Ammu Name Song – Shiva K Creations

Shiva
By Shiva

అమ్ము – సాంగ్ డౌన్లోడ్ 

Ammu Name Song Download

అమ్ము – పేరుతో సాంగ్ ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరిచయం :-

హలో ఫ్రెండ్స్ అమ్ము పేరుతో సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు ఈ పేజ్ కి వచ్చారని నాకు తెలుసు. ఈ పాటను తయారుచేసిన నా గురించి మీరు తెలుసుకోరా. చెప్పేస్తున్నానండోయ్ నా పేరు శివకుమార్. ఒక పాతిక సంవత్సరాలు వచ్చిన వ్యక్తి రాయడం మొదలుపెట్టాడు అంటే. అది అప్పుడే వచ్చిన టాలెంట్ కాదు. నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం అని కాదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్తున్నానండి. ఒక వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడు నవ్వుతూ సరదాగా ఉండాలి అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు సరదాగా మాట్లాడడం ఇష్టం అని చెప్తున్నాను. అలా అని మొత్తానికే కాలక్షేపం కబుర్లు చెప్తానని అనుకోకండి. అందులోనే మళ్లీ జీవితానికి ఉపయోగపడే విషయాలు కూడా ఉంటాయి.

వివరణ :-

ఈ ఆర్టికల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో జరిగే కొన్ని వింతలు.

అలాగే మానవులు చేసిన కొన్ని అద్భుతాలు, అంటే ఈజిప్ట్ దేశంలో నిర్మించిన పిరమిడ్లు గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు.

మరికొన్ని సైకాలజీ ఫాక్ట్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ సైకాలజీలో ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది. అనే విషయాలు తెలుసుకోవచ్చు.

ఈ ప్రపంచంలో ఉన్న సముద్రాల గురించి మరియు ఆ సముద్రాలు ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతున్నాయి. వాటి లోతు ఎంత. సముద్రాలలో దాగి ఉన్న సంపద ఇలా ఎన్నో విషయాలు సముద్రాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

మొదటి fact :-

మొదటగా మనం సముద్రాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సముద్రం ఉన్న ఎన్నో జీవరాసులకు, మానవులకు జీవనాధారంగా ఉంటాయి. ఈ భూ ప్రపంచం మొత్తం మూడు వంతులు సముద్ర నీటితోనే ఆక్రమించబడి ఉంది. ఒక వంతు భూమి మీద ఉన్న ప్రకృతికి మరియు మానవాళికి ఈ సముద్రాలు ఎంత అవసరం.

సముద్రాల రకాలు :-

సముద్రాలలో అన్నిటికంటే పెద్ద సముద్రం – పసిఫిక్ మహాసముద్రం. రెండవ పెద్ద సముద్రం – అట్లాంటిక్ మహాసముద్రం. మూడో మహాసముద్రం పై రెండు మహాసముద్రాలు కంటే చిన్న సముద్రం ఈ మహాసముద్రం భారతదేశంలో ఉంది కాబట్టి హిందూ మహాసముద్రం అంటారు. ఈ సముద్రం మూడవ పెద్ద మహాసముద్రం. నాల్గవ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఐదవ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం.

సముద్రంలో సంపద :-

సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. ఆ సముద్రపు చేపలను తినడం మనుషులు ఎక్కువగా ఇష్టపడతారు.

ఆ చేపలను ఇతర రాష్ట్రాలకు మరియు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. చేపలను, రొయ్యలను అలాగే పీతలను చాలా మోతాదులో ఎగుమతి చేస్తారు. దీనితో వచ్చే సంపద అంతా ఇంతా కాదు. కేవలం వీటిని అమ్మడం వల్ల వచ్చే చేపలనే కాకుండా సముద్రంలో చాలా రకాల సంపద దాగి ఉంది.

పెట్రోల్ పరిశ్రమలు :-

ఉదాహరణకి ఆయిల్, పెట్రోల్ పరిశ్రమల ద్వారా చాలా సంపద వస్తుంది. ఎందుకంటే పెట్రోల్, ఆయిల్, గ్యాస్ లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అధిక సంపద వీటి నుంచి కూడా వస్తుంది.

సొర చేపల మలం : –

ఇవే కాకుండా పెద్ద పెద్ద తిమింగలాలు, సొర చేపలు విడుదల చేసే మలం కూడా చాలా ఖరీదైనది. ఎందుకంటే తిమింగలాలు సొర చేపలు విడుదల చేసిన మలం కొద్ది రోజులకి ఒక రాయి లాగా తయారవుతుంది. దీనిని ఖరీదైన సువాసన తెప్పించే సెంట్లలో ఈ మలాన్ని వాడుతారు. ఇది అత్యంత ఖరీదైనది.

అంతేకాకుండా సముద్రంలో లభించే ముత్యాలు, అనేక రకాల రాళ్లు, ఖనిజ సంపద లాంటి ఎన్నో రకాల సంపదలు సముద్రం నుండి వస్తున్నాయి.

సముద్ర మార్గం :-

సరుకులను ఎగుమతి మరియు దిగుమతి చేయడం కోసం రోడ్డు మార్గం, విమాన మార్గం, రైలు మార్గమే కాకుండా సముద్ర మార్గం కూడా ఒకటి. ఈ సముద్రం గుండా ఇతర దేశాల నుండి మన దేశానికి వస్తువు దిగుమతి జరుగుతుంది. అలాగే మన దేశం నుంచి కూడా అనేక రకాల వస్తువు ఎగుమతి కూడా జరుగుతుంది. ఉదాహరణకి బియ్యం, పప్పులు, గోధుమలు, చేపలు, రొయ్యలు, పీతలు, అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, మోటార్ వెహికల్స్ ఈ విధమైన వస్తువులన్నీ కూడా ఇండియాకి ఎగుమతి అవుతాయి. అలాగే అధిక మోతాదులో ఎలక్ట్రానిక్ వస్తువులు మోటార్ వెహికల్స్ ఇతర దేశాల నుండి మన దేశానికి దిగుమతి అవుతాయి. ఇలా సముద్రమార్గం గుండా ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి.

సముద్రంలో అద్భుతం :-

ఇప్పటివరకు సముద్ర మార్గం ద్వారా జరిగే ఎగుమతులు దిగుమతులు గురించి మాట్లాడుకున్నాం. అలాగే సముద్రంలో దాగున్న సంపద గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే సముద్రమార్గాన్ని టూరిస్టర్స్ కోసం ఎలా వాడుతున్నామో తెలుసుకుందాం.

సముద్రంలో నివసించే అన్ని రకాల జీవరాశులను చూడటానికి మరియు అక్కడి వాతావరణాన్ని మంచి అనుభూతి చెందడానికి సముద్ర మార్గంలో అత్యంత ఖరీదైన షిప్పులలో ట్రావెలింగ్ చేసే విధంగా షిప్పులు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆ షిప్పులో ప్రయాణం చేయడం అదృష్టం ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏడు వింతలు ఉంటే ఈ cruise షిప్ అనేది ఎనిమిదవ వింత.

ఇది చాలా ఎత్తయిన షిప్ ఇందులో అనేక రకాల పార్కులు ఉంటాయి. ఇంకా ఎన్నో రకాల రెస్టారెంట్లు ఉంటాయి. అలాగే వివిధ రకాల ఆటలు వాడే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇవన్నీ భూమి మీద కాదండి ఇవన్నీ షిప్ లో ఉంటాయి. వింటుంటేనే ఎంతో బాగా అనిపిస్తుంది కదా. నిజంగా చూస్తే ఎంత బాగుంటుందో అర్థం అయిపోతుంది కదా మనకే. కానీ చాలా ఖర్చుతో కూడుకున్నదంటే మీరు నమ్మాలి.

మొత్తం ఖర్చు :-

ఈ షిప్పులో ప్రయాణం చేయడానికి ఒక ఖండంలోని దేశాలను చూపించడానికి అయితే 10 లక్షలు పెట్టాలి. 10 లక్షల కి మొత్తం ఫ్యామిలీ అనుకుంటారేమో కాదండోయ్. ఒకే ఒక్క గారికి 10 లక్షలు అవుతుంది. ఒక ఫ్యామిలీలో గనక ఏడు ఎనిమిది మంది ఉంటే కోటి రూపాయలు ఖర్చయిపోతుంది. చూసారా ఎంత ఖర్చు  అవుతుందో. ఇంత ఖర్చు మన వల్ల అయితే కాదు. కానీ అలాంటివి చూడాలని ఆశ మాత్రం ఎవరికి ఉండదు చెప్పండి. నాకు అలాగే అనిపిస్తుంది. అవన్నీ చూడాలని నాకు ఎప్పటినుంచో ఉంది. పది రోజుల నుంచి 15 రోజులు ఇంకా 30 రోజులు వరకు కూడా ప్యాకేజీలు ఉంటాయి. ఎందుకంటే ఆ షిప్ లో ఉన్న వింతలను చూడడానికి ఎన్ని రోజులైనా ఉండాలి మరి. ఒక రెండు మూడు రోజులు చూస్తే అందులో ఉన్న వింతలన్నీ చూడలేము.

ప్రయత్నం ఉండాలి :-

అలాంటి షిప్ లో కచ్చితంగా తిరుగుతానని అనుకుంటాను. నేనైతే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను చేయలేను అని ఎప్పటికీ అనుకోను. నావల్ల అయ్యే ప్రయత్నం నేనైతే కచ్చితంగా చేస్తాను. ఎప్పటికైనా వెళ్తాను అనే నమ్మకం నాకు ఉంది. ఎవరైనా ఆ విధంగానే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వీలు కాకపోయినా ధైర్యంగా ముందుకు సాగాలి. మనతో ఏవైతే అవుతాయో అవే అవుతాయి. నిజం చెప్పాలంటే అవన్నీ కూడా డబ్బులో పుట్టిన వారికి మాత్రమే అవకాశం గా ఉంటాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వెళ్లడానికి కోటి రూపాయలు అవసరం అవుతుంది. ఎంత ప్రయత్నించినా ఎన్ని ఎన్ని చేస్తే కోటి రూపాయలు మనం సంపాదించగలం. ఫ్యామిలీ అందరితో అలా అంతా ఏడు ఖండాలు తిరిగి రాగలం.

జీవితం అంటే అంతే మనకు నచ్చింది ఎక్కడ ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తూ కాలాన్ని గడిపేయడమే. సాధించిన సాధించకపోయినా ఈ భూమ్మీద మనం చేయవలసింది చేసాం అనుకుని ఉండటమే. ప్రయత్నం చేయకుండా ఉంటే మన తప్పు కానీ ప్రయత్నం చేశాక రాకపోతే అది మన తప్పు కాదు. ఇక్కడ సాధించిన సాధించకపోయినా కాలం మాత్రం గడిచిపోతుంది. ఏ విధంగా మనకు ఉన్న కాలాన్ని గడిపామన్నదే జీవితం. అది ఆనందంగా గడిపితే జీవితం ఆనందమయం అనేక రకాల ఆలోచనలతో హాయ్ ఉమాయ జీవితం అవుతుంది.

ఇక్కడDownloadఅనే దానిపై క్లిక్ చేసి మీరు అమ్ము పేరు మీద పాటని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Download

‘ అ ‘అక్షరంతో మొదలయ్యే పేర్లు చాలా మందికి ఉంటాయి. పేర్లైతే పెట్టుకుంటారు కానీ.  ఈ అక్షరంతో పెట్టుకున్న పేర్లను పక్కన పెట్టేసి చాలామంది ముద్దుగా అమ్ము అనే పేరుతో పిలుచుకుంటారు. అదే పేరుతో ఇప్పుడు నేను పాటని రాశాను అయితే ఈ సగం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పాట మీరు వినే ఇక్కడ వరకు వచ్చారని నాకు తెలుసు. అమ్ము పేరు అంటే మీకు ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. అందుకే కదా అమ్ము పేరుతో ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు.

అమ్ము పేరు మీద ఉన్న ఇష్టం, అమ్ము పాట వైపు వచ్చింది. అదే ఇష్టాన్ని ఆ పాట రాసిన నామీద కూడా చూపిస్తారని అనుకుంటున్నాను. మీరు ఈ సాంగ్ డౌన్లోడ్ చేసుకొని విన్న తర్వాత,మీకు ఈ పాట ఎలా అనిపించింది. మీరు ఎలా ఫీలయ్యారు. ఎవరికోసం ఈ పాటని డౌన్లోడ్ చేసుకున్నారు. అని నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

                   ముఖ్య విషయం 

ప్రపంచంలో 193 దేశాలు ఉన్నప్పటికీ ఏ దేశం పేరుతోను  ప్రత్యేకంగా సముద్రం అనేది లేదు. ఒక మన భారతదేశానికి తప్ప. మన భారతదేశానికి హిందుస్థాన్ అనే పేరు ఉంది కదా. మన భారతదేశంలో అదే పేరుతో హిందూ మహాసముద్రం కూడా ఉంది. ఇదే మన దేశం యొక్క ప్రత్యేకత. ఈ విధంగా ఏ దేశానికి వాళ్ళ దేశం పేరుతో సముద్రం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే మన భారతదేశానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఎన్నో రకాల పప్పు ధాన్యాలు – ఆహార దినుసులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది మన భారతదేశం. చాలా రకాల మసాలాలకు సంబంధించి మిరియాలు, ఎండి మిరపకాయలు, లవంగాలు, దాశించక్క, యాలకులు మొదలైనవి ఎన్నో 70%  వరకు ఇతర దేశాలకు మన భారతదేశమే ఎగుమతి చేస్తోంది.

 

 

 

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *