Kavitha Name Song

Shiva
By Shiva

కవిత – నేమ్ సాంగ్ డౌన్లోడ్ 

Kavitha Name Song Download

కవితా పేరుతో సాంగ్ – ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరిచయం :-

ఇప్పటివరకు నేను చేసిన అన్ని సాంగ్స్ లో ఎక్కువమంది అడిగిన పేరుతో సాంగ్ – కవిత పేరుతో సాంగ్ చేయమని కామెంట్ చేశారు. ఇలా అందరి పేర్లతో సాంగ్ చేయడం అనేది నాకు ఎంతో ఇష్టం. నిజం చెప్పాలంటే అందరి పేర్లతో సాంగ్స్ చేయడమే నా లక్ష్యం. ఎప్పటికీ ఈ టాస్క్ అవుతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. మీ పేరుతో కూడా సాంగ్ కావాలనుకుంటే ఈ ఆర్టికల్ కి కామెంట్ కామెంట్ చేయండి. కొంచెం సమయం పట్టినా కచ్చితంగా అందరి నేమ్స్ తోని సాంగ్స్ వస్తాయి. హలో ఫ్రెండ్స్ నా పేరు శివకుమార్. నేను సాంగ్స్ చేయడంతో పాటు అదే సాంగ్స్ కి వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాము. కావాల్సిన వాళ్ళు ఇంస్టాగ్రామ్ లో వీడియోలో ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి.

వివరణ :-

ఈ ఆర్టికల్ పేజ్ లో కవిత పేరుతో సాంగ్ తో ఉంటుంది. దానితోపాటు కొన్ని రకాల విషయాలను తెలియచేయాలని అనుకుంటున్నాను. ఈరోజు పల్లెటూర్లలో ఉండే జీవన విధానం మరియు ఇక్కడ దొరికే ఆహారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పల్లెటూరికి దూరంగా ఉండే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా చూద్దాం. పల్లెటూరులో ఉండే లాభాలు మరియు నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ చేసే వ్యవసాయం, జాతరలు, ఆచారాలు అన్నిటి గురించి మాట్లాడుకుందాం.

ఆహారపు అలవాట్లు :-

పల్లెటూర్లలో ఇంతకుముందు అంటే పూర్వం ఆహారపు అలవాట్లు ఎంతో మెరుగుగా ఉండేవి. నిజానికి పూర్వం పల్లెటూర్లలో తీసుకునే ఆహారానికి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. 100 సంవత్సరాలకు పైగా జీవించి ఉండేవారు. పూర్వం వారు ఉపయోగించిన ఆహారపు అలవాట్లు ఇప్పటికీ ఆదర్శంగా ఉంటాయి. పల్లెటూరులో కల్తీ లేని ఆహారం ఉండేది. ఎందుకంటే వారు దేనినైనా స్వయంగా తయారు చేసుకుంటారు. వారికి కావాల్సిన పంటలు అన్నీ పల్లెటూరులో పండుతాయి. ఉదాహరణకు వేరుశనగ, మినుములు, పెసలు, రాగులు, జొన్నలు, గోధుమలు, వరి ఇలా చాలా రకాల పంటలు స్వయంగా వారే పండించుకుంటారు. దీనికి కారణంగా కల్తీ జరిగే అవకాశం ఉండదు.

ఉదయం :-

పల్లెటూరులో పొద్దున లేవగానే సంగటి తినేవారు. ఈ సంగటి జొన్న పిండితో కానీ రాగి పిండితో కానీ చేసేవారు. ఈ సంగటిలో అనేక పోషకాలు ఉండటంవల్ల వారి ఆరోగ్యపు అలవాట్లలో ఇది మొదటగా ఉండేది. అలాగే అటుకులతో చేసే అల్పాహారం కూడా చాలామంది తీసుకుంటారు. అటుకులు బాగా నాన్న పెడతారు. నానబెట్టిన అటుకులలో నిమ్మరసం మరియు కొత్తిమీర కలిపి ఉప్మా తయారు చేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మరియు ఎంతో ఆరోగ్యం కూడా. వీటితోపాటు పెసలతో తయారుచేసిన పెసరట్టు తింటారు.లేదా జొన్న పిండితో తయారు చేసే జొన్న రొట్టె కూడా తింటారు. కొన్ని పల్లెటూర్లలో సజ్జలతో తయారుచేసిన రొట్టెలను కూడా తింటారు. ఈ రొట్టెలు తినడానికి నంచుకోవడానికి పల్లీలతో చేసిన చట్నీ ఇంకా పప్పులతో చేసిన చట్నీ కలుపుకుంటారు.

కాబట్టి చట్నీలు కూడా ఆరోగ్యకరమే. వారు ఉదయం అల్పాహారంగా తీసుకునేది కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకే వారి శరీరాలు బలంగా ఉంటాయి. వారు ఉదయాన్నే లేవగానే వ్యాయామం లాంటివి కూడా చేయరు. వారికి ఉండే పొలాలలో పని చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంతమంది పప్పు ధాన్యాలతో కిచిడి తయారు చేసుకొని తింటారు. ఈ కిచిడీ లో అనేక రకాల పప్పు ధాన్యాలు, పచ్చిబఠానీ, క్యాబేజీ, నిమ్మరసం కలుపుకొని తినడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

పాలు మరియు పెరుగు :-

పల్లెటూర్లలో అధికంగా లభించే వాటిలో పాలు మరియు పెరుగు. ఇవి చాలా స్వచ్ఛంగా సమృద్ధిగా దొరుకుతాయి. చిన్నవాళ్లు అయితే పొద్దున్నే లేవగానే వేడి పాలను తాగుతారు. పెద్దవాళ్లు అయితే అదే పాలను పెరుగు తోడు పెట్టుకుని పెరుగన్నం తింటారు. కొంతమంది పల్చగా మజ్జిగ లాగా కలుపుకొని కూడా మజ్జిగన్నం అనే పేరుతో తింటారు.


వ్యవసాయదారులు :-

పొలాలు ఉన్నవారు సొంతంగా వ్యవసాయం చేస్తారు. పొలాలలో కష్టపడి పని చేసేవారు మధ్యాహ్నం భోజనానికి ఇలా సిద్ధం చేసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా అన్నం ఉంటుంది. దానికి తోడు పప్పు మరియు అనేక రకాల కూరగాయలతో వండిన కూరలు ఉంటాయి. ఆకుకూరలు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరతో కలుపుకొని అన్నం తింటారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కూరగాయలు మరియు ఆకుకూరలు కూడా స్వయంగా వారే పండించుకుంటారు. ఎలాంటి మందులు ఉపయోగించకుండా స్వచ్ఛంగా పండిస్తారు.

దానివల్ల వారు తినే ఆహారం కల్తీ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరులో ఉండే ఆహారంలో కల్తీ అనేది తక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడి వారు ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది వైద్యశాల లేకుండానే జీవిస్తారు. ఒకవేళ ఉన్న అప్పుడప్పుడు మాత్రమే వెళ్తారు.


సాయంత్రం వేళ :-

సరదాగా సాయంత్రం సమయంలో తేలికపాటి ఆహారం తీసుకుంటారు. ఉదాహరణకు చిన్న బజ్జీలు, మిరపకాయ, మంచి కూరగాయలతో వండిన కూరలతో సమోసాలు, అరటికాయ బజ్జీలు, టమాట బజ్జీలు, గుడ్డుతో తయారుచేసిన బజ్జీలు చట్నీలతో కలిపి తింటారు.

ఇవే కాకుండా ఒక్కొక్కసారి మొక్కజొన్న కంకెలు, సెనగలు ఉడకబెట్టి తాలింపు వేసి తింటారు. ఇలా వారు తినే ఆహారంలో స్వయంగా పండించిన కూరగాయలు ఉంటాయి. అవే కాకుండా పప్పు దినుసులు ఉండటంవల్ల విటమిన్లు ఉంటాయి. ఆహారంగా ఏం తీసుకున్న పోషకాలు అధికంగా వారికి లభిస్తాయి.

రాత్రివేళ :-

పల్లెటూరులో రాత్రి భోజనంగా సాధారణంగానే ఉంటుంది. అన్నం మరియు పప్పు ఇతర కూరగాయలతో వండిన కూరలతో ఉంటుంది. రాత్రి సమయంలో వీరు ఆహారాన్ని అధికంగా తీసుకోరు. ఆహారం తేలికపాటిగా తీసుకుంటారు. దీనివల్ల రాత్రి పూట తిన్న ఆహారం త్వరగా అరిగి నిద్ర బాగా పడుతుంది. రాత్రి భోజనం చివరలో మరిచిపోకుండా పెరుగు లేదా మజ్జిగతో భోజనం ముగిస్తారు . దీనికి కారణంగా జీర్ణ సమస్యలు రావు. తిన్న తర్వాత గంట సమయమైనా సరదాగా గడుపుతారు. తరువాత వారు నిద్ర కూడా కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోతారు.

రోజువారీగా వారు ఇదే పద్ధతిని అనుసరిస్తారు. మళ్లీ ఉదయాన్నే, తెల్లవారుజామునే నిద్రలేస్తారు. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను వారు పాటించటం వల్ల ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు.

శారీరక పనులు :-

శరీరం దృఢంగా ఉండాలంటే మంచి తిండితో పాటు వ్యాయామం కూడా ఉండాలి. అయితే పల్లెటూర్లలో ఎక్కువగా వ్యాయామం ఎవరు చేయరు. ఎందుకంటే శారీరకంగా అలసిపోయే అంతగా పనులు చేస్తారు. పొలంలో దుక్కు దున్నడం లాంటివి, ఒంగోని నారుని నాటడం లాంటివి, వరి కోయడం లాంటివి ఇలా అనేక రకాల పనులు చేస్తారు. ఈ పనుల వల్ల వారి శరీరంలో కొవ్వు పెరగకుండా చెమట రూపంలో పోతుంది. శరీరంలో అనవసరమైన కొవ్వులు ఉండనప్పుడు శరీరానికి రోగాలు అనేవి రావు.

సమయానికి భోజనం, సమయానికి నిద్ర, సమయానికి పనులు ఇలా అన్ని సమయానికి చేస్తారు. దీనివల్ల వాళ్ళ ఆలోచనలలో ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేకపోతే సగానికి పైగా రోగాలు లేనట్టే.

వాతావరణం :-

ఇక్కడ వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎక్కువగా ఫ్యాక్టరీలు లేకపోవడం వల్ల కాలుష్యం అనేది గాలిలో ఉండదు. అలాగే వాహనాల రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగరీత్యా కంపెనీలు ఉండవు కాబట్టి. వాహనాల రద్దీ లేకపోవడం వల్ల ఇక్కడ కాలుష్యం ఎక్కువ ఉండదు. ఇక్కడ వీచే గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆక్సిజన్ చాలా స్వచ్ఛంగా లభిస్తుంది. మరియు ఎక్కడ ఉండే వృక్షాల నుంచి అధిక ఆక్సిజన్ విడుదల అవుతుంది.

దీని కారణంగా ఆక్సిజన్ కొరత ఉండదు. కాబట్టి ఇక్కడ వాతావరణ కాలుష్యం ఎక్కువ జరగదు. ఇక్కడ నివసించే ప్రజలకు అనారోగ్యాలు తక్కువగా వస్తాయి. శబ్ద కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నగరాలలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంవల్ల హారన్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడ ప్రవహించే నీరు చెట్లను తాకుతూ కాలవల గుండా ప్రవహించటం వల్ల వృక్షాలలో ఉండే అధిక ఔషధ గుణాలు నీళ్లలో కలుస్తాయి. ఆ నీరే వ్యవసాయంలోకి మళ్లించడం వల్ల వరి బాగా ఎదుగుతుంది.

పుణ్యక్షేత్రాలు :-

ముఖ్యంగా పల్లెటూర్లలో దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నివసించేవారు వారంలో ఒక్కసారైనా దేవాలయానికి వెళతారు. ఇలా దేవాలయాలకు వెళ్ళటం వల్ల జ్ఞానం లభిస్తుంది. అంతా నాకే కావాలి అనే స్వార్ధపు బుద్ధి తక్కువ ఉంటుంది. వేరొకరికి కూడా అవకాశం వచ్చేలాగా చేస్తారు. ఒకరికి ఒకరు తగాదాలు పెట్టుకోకుండా ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. బంధుత్వాలు బాగుంటాయి. కుటుంబాలు ఆనందంగా జీవిస్తాయి. ఇలా ఉండటం వల్ల ప్రపంచం బాగుంటుంది.

మనిషి ప్రశాంతంగా జీవించాలంటే మరియు తోటి వారిని ప్రశాంతంగా ఉంచాలంటే వారికి దైవం గురించి తెలియాలి. మానవత్వంతో జీవించడానికి దేవుడు భక్తి ఎంతో అవసరం. కాబట్టి పూర్వీకులు పల్లెటూర్లలో ఎక్కువగా దేవాలయాలు నిర్మించారు. ఇలా దేవాలయాలు ఉండటం వల్ల కూడా మనుషులు బాగుంటారు.

సాంప్రదాయాలు:-

ఇక్కడ సాంప్రదాయాలు కట్టుకునే వస్త్రాలలో సంప్రదాయం ఉంటుంది. అమ్మాయి ఏ విధంగా వస్త్రాలు ధరించాలి అనేది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అమ్మాయిలు లంగా వోణీలు వేసుకుని చాలా ట్రెడిషనల్ గా తయారవుతారు. వారి వేసుకునే జడ వస్త్రాలు వారి రంగు ఏ విధంగా ఉన్నప్పటికీ అందాన్ని తీసుకొస్తాయి. అలంకారానికి ఆభరణాలు ఎక్కువ లేకపోయినా సరే వారు ధరించిన వస్త్రాల కారణంగా అందం వచ్చేస్తుంది.

ఇంకా అబ్బాయిలకి కూడా వస్త్రాలు ధరించడానికి సంప్రదాయం ఉంటుంది. వారు ప్లేన్ చొక్కా మరియు పంచెను ధరిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఇలా వస్త్రాల ట్రెడిషన్ లో పల్లెటూరు ముందుంటుంది.

బంధుత్వాలు కలవటం :-

ప్రతి పండగకి బంధువులు ఎక్కడున్నా సరే ఒక్కచోట కలుస్తారు. వారు జరుపుకునే ఏ పండగ అయినా సరే సరదాగా అందరితో జరుపుకుంటారు. కూతుర్లను, అల్లుళ్లను మన వాళ్లను ప్రతి పండుగకు పిలుస్తారు. పిండి వంటకాలతో మంచి మంచి విందు భోజనాలతో పండగలను మరి ఎక్కడా జరపని విధంగా జరుపుకుంటారు.

ప్రతి శుభకార్యానికి అంటే ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఉదాహరణకి ఎవరైనా ఇంట్లో అమ్మాయిలు పుష్పవతి అయిన అందరూ ఒక్కచోట చేరి చాలా సందడి చేస్తారు. పెళ్లి జరిగిన అంతే సందడిని చేస్తారు. ఇలా పండగలకు శుభకార్యాలకు బంధువులంతా కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు.

కొంత అజ్ఞానం :-

ఇప్పటివరకు మాట్లాడుకున్నవి అన్ని పూర్వం అధికంగా ఉండేవి. రాను రాను ఈ పద్ధతులు అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో ఇలాంటి పద్ధతులు అనుసరించి ఆరోగ్యంగా జీవనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ఈ పద్ధతులను పాటించడం లేదు. పూర్తిగా ఆహారపు అలవాట్లు మారిపోయాయి.

ఇక్కడ పండించిన అన్నీ కూడా డబ్బు కోసం ఇతర రాష్ట్రాలకు మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేసేస్తున్నారు. అధిక లాభాల కోసం ఎగుమతి చేసేసి ఇక్కడ మిగిలిన వాటితో సర్దుకుని క్వాలిటీ లేని ఆహారంతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇడ్లీ ప్లేటు 20 రూపాయలు చాలా చవకగా లభిస్తుంది. చౌకగా లభిస్తుంది కదా అని ఇడ్లీ కొనుక్కొని తింటే అందులో మినుములు తక్కువ వేస్తారు. ఎక్కువ బియ్యపు పిండిని వేసేస్తారు. ఇడ్లీలో క్వాలిటీ ఉండదు. ఈ విధంగా కొన్ని హోటస్లలో జరుగుతుంది.

ఇక్కడ ‘ Downloadఅనే దానిపై క్లిక్ చేసి మీరు కవిత పేరుతో పాటని  ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Kavitha Song Link👇

Download

హలో ఫ్రెండ్స్ ఇంస్టాగ్రామ్ లో కవిత ఫుల్ సాంగ్ గురించి చెప్పాను కదా. అందుకే మీరు ఇక్కడికి వచ్చారా నాకు తెలుసు. అయితే ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకొని విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ నాకెంత అవసరమండోయ్ మర్చిపోకండి. ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎంత అవసరమో నా ఈ సాంగ్స్ ప్రయత్నానికి మీ ఎంకరేజ్మెంట్ కూడా అంతే అవసరం. కచ్చితంగా మీకు నచ్చిన కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ దగ్గర నుంచి అంతకంటే ఆశించేది ఇంకేమీ లేదు.

ప్రతి మనిషికి సపోర్ట్ ఉంటే ఎంతటి పనినైనా సాధించేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీ సపోర్ట్ ని కోరుకుంటున్నాను. నేను ఏ స్థాయికి ఎదిగిన మీ మేలుని మాత్రం మర్చిపోను.

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *