అనిత సాంగ్ డౌన్లోడ్
అనిత సాంగ్ – ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం :-
ఇక్కడ మీరు అనిత పేరుతో – లవ్ సాంగ్ ను మరియు బర్త్డే సాంగ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అనిత పేరుతో రెండు సాంగులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్ నా పేరు శివ కుమార్. ఇంస్టాగ్రామ్ లో చాలామంది కామెంట్స్ చేసిన నేమ్ అనిత పేరు. ఇలా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఒక్కరినైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరి పేరుతో సాంగ్ చేయడం సాధారణ విషయం కాదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు పేరుతో సాంగ్ ఉండాలని మా లక్ష్యం. ప్రతిరోజు దానికోసమే మేము పని చేస్తూ ఉంటాము. మీకు మీ పేరుతో సాంగ్ కావాలి అనుకుంటే మన ఇంస్టాగ్రామ్ పేజ్ ని అలాగే మన వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.
ముఖ్య విషయాలు :-
ఈ పేజ్ లో మన జీవితానికి ఉపయోగపడే కొన్ని విషయాల గురించి చర్చించుకుందాం. ఈరోజుల్లో సర్వసాధారణంగా 7, 8 తరగతుల నుంచే Facebook, Instagram, WhatsApp లాంటి సోషల్ మీడియా App లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల లాభాలు మరియు నష్టాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా యువత ఈ సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. దానితోపాటు పెళ్లయిన పెద్దవాళ్లు కూడా ఈ సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకుందాం.
ఉపయోగాలు :-
మొదట సోషల్ మీడియా App లను వాడటం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.
సోషల్ మీడియా ద్వారా ఒక సమాచారాన్ని ఎంతో వేగంగా అందరికీ తెలియజేయవచ్చు. దీనివల్ల ప్రపంచంలో జరిగే కొత్త విషయాలను ప్రతి ఒక్కరి అరచేతిలోకి వెంటనే వచ్చేస్తుంది. ఇంకా దూరంగా ఉన్న బంధువులు మరియు స్నేహితులకు ఈ సోషల్ మీడియా ద్వారా కనెక్టింగ్ లో ఉండవచ్చు. ఎక్కడ ఏం జరిగినా వెంటనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఎలక్షన్లు జరిగినప్పుడల్లా ప్రభుత్వం వేరొక చేతుల్లోకి మారుతూ ఉంటుంది. ప్రభుత్వం మారాక వారు ప్రవేశపెట్టే పథకాలను, జాబ్ నోటిఫికేషన్ లను వెంటనే తెలుసుకోవచ్చు.
మన దగ్గర ఉన్న బంధుత్వాలు & స్నేహితులు మనకి నచ్చకపోతే మనకున్న అభివృద్ధిలతో ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వారితో స్నేహం చేయవచ్చు. ఇలా కొత్త పరిచయాలు కూడా మనకి తెలియని వ్యక్తులతో మనకున్న అభిరుచిలే వాళ్లకి ఉంటే స్నేహం చేసే అవకాశం ఉంటుంది.
వ్యాపారం :-
Instagram, Facebook, WhatsApp లాంటి App సోషల్ మీడియా ఆప్ ల నుంచి కొత్త వినియోగదారులను, కొత్త కస్టమర్లను అధిక సంఖ్యలో రాబట్టవచ్చు. మనం చేసే వ్యాపారం గురించి వీడియోలలో వివరించి ఆ వీడియోల ద్వారా మన వ్యాపారాన్ని ప్రమోట్ చేయవచ్చు. దీనివల్ల మనం చేసే వ్యాపారం గురించి మన ఊరిలోనే కాకుండా ఇతర గ్రామాలకు, నగరాలకు మరియు ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేయవచ్చు. ఈ విధంగానే కొత్త కస్టమర్లను అధిక సంఖ్యలో తక్కువ సమయంలో తీసుకురావచ్చు. ఇలా చేయడం వల్ల మనం చేసే వ్యాపారం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇలా సోషల్ మీడియా ద్వారాగా అనేక రకాల వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
ప్రభుత్వానికి చేరవేయవచ్చు :-
మనం నివసించే గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్లు మొదలైన వాటితో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను నేరుగా గవర్నమెంట్ కి చేరేలా చేయవచ్చు. ఏ విధంగా అంటే రోడ్లు సరిగా లేకుంటే సరిగా లేని రోడ్లను ఫోటో కానీ వీడియో కానీ తీయాలి. తీసిన ఫుటేజ్ ను instagram,facebook లలో పోస్ట్ చేయాలి. తర్వాత వ్యూవర్స్ వాటిని లైక్ అండ్ షేర్ చేస్తారు. దీనివల్ల సమస్య అనేది వేగంగా ప్రభుత్వానికి నోటీస్ అవుతుంది. ఇలా పెద్ద పెద్ద సమస్యలను సోషల్ మీడియా ద్వారా పరిష్కరించవచ్చు. అలాగే ఏదైనా విషయం పట్ల ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాలు చేసి వాటిని పోస్ట్ చేయడం వల్ల కూడా ప్రభుత్వానికి గట్టిగా తెలియ చేయవచ్చు. ఏవైనా పథకాలు కొంతమంది ప్రజల వద్దకు రాకపోయినా ఈ సోషల్ మీడియా ప్రభుత్వాన్నికి తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.
విద్యారంగం :-
ఒకప్పుడు విద్యారంగం అనేది పాఠశాలలో మరియు కళాశాలలో మాత్రమే జరిగేది. అక్కడికే విద్యార్థులు వెళ్లి నేర్చుకోవాల్సి వచ్చేది. ఇంకా పూర్వకాలంలో అయితే గ్రామాలకు దూరంగా వనాలలో గురుకులాలు ఉండేవి. విద్య కోసం ఇళ్లను వదిలి కొన్ని సంవత్సరాల పాటు గురుకులానికి వెళ్లవలసి వచ్చేది. ఒకప్పుడు విద్య అనేది ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారాగా ఎక్కడి నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు. చేతిలోనే అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ రూపంలో, రకరకాల యాప్స్ ద్వారా కోర్సులు కలిగిన విద్యలు ఉంటాయి. వీడియోల రూపంలో కంటెంట్ ఉపాధ్యాయులచే వివరించబడి ఉంటాయి. వాటిని విద్యార్థులు ఎక్కడి నుంచైనా చూసి వారికి కావలసిన విద్యను నేర్చుకోవచ్చు.
నష్టాలు :-
సోషల్ మీడియా అనేది నలుగురిలో ఉన్నప్పటికీ ఎవరికి వారే స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తారు. ఇలా ఒంటరిగా చూసేది కాబట్టి బయట సామాజికంగా మనుషులతో కలిసి ఉండటానికి అవ్వదు. దీనివల్ల ఒంటరితనం అలవాటు అవుతుంది. కొన్ని రోజులకి బయట స్నేహితులను కోల్పోతారు. ఆన్లైన్లో కనెక్టింగ్ పెరిగే కొద్దీ సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మానేస్తారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే శరీరానికి ఉల్లాసం రావాలంటే మనసు హాయిగా ఉండాలి. మనసు హాయిగా ఉంచడానికి బయట సామాజికంగా స్నేహితులతో సరదాగా ఉండాలి. అప్పుడే మెదడులోని ఆందోళకరమైన ఆలోచనలు పోతాయి. ఒత్తిడి లేని జీవితం అవుతుంది. నెమ్మదిగా అందరితో ఉండటం మానేస్తారు. దీనివల్ల మనుషుల మధ్య సంబంధాలు పోతాయి.
సైబర్ నేరగాళ్లు :-
మన గురించి మరియు మన ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. ఫోటోలతో వీడియోలు తో సహా మనం ఎక్కడ నివసిస్తున్నాం అనేది కూడా అందరికీ తెలుస్తుంది. వారిలో సైబర్ నేరగాళ్లు కూడా మనం వివరాలను సేకరిస్తారు. మన కాంటాక్ట్ నెంబర్లు వారి వద్దకు చేరుతాయి. అలాగే మన పర్సనల్ ఫొటోస్ వీడియోస్ వారి వద్దకు చేరుతాయి. మన వివరాల ద్వారా మనకి నేరుగా కాంటాక్ట్ అయ్యి సైబర్ నేరగాళ్లు బెదిరించి డబ్బును లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లకు అవకాశంగా ఉంటుంది ఈ సోషల్ మీడియా.
సోషల్ మీడియా ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో పర్సనల్ వివరాలు తెలియని వ్యక్తులకు రహస్యంగా ఉంచాలి. సైబర్ నేరగాల నుంచి తప్పించుకునే మార్గం ఇదే.
సమయం వృధా :-
సోషల్ మీడియా వల్ల అనేక రకాల పరిచయం లేని వ్యక్తులు స్నేహితులు అవుతారు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికొకరు అడిక్ట్ అవుతారు. దీనితో అక్కరలేని చాటింగులు మొదలవుతాయి. అలా అలా ఒకరి కోసం ఒకరు తెలుసుకుంటూ ఎన్నో రకాల మాటలు చాటింగ్ చేస్తారు. దాని కారణంగా జీవితానికి ఉపయోగపడే పనులు లేదా తల్లిదండ్రులు మనకు అప్పగించిన పనిని చేయడం మరిచిపోతుంటారు. అదేవిధంగా చదువుకునే సమయంలో ఇలాంటి సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతే ఇంక చదువు గోవింద అన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఈ సోషల్ మీడియాలోకి దిగితే ఆ ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. మన ప్రపంచంలో నుండి దూరం చేస్తుంది. అవకాశాలు అన్నీ పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ సోషల్ మీడియా స్నేహితుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.
తప్పుడు సంకేతాలు :-
కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం అనవసరమైన సమాచారాన్ని వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తారు. జనాలని నమ్మించి మోసం చేస్తారు. ఒక తప్పుడు ప్రజలందరిలో ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ప్రలోభ పరిచే విధంగా సమాచారాన్ని అందిస్తారు. దీనివల్ల కొంతమంది తప్పుడు నిర్ణయాలు. అదే నిజమని నమ్మి ఇంకొంతమందికి షేర్ చేస్తారు. ఈ విధంగా ఒక తప్పుడు సమాచారం అందరికీ వేగంగా చేరి అందరిలో భయాన్ని కలిగిస్తుంది. ఈ భయాలను తొలగించడం కష్టతరం అవుతుంది. అందుకే సోషల్ మీడియాలో ఏదైనా విషయం గురించి చూసినప్పుడు వెంటనే నమ్మేయకూడదు. ఇతరులకు వెంటనే షేర్ చేయరాదు.
ఒకటికి పది సార్లు అది నిజమా కాదా అని తెలుసుకొని అప్పుడు మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఈ తప్పుడు సమాచారం వల్ల తప్పుడు మార్గం ఎంచుకోవాల్సి వస్తుంది.
ఆరోగ్యంలో మార్పులు :-
సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిన వ్యక్తులు రాత్రి ఒంటిగంట రెండు అయినా స్మార్ట్ ఫోను వినియోగిస్తూనే ఉంటారు. దీనివల్ల కళ్లకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ రేస్ కళ్ళలో ఉండే రెటీనాను పాడు చేస్తాయి. దీనివల్ల సైట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. సరిగా నిద్రపోకపోవడం వల్ల శరీరం అలసట తీరదు. లేవగానే హుషారుగా ఏ పని చేయ బుద్ధి కాదు. అలా చేసే పనిని కూడా నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతారు.
ఆరోగ్యానికి నష్టం అలాగే పనులు పెండింగ్లో ఉండటం వల్ల జీవితానికి కూడా నష్టం వాటిల్లుతుంది. రోజురోజుకు ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంటే సోషల్ మీడియా మత్తులో కొంతమంది మునిగిపోతారు. జీవితాలని పాడు చేసుకుంటారు.
సారాంశం : –
ఈ ప్రపంచంలో దేనినైనా అవసరానికే వాడాలి. ఎక్కువగా ఉపయోగించి సమస్యలను మీదకి తెచ్చుకోకూడదు. సోషల్ మీడియాలో అవసరం లేని వారితో స్నేహాలు చేయడం మానుకోవాలి. సోషల్ మీడియాలో రకరకాల విద్యాల గురించి అభివృద్ధి గురించి ఎన్నో మంచి వీడియోలు ఉంటాయి. వాటిని చూసి మన జీవితానికి ఉపయోగపడేలా మంచి విషయాలను నేర్చుకోవాలి. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి. రాత్రిపూట స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించరాదు.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి అనిత పేరుతో పాటలను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Anitha Love Song👇
Anitha Birthday Song 👇
అనిత పేరుతో Love Song మరియు Birthday Song లను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నారు కదా. మీరు ఈ పాటల ద్వారా ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నాను. మీ పేరుతో సాంగ్ దొరికిందని ఆనందించడమే కాదు. మీ ఫ్రెండ్స్ నేమ్స్ తో కూడా సాంగ్స్ వస్తాయి. కాబట్టి మన ఇంస్టాగ్రామ్ పేజ్ని అలాగే మన Shiva K Creations వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.
Nice 👍😊 song broo
Inka sravanthi name pains song 🎵 cheyandi
Plz my wife👰 name cheyagalara..?
Ok but time paduthundi wait cheyyandi