గీత సాంగ్ డౌన్లోడ్
గీత – పేరుతో సాంగ్ – ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నా గురించి కొంచెం :-
నా పేరు శివకుమార్. గీత పేరు మీద సాంగ్ రాయడానికి నాకు 10 రోజుల సమయం పట్టింది. దానిని ఆడియోగా చేయడానికి ఇంకొక ఫైవ్ డేస్ టైం పట్టింది. మొత్తం మీద ఈ సాంగ్ పూర్తవడానికి 15 రోజుల సమయం పట్టింది. ఎన్ని డేస్ పట్టిన, ఎంత కష్టం అనిపించినా సాంగ్ కంప్లీట్ చేయడం నాకు ఇష్టం. ఎందుకంటే పాటలు రాయడమైన, స్టోరీస్ రాయడమైన నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైనా పనిమీద ఇష్టం ఉంటే ఎంతటి కష్టాన్నయినా మరిచిపోవచ్చు. ఎంత కష్టమైనా పని అయినా హాయిగా చేసుకోవచ్చు. నాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం నేను గీత పేరుతో సాంగ్ చేయాలి అనుకున్నాను.
ఇలా ప్రతిరోజు ఏదో ఒక పేరుతో సాంగ్ మన ఈ ‘ Shiva K Creations ‘ వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాము.
పక్కాగా వస్తుంది :-
ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇంకా ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉన్న అందరి పేర్లతో సాంగ్స్ అప్లోడ్ చేయడమే మా యొక్క ఉద్దేశం. మేమైతే చాలా పెద్ద పని పెట్టుకున్నాము. ఎప్పటికప్పుడు అనేక రకాల పేర్లతో సాంగ్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. కాస్త ఓపికగా మీరు వేచి ఉంటే మీ పేరుతో కూడా సాంగ్ ఏదో ఒక రోజు వస్తుంది. అందరినీ ఆనందింప చేయాలనే కోరిక మాకు ఎప్పటికీ ఉంటుంది. అలాగే మా ఓపిక కూడా ఎప్పటికీ నశించదు. అందరి నేమ్స్ అప్లోడ్ చేయాలని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే వరకు మేము పని చేస్తూనే ఉంటాము.
రోజు సాంగ్స్ చేస్తూనే ఉంటాము. ఎవరో ఒకరి నేమ్స్ తో కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయిన నేమ్స్ తో సాంగ్స్ ని వెంటనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. వెబ్ సైట్ లో అప్లోడ్ చేసిన తర్వాత instagram లో వ్యూవర్స్ కి డౌన్లోడ్ చేసుకోమని తెలియజేస్తాము.
వివరణ :-
ఈ ఆర్టికల్ లో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పొద్దున్నే లేచి నా దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. ఇది అలా చేయవచ్చా ఇది ఇలా చేయవచ్చా అని ఏవేవో సతమతమయ్యే ఆలోచనలు ఉంటాయి. ఈరోజు అలాంటి సతమతమైన ఆలోచనలు లేకుండా ఒక క్లారిటీతో ఒక పనిని ఎలా చేయాలో తెలుసుకుందాం. అవి హిందూ సంస్కృతిలో ఉన్న పూజలు విషయంలో అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ సమాచారం కేవలం మేము కొంతమంది అయోమయపు ఆలోచనలను సరిదిద్దడం కోసం మాత్రమే. ఎవరిని హేళన చేసే ఉద్దేశం కాదు.
సమాజమంతా మంచి బంధుత్వాలతో కలిసిమెలిసి అన్ని పండగలు జరుపుకొని ఆనందంగా ఉండాలని ఆశతోనే ఇలాంటి విషయాలు చెబుతున్నాము.
పూజలు :-
కొంతమందికి బొట్టు పెట్టుకోవడంలో సందేహం ఉంటుంది. బొట్టు పెట్టుకోవడం అనేది ఒక మంచి అలవాటు. ఎందుకంటే ఆడవారు కానీ, మగవారు కానీ నుదిటిన బొట్టు పెట్టుకోవడం చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది మానవ శరీరం మొత్తానికి శక్తి కేంద్రం నుదిటి మధ్యభాగం. నుదిటి మధ్య భాగంలో బొట్టు పెట్టుకోవడం వల్ల శక్తి కేంద్రాన్ని ఉత్తేజపరిచి శక్తి వేగంగా శరీరం అంతట ప్రవహిస్తుంది. దానివల్ల శరీరం అంతా ఉత్సాహంగా ఉంటుంది. రెండవ ఉపయోగం నుదిటిన బెట్టు పెట్టుకోవడం వల్ల ఏ పని మీద అయినా కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత పెరుగుతుంది. దానితో ఏ పనైనా సులువుగా చేసుకోవచ్చు.
అలాగే జ్ఞాపక శక్తి పెరగాలంటే నుదిటిన బొట్టు పెట్టుకోవాల్సిందే. ఇంకా నుదిటిన బొట్టు పెట్టుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనల వల్ల కలిగిన ఒత్తిడిని నియంత్రణ చేస్తుంది. ఆందోళన ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా చేస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు :-
నుదిటిన బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బొట్టు పెట్టుకోవడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది. తలనొప్పి, సైనస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. బొట్టు అనేది మనకు జీవితానికి అవసరమయ్యే సానుకూలమైన ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. మన ఆలోచన తీరు మారేలా చేస్తుంది. గందరగోళమైన ఆలోచనలను తగ్గించి మెదడు యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనితో మనం ఏ పనైనా ప్రశాంతతతో, ఏకాగ్రతతో సులభంగా అయ్యేలా చేస్తుంది.
పనులన్నీ సక్రమంగా అవుతుంటే జీవితం ఒక మంచి మార్గంలో నడుస్తుంది. ఇలా మనకు కావాల్సిన పనులన్నీ అవడం చేత మన మనసుకి మెదడుకి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేకపోవడం చేత ఏ అనారోగ్యం మన దరిచేరదు. పూటకొక టాబ్లెట్ వేసుకోనవసరం లేదు. కాబట్టి బొట్టు పెట్టుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.
భక్తి మార్గం :-
హిందూ సంస్కృతిలో బొట్టు పెట్టుకోవడం అనేది దేవుడు మీద నమ్మకాన్ని సూచిస్తుంది. ఎవరైనా బొట్టు పెట్టుకుంటే వారు హిందూ సంస్కృతిని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే హిందూ సంస్కృతిలో బొట్టు పెట్టుకోవడం అనేది ఆచారంగా ఉంటుంది. చాలామంది బొట్టు పెట్టుకోవడం లో ఉన్న ఉపయోగాలు తెలియకుండానే పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడం మంచిదే అయినప్పటికీ ఉపయోగాలు కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే కొంతమంది హిందూ సంస్కృతిలో ఉన్నవాళ్లే బొట్టు పెట్టుకోవడం ఎందుకులే అన్నట్టుగా వదిలేస్తారు. మరి వాళ్లకు మన సంస్కృతిలో ఉన్న ఆచారం వెనుక ఉపయోగాలు చెప్పాలంటే ఈ విషయాలు తెలిసి ఉండాలి మరి.
కొంతమంది దేవుడి మందిరాలకు వెళతారు పూజలు చేస్తారు. బొట్టు కూడా పెట్టుకుంటారు. అయినప్పటికీ వారు చేసే అధర్మాన్ని మాత్రం విడిచి పెట్టరు. వారి దృష్టిలో దేవుడి దగ్గరికి వెళితే ఎలాంటి పనులు చేసిన క్షమించేస్తాడు అని అనుకుంటారు. కానీ కర్మకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మందిరాలకు వెళ్లడం,పూజలు చేయటం నుదిటిన బొట్టు పెట్టుకుని అమాయకుడిలా నటిస్తూ మోసాలు చేస్తే కర్మ నుంచి తప్పించుకోలేరు. వీటన్నిటితో పాటు మనసులో ధర్మం ఉంటే కనుక దేవుడు కాపాడుతాడు. అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బొట్టు పెట్టుకోవడం అలవర్చుకుంటే ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉన్నట్టే మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిర్ణయాలను తీసుకుంటుంది.
ఉమ్మడి కుటుంబాలు :-
అప్పుడున్న కుటుంబాలు – మన పెద్దలు ఈ ఉమ్మడి కుటుంబాలలో ఉన్న సంతోషాలన్నీ చూశారు. ఎంతో ఆనందించారు. అన్ని కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి ఉంటూ, అందరూ కలిసి ఒకే పనిని చేస్తూ, ఒకరి తోడుగా ఒకరే ఉంటూ, పండగలలో, శుభకార్యాలలో చాలా సందడి చేసేవారు. అలాంటి సందడి ఇప్పుడు మనకు కావాలంటే వీలు కాదు. ఎందుకంటే అప్పటిలో కుటుంబాలన్నీ కలిసి ఉన్నప్పుడు, చాలామంది ఎంత దగ్గర బంధువులు అయినప్పటికీ, సొంత తోబుట్టువులు అయినప్పటికీ నమ్మించి మోసం చేసి స్వార్థంగా వాళ్లే పైనుండాలి అని తప్పుడు పనులన్నీ చేసేసారు. తర్వాత తరువాత పక్కన ఉన్న తోబుట్టువుని కూడా నమ్మే పరిస్థితి పోయింది.
బోర్ కొట్టిందేమో :-
కలిసి ఉంటే ఎంతో సందడి ఉంటుంది. నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఎంత కొత్తదనం అయినా ఎప్పటికైనా పాతది అయిపోతుంది. కొంతకాలానికి బోర్ కొడుతుంది. అలాగే అన్ని కుటుంబాలు కలిసి ఉండటం కూడా మన పెద్దలకి బోర్ కొట్టిందేమో. అందుకే కుటుంబాలను విడగొట్టే పన్నాగాలు పన్నారు. ఒకరు పని ఆపుకొని మరి ఇంకొకరు ఎదుగుతుంటే ఎలాగైనా చెడగొట్టేవారు. కిందకి లాగేసేవారు. ఇలా చాలా ద్రోహాలు, చాలా మోసాలు జరిగిన తర్వాత కుటుంబంలో ఎవరినైనా నమ్మడం కష్టతరమైంది. తప్పుడు పనులు చేసే వారిని బాధ్యతలు మోయడంలో అర్థం లేదనిపించింది. అందుకే ఇప్పుడు ఎవరి కుటుంబం వాళ్లు, ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు. కష్టం ఎంతైనా ఎవరి కుటుంబానిది వారిదే. ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు. తోడుగా నిలిచేవారు ఉండరు.
కోపం :-
అలా చేసినందుకు ఇప్పుడు మన బంధువులని ఏమి అన్నా సరే, ఎంత తిట్టుకున్నా సరే, తిరిగి ఆ సందడి ప్రపంచం ఎప్పటికీ రాదు. నిజానికి ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిని ఎవరు మార్చలేరు. కానీ ఒక్క అవకాశం ఉంది. పాత కుటుంబాలు మనలో ఎప్పటికీ కలవవు. అప్పటి పద్ధతులు, అప్పటి మాటలు, అబద్ధాలు,మోసాలు ఇవన్నీ తలుచుకుంటూ వారిని యాక్సెప్ట్ చేయలేము. చేయవలసిందేమిటంటే ఇప్పటి నుంచైనా మన తోబుట్టువులను ప్రేమగా చూసుకోవాలి. వారి జీవితానికి ఉపయోగపడే సలహాలు మాత్రమే ఇవ్వాలి. మన మాట నమ్ముతున్నారు కదా అని చెప్పి వాళ్లని పాడు చేసే సలహాలు ఇవ్వకూడదు. అలా బంధాలు నిలబడతాయి.
కొత్తగా పెళ్లిళ్లు చేసుకుంటూ, కొత్త జీవితాలను ప్రారంభిస్తూ, కొత్త మనుషులను కలుపుకుంటూ ఉంటే మళ్లీ అప్పటి సందడిని తీసుకురావచ్చు. అప్పటి మనుషులు మారకపోయినా మనం మారి మన కుటుంబాలని మార్చుకోవచ్చు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే వారందరికీ పెళ్లిళ్లు అయిపోతే కొత్త జీవితాలు ప్రారంభమవుతాయి.
వారికి పుట్టే పిల్లలు ఒక జంటకి ఇద్దరూ అయినప్పటికీ, ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే నలుగురు పిల్లలు అవుతారు. ముగ్గురు ఆరుగురు అవుతారు. ఇంకా చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఉంటే ఇలా పెద్ద సంఖ్యలో కొత్త జనరేషన్ మొదలవుతుంది. ఈ జనరేషన్ దృష్టిలో పెట్టుకుని అందరితో మంచిగా ఉంటే మళ్లీ అప్పటి సందడిని ఇప్పుడు తీసుకురావచ్చు.
అదే సందడి :-
ఉమ్మడి కుటుంబాల ఆనందాన్ని మనం కూడా పొందవచ్చు. పాత మనుషులను, వారు చేసిన తప్పుడు పనులను, పూర్తిగా మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కొత్త మనుషులను తయారు చేసుకోవాలి. అప్పుడే అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయి. బంధుత్వాలు బాగుంటాయి. ఈ ప్రపంచం అందంగా మారుతుంది. ఈ భూమ్మీద జీవించాలని ఆశ, నమ్మకం వస్తాయి.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి మీరు గీతా పేరుతో సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గీత పేరుతో పాటను instagram పాడు క్యాస్ట్ ఛానల్లో ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. కొంతమందికి ఈ పేరుతో సాంగ్ చేశానని తెలుసు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల. కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్లకు తెలియదు. అందుకనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. ఈ ఒక్క గీత పేరుతోనే కాదు ఏ పేరుతో అయినా సాంగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినప్పుడు. ఇన్ఫర్మేషన్ ఆ చానల్లో ఇస్తాము. ఎందుకంటే ప్రతి సాంగ్ కి ఒక వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ చేసి instagram లో పోస్ట్ చేయలేం కాబట్టి. ఇలా చేస్తాము.
ఇలా ఈ వెబ్ సైట్ ద్వారాగా పాటలను డౌన్లోడ్ చేసుకుంటూ, కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. కాబట్టి మన వెబ్సైట్ గురించి అందరికీ షేర్ చేయండి. వీలైనంత సమయం కేటాయించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. దీనితో మీకు కావాల్సిన విధంగా సరికొత్తగా మా ఆలోచనలను మేము మార్చుకుని కంటెంట్ చేస్తాము. ఇట్లు ప్రేమతో మీ శివ.