆపకుండా ప్రయత్నిస్తాము కచ్చితంగా భగవంతుడు అవకాశం ఇస్తాడు.

మా లైఫ్ లోని అదే జరిగింది. మేము అనుకున్నది ఆపకుండా కొనసాగించడం వల్ల ఇప్పుడు మేము ఈ పొజిషన్లో ఉన్నాం.

ఎడిటింగ్ కోసం :-

మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. వాడిలో ఒక టాలెంట్ నాకు కనబడింది. నిజానికి వాడి డాన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నేను ఫిదా అయిపోయాను. ఎలాగైనా ఈ డాన్స్ ని అందరికీ చూపించాలి అనుకున్నాను. నేను చేయగలిగినంత ప్రయత్నం అంతా చేశాను. ఒక 20 రోజులు ఆ అబ్బాయి వెనకాలే తిరిగి కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను. నేను ఒక్కడినే వాటిని ఎడిట్ చేసి instagram లో పోస్ట్ చేశాను. అనుకున్న సక్సెస్ అప్పుడే వచ్చేస్తుందా రాలేదు.

ఆ డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ జనాల మెప్పుని మేము పొంది మధ్యలో మా ఎడిటింగ్ సంబంధించిన యాడ్స్ ఇద్దామని అనుకున్నాము. కానీ ఒక వీడియో షూటింగ్ వెళ్తే ఒక రోజంతా గడిచిపోయేది. ఎడిటింగ్ కి రెండు మూడు గంటలు అయిపోయేది. మాకు ఉన్న గోల్స్ కి అన్ని హవర్స్ ఒకరి కోసం పని చేయలేకపోయాము.

ఇంకొన్ని రోజులు మేము కష్టపడినట్లయితే కచ్చితంగా ఆ డాన్స్ వీడియోస్ జనాలు అందరికీ రీచ్ అయ్యేవి. కానీ నేను అంత సమయాన్ని పెట్టలేకపోయాను. ఆ అబ్బాయికి వీడియోస్ తీసే వాళ్ళు ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటికీ ఆ టాలెంట్ ఆ కుర్రవాడి లోనే ఉండిపోయింది. ఒక్కోసారి ఇలానే జరుగుతుంది. కానీ మా ప్రయత్నం మేము చేసాం. అక్కడి నుంచి మా విలేజ్ కి వచ్చి వీడియోస్ తీయడం మొదలు పెట్టాము. ఈరోజు ఇలా ఇక్కడ వరకు ఎదిగాము.


ఇక్కడDownloadఅనే దానిపై క్లిక్ చేసి మధు పేరుతో సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download

హాయ్ హలో ఫ్రెండ్స్ మధు సాంగ్ సగం వరకు ఇంస్టాగ్రామ్ లో విన్నారు. ఎలా అనిపించింది. అఫ్కోర్స్ మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ కి వచ్చారు కాబట్టి. మీకు ఆ సాంగ్ కచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. అయితే మరి నాకు ఇవ్వాల్సింది నాకు కూడా ఇవ్వాలి కదా. డబ్బులు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఒక కామెంట్ చేస్తే చాలు. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించింది ఎవరి కోసం డౌన్లోడ్ చేసుకున్నారు అనేది ఒక కామెంట్ లో చెప్పండి.

అలాగే మేము తీసిన వీడియో లో ఉన్న లొకేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఎన్నో లొకేషన్స్ కీ వెళ్లి మంచి మంచి సాంగ్స్ రిలీజ్ చేసి మిమ్మల్ని ఆనంద పరచాలని మా కోరికను మీ ఎంకరేజ్మెంట్ తో కొనసాగనివ్వండి.

 

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *