Harika Name Song Download

Shiva
By Shiva

హారిక – సాంగ్ డౌన్లోడ్

Harika Name Song Download

ఈ సాంగ్ ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరిచయం :-

Harika Name Song Download అంటే మీరు హారిక పేరుతో సాంగ్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సాంగ్ ని తయారు చేయడానికి 56 రోజులు పట్టింది. ఎందుకంటే ఈ సాంగ్ చాలా బాగా రావాలి అని ఎన్నో రోజులు ఆలోచించాను. రాయడానికే నెల రోజుల సమయం పట్టింది. ఆ విధంగా ఒక పూర్తిగా హారిక పేరుతో సాంగ్ తయారు చేయడానికి దాదాపుగా 56 రోజులు సమయం పట్టింది. నా వద్ద నుంచి ఎంత సమయం పోయిన పర్వాలేదు కానీ సాంగ్ మాత్రం హైలెట్ గా ఉండాలి. అనేదే నా కోరిక. మొత్తానికి సాంగ్ అయితే తయారయింది. ఈ పాటను ఎలా పబ్లిష్ చేయాలో అనే దాని గురించి ఆలోచించాలి. అయితే ఈ పేరాగ్రాఫ్ లో ఈ పాటని పబ్లిష్ చేయడానికి చేసిన ప్రాసెస్ ని తెలియజేయాలనుకుంటున్నాను.

షూటింగ్:-

ఈ పాటని instagram లో రిలీజ్ చేయడం కోసం ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్దాము అనుకున్నాము. కానీ అదే సమయానికి శ్రీరామనవమి పండుగ ఉంది. ఈ సమయంలో మాకు చాలా వీడియోస్ orders వస్తాయి. ఇలాంటి పండుగను మిస్ అయితే ఒక పెద్ద అవకాశాన్ని వదిలేసినట్టే అవుతుంది. అందుకని ఏదైనా దగ్గర ప్రదేశంలో షూట్ చేయాలి అనుకున్నాము. అయినప్పటికీ మా మనసు ఒప్పుకోలేదు. ఈ పాట చాలా బాగుంది కాబట్టి. షూటింగ్ మంచిగానే చేస్తే బాగుండు అనిపించింది. దానికోసం అని మా ఊరిలోనే కాకుండా మా ఊరికి దూరంగా 35 కిలోమీటర్ల దూరంలో ఒక వాటర్ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ పేరు దారపల్లి వాటర్ ఫాల్స్. ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ నిరంతరం వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ కి వెళ్లే మార్గం అస్సలు బాగోదు. రోడ్డంతా కంకర కంకర ఉంటుంది.

ఏం జరిగింది.

రోడ్డు ఎలా ఉన్నప్పటికీ ఆ రోడ్డు పక్కన లోకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ కి ముందు ఒక డ్యామ్ ఎదురవుతుంది. ఈ డ్యాం చాలా అందంగా ఉంటుంది. ఆ డ్యామ్ లో వాటర్ నిండుగా ఉండి. ఏదో స్విజర్లాండ్ పర్వతాల మధ్య ఒక సరస్సు ఉన్నట్టుగా ఉంటుంది. ఆ సరస్సు పక్కనే గొర్రెలు కాసే వాళ్లు గొర్రెలను మేపుతూ ఉంటారు. ఆ గొర్రెల అలా మేస్తూ ఆ సరస్పక్కన ఉండటం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సరస్సు కొండల మధ్యలో ఉంటుంది. ఆ కొండలు పచ్చటి చెట్లు, నేల మీద ఒక ఇంచు కానీ కూడా లేకుండా పచ్చటి గడ్డి పొర ఉంటుంది. అందులో ముల్లులు లాంటివి ఏవి ఉండవు. నడుస్తుంటే పాదాలకు మెత్తగా ఉంటుంది. అటువంటి ప్రదేశాన్ని చూస్తుంటే నిజంగా స్విజర్లాండ్ వెళ్లినట్టుగా ఉంటుంది.

స్విజర్లాండ్ :-

ఇంటి దగ్గర ఉన్నప్పుడు మొదట ఆ డ్యామ్ దగ్గరే షూటింగ్ చేయాలి అనుకున్నాము. తీరా కష్టపడి ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాక ఆ డాం నిండా ఫుల్లుగా వాటర్ ఉన్నాయి. ఇందాక చెప్పిన విధంగా నేల మీద అందమైన గడ్డి పోరా ప్రదేశం గొర్రెలు మేయడానికి వీలుగా అక్కడి ప్రదేశం లేదు. అంతకుముందు సంవత్సరంలో వచ్చిన వరద కారణంగా మీరు చేరి ఆ ప్రదేశం అంతా వాటర్ తో నిండిపోయింది. తర్వాత ఎలాగో ఇక్కడ షూటింగ్ చేయడానికి వీలు కాదు కాబట్టి ముందుకు వెళితే దారపల్లి వాటర్ ఫాల్స్ వస్తుంది. అక్కడైనా మా షూటింగ్ చేద్దామని అనుకున్నాము. అలా కొంత దూరం వెళ్ళాక దారిలో సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ సమయంలో మేము బైక్ మీద ప్రయాణించేటప్పుడు ఎండ సుర్రుమంటూ మాకు మోఖాలకి తాకేది. అలా ఉన్నప్పుడు ఎవరైనా ఊహిస్తారా వర్షం పడుతుంది అని. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు.

షూటింగ్ పెండింగ్:-

వర్షం అయితే బోర్న కురుస్తోంది. కుండబోత వర్షంగా మాకు సడన్గా దర్శనం ఇచ్చింది. మా జేబులో లక్ష రూపాయల విలువైన మొబైల్స్ ఉన్నాయి. ఆ వర్షంలో తడిస్తే అవి పాడైపోతాయేమో అని భయం వేసింది. మొబైల్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ అయినప్పటికీ ఎక్కువసేపు వర్షంలో నానిపోతే ఏ మొబైల్స్ మాత్రం పనిచేస్తాయి. అందుకే మాకు మెల్లిగా టెన్షన్ మొదలైంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవేమో అని అనుకున్నాము. నేనైతే వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసాను. కానీ మా తమ్ముడు ఇంత దూరం వచ్చాక మళ్లీ ఎలా వస్తాం. సమయం అసలే తక్కువ ఉంది. ఈరోజుని వృధా చేయడానికి వీలు లేదు. ఎలాగైనా వీడియో షూటింగ్ అయిపోవాల్సిందే అని అన్నాడు. నాకు నిజమే అనిపించింది. ఇంకొక తమ్ముడు ఏమన్నాడంటే మేఘాలు అలా వెళ్ళిపోతున్నాయి. వర్షం కూడా కాసేపటికి ఆగిపోతుంది అని అన్నాడు. వర్షాన్ని చూస్తే నాకు అలాగే అనిపించింది. అయినా ఈ సడన్గా వచ్చిన వర్షం ఎక్కువసేపు ఉండదని మనకు తెలిసిందే కదా.

దిక్కులేదు :-

అంత వర్షంలో మాకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. నేను పూర్తిగా తడిసిపోతే డ్రెస్ పాడైపోతుంది. అప్పుడు వీడియో తీసిన సరిగా రాదు. నన్ని అలాగే మొబైల్స్ సేఫ్ గా ఉండేలా ఏదైనా ప్రదేశం ఉంటే బాగున్ను అనుకున్నాం. అలా కొంచెం తడుచుకుంటూ ముందుకు వెళ్ళగానే మా అదృష్టవశాత్తు అమ్మవారి గుడి కనిపించింది. అంతటి అడవిలో కూడా ఇలా గుడి ఉండటం మంచిది అయింది. బహుశా ఇలాగా ఆలోచించే ఆ గుడి కట్టి ఉంటారు. త్వరగా బైక్ ఒక పక్కన పెట్టేసి మే ముగ్గురం ఆ గుడి లోపలికి వెళ్లిపోయాము. వర్షం తగ్గేదాకా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ గుడి దగ్గర నుంచి ఆ డ్యాము పై కొండల మధ్యలో నుంచి వర్షం కురుస్తుంటే ఎంతో సుందరంగా ఉంది. షూటింగ్ జరగలేదన్న టెన్షన్ మనసులో ఉన్నప్పటికీ ఆ ప్రదేశాన్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు మేము వచ్చిన పని కూడా అయిపోతే బాగున్ను అనిపించేది.

హమ్మయ్య : –

అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఎదురు చూడగా ఒక అరగంటలో వర్షం ఆగిపోయింది. అమ్మయ్య అనుకున్నాం. నేను అంతగా తడవలేదు. నా జుట్టు అలాగే నా డ్రెస్సు బాగానే ఉంది. వీడియోలో బాగానే పడుతుంది అనుకుంటూ బైక్ తీసుకొని ప్రయాణం కొనసాగించాం. అంతా బాగానే ఉంది అని అనుకునే సమయానికి కొంచెం దూరం వెళ్లాక మళ్లీ ఫుల్ గా జడివాన వచ్చేసింది. నేను రాసిన పాటలో వర్షంతో కొన్ని పదాలు ఉంటాయి. కొంపదీసి ఇది వర్షం పాట కనక వర్షం పడుతుందా అని అనిపించింది. దారిలో మొత్తానికి వర్షం నా తల నా డ్రెస్ ని తడిపేసింది. తడిసి ముద్దయిపోయాం. వీడియో ఇంకా వద్దులే తర్వాత వద్దాం అని అనిపించేసింది. కానీ ఇంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి వెళ్ళిపోలేం. మనసు అందుకు ఒప్పుకోలేదు. వీడియో తీయడానికి మెల్లగా ప్రయత్నం చేశాం.

అవుట్ లుక్ :-

నేను చూడటానికి ఎలా ఉన్నానంటే తల అప్పుడే కటింగ్ చేయించుకున్న వాడిలాగా, బోడిగా డిప్ప కటింగ్ లాగా అయిపోయింది. వీడియోలో తడిసిపోయిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ కూడా తేడాగా వస్తోంది. ఇంత దూరం వచ్చాం కాబట్టి షూటింగ్ తీయడం మొదలుపెట్టాం. లోకేషన్ మాత్రం చాలా బాగుంది. కొండపై నుంచి వాటర్ అలా పడుతూ ఉంటే ఆ పక్కన నేను నిలబడి వీడియో తీస్తుంటే రెండు కలిపి వీడియో అద్భుతంగా వస్తోంది. ఆ వీడియోలో నా ఎక్స్ప్రెషన్ తప్ప మిగతా అన్ని బాగున్నాయి. అక్కడే రకరకాల ప్రదేశాలలో ఒకసారి కూర్చొని, ఇంకొకసారి నిలబడి ఇలా వీడియోస్ తీశాము. ఫుల్ గా ఒకసారి, ఆఫ్ ఒకసారి అక్కడున్న రాళ్లకు జారబడి ఒకసారి ఇలా రకరకాల కోణాలలో వీడియోస్ షూట్ చేసాము. వీడియో షూటింగ్ అయిపోయాక కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అన్ని ఒక్కచోటే అయితే వీడియో అంత బాగా రాదు అనుకుని దారిలో పొలాల మధ్య కూడా తీద్దాం అనుకున్నాము.

పొలాల గట్టు :-

ఆ కొండల మధ్య పొలాలు చాలా అందంగా ఉన్నాయి. ఆ పొలాల మధ్యలోకి వెళ్దామంటే వర్షానికి గట్లన్నీ తడిసిపోయి బుడద బురద అయిపోయాయి. ఆ పొలాల గట్ల మీద నడిచామంటే జారియా పొలాలలో పడిపోతాం. ఒంటిగంట బురద అయిపోతుంది. ఇంకా ఆ గట్ల మీద నడిస్తే షూ పాడైపోతాయి. వాటిని ఉతికిన అవి మళ్లీ తెల్లగా రావు. బురద అంతా అలా ఉంది. సరేలే ఎలాగో వాటర్ ఫాల్స్ దగ్గర వీడియోస్ బాగానే తీసుకున్నాం కదా అనుకున్నాము. అవి సరిపోతాయిలే ఏవైనా బిట్స్ తక్కువ అయితే ఇంటికాడ చూసుకుందాం. దగ్గర్లో ఒక ముక్క షూటింగ్ తీసి కలిపేద్దాం అనుకున్నాం. తిరిగి తడిచిపోయిన బట్టలతో ఇంటికి ప్రయాణం అయ్యాము. అక్కడ సిగ్నల్ లేకపోవడంతో మాకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని ఆగిపోయాయి. కొంచెం దూరం వెళ్ళాక సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ వచ్చాక మిస్డ్ కాల్ సేజెస్ వచ్చాయి.

ఫైనల్ గా :-

దారిలో రోడ్డు పక్కన బైకు ఆపి వచ్చిన కాల్స్ లో ఇంపార్టెంట్ కాల్స్ ఏమైనా ఉన్నాయా అని చూసాము. ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తే ఎందుకు చేశారా అని కనుక్కొని కాసేపు మాట్లాడాము. తరువాత తిరిగి ఇంటికి ప్రయాణం మొదలుపెట్టాము. వర్షం పడిన తర్వాత లొకేషన్ అంతా వేరే విధంగా మారిపోయింది. చల్లగాలితో సాయంత్రం వేళ బైక్ మీద వెళుతూ ఉంటే అక్కడి ప్రదేశాలు చాలా బాగా అనిపించాయి. ఇలా రోజు ఏదో ఒక సమయంలో బైక్ మీద ఇలా షికారికి వెళ్తే బాగుండు అనిపించింది. మేము వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఐదున్నరకి బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయిపోయింది. అంటే చీకటి పడిపోయింది. అయినా సరే ఎలాగైనా అనుకున్న పని అయింది అనే ఉత్సాహంలో ఉన్నాము. మొత్తానికి వీడియో షూటింగ్ కంప్లీట్ అయింది.

ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి హారిక పేరుతో పాటని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download

హారిక సాంగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్లో, ఇంస్టాగ్రామ్ లో లైక్స్ చూస్తే అర్థమవుతుంది. మీకు ఆ పాట చాలా బాగా నచ్చింది అని. చాలామంది వారి పేర్లతో కూడా అదే విధంగా సాంగ్ చేయమని అడిగారు కామెంట్ చేశారు. కచ్చితంగా వాళ్ళందరి పేర్లతో కూడా ఈ వెబ్ సైట్ లో సాంగ్స్ అప్లోడ్ చేస్తాము. అందరి పేర్లతో సాంగ్స్ చేయడానికి మాకు మీ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ చాలా అవసరము. దానికోసం మా instagram పేజ్ ని ఫాలో అయ్యి మీకు కావాల్సిన పేరుతో సాంగ్ అనే కాకుండా మేము చేసిన సాంగ్ ఎలా ఉందనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అప్పుడు మాకు ఎన్ని సాంగ్స్ అయినా చేయాలి అనిపిస్తుంది.

అసలు విషయం :-

వీడియో షూటింగ్ అయిపోయింది కదా ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాలి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలి అనుకున్నాను. ఎడిటింగ్ స్టార్ట్ చేసేక వీడియోస్ ని ఇంపోర్ట్ చేస్తుంటే వీడియోలో నా ఫేస్ అస్సలు నచ్చలేదు. షూటింగ్ ప్రదేశం చాలా బాగుంది కానీ నాకు నేను నచ్చలేదు. ఈ వీడియో పోస్ట్ చేస్తే ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారు అనిపించింది. సాంగ్ ఎలా ఉన్నప్పటికీ మనం కూడా కొంచెం గ్లామరస్ గా కనిపించడం వీడియోకి అందాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ వీడియోస్ ని ఎడిటింగ్ చేయాలని అనిపించలేదు. షూటింగ్ ఎక్కడైనా వీడియో అందంగా వస్తే చాలు. మళ్లీ మా ఊరు దగ్గరలో ఉన్న పొలాల గట్ల మధ్య షూటింగ్ చేశాము.

వీడియో లుక్ :-

ఈసారి వీడియో అయితే అదిరింది. ఒక టు అవర్స్ లో వీడియో షూటింగ్ అయిపోయింది. పొలాల గట్ల మీద అక్కడక్కడ అరటి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు కూడా ఉన్నాయి. పొలాల గట్ల మీద అలా చెట్లు ఉండటం చాలా అందంగా ఆ ప్రదేశం ఉంది. చిన్న చిన్న కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఈసారి నేను కూడా అదిరిపోయే ఔట్ ఫిట్ వేసాను. లొకేషన్ తగ్గట్టుగా ఉగాదికి తగ్గట్టుగా నేను మరియు ఆ ప్రదేశం ఉన్నాయి. వీడియో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి వెంటనే వీడియో ఎడిటింగ్ చేసేసాను. వీడియో ఎడిటింగ్ చేయడానికి రెండు గంటల సమయం పట్టింది. టోటల్గా అవుట్ పుట్ చూస్తే మా ఇంటి దగ్గర ప్రదేశంలోనే వీడియో చాలా బాగా వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు instagram లో ఫుల్ వైరల్ గా మారింది.

ఇట్లు ప్రేమతో మీ శివ

 

 

 

 

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *