అను పేరుతో సాంగ్ – డౌన్లోడ్
అను – పేరుతో సాంగ్ – ఈ పాటని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
హలో ఫ్రెండ్స్ నా పేరు శివకుమార్. నేను, మా తమ్ముళ్లు ఇద్దరు కలిసి ఒక పాట రిలీజ్ కోసం వీడియో షూట్ చెయ్యడానికి అరకు వెళ్ళాము. విస్తడం కోచ్ ముగ్గురికి టికెట్స్ బుక్ చేస్తే తాత్కాల్లో చేయడం వల్ల చాలా ఖర్చు అయింది. అయినా పర్వాలేదు అనుకున్నాము ఎందుకంటే సాంగ్ చాలా బాగుంటుంది. కాబట్టి వీడియో అందరికి నచ్చేలా ఉండాలని ఇలా ప్లాన్ చేసాము. షూటింగ్ కోసం అని విస్డం కోచ్ లో టికెట్స్ బుక్ చేసాం. కానీ జర్నీ మాత్రం చాలా బాగుంది. మొదట ఆ కోచ్ లో వీడియోస్ తీసేయడం ఈజీలే అని అనుకున్నాం. అక్కడ వెళ్ళాక అందరూ సైలెంట్ గా ఉండడం చేత వీడియో తీయడానికి కొంచెం కష్టమైంది. అలా కొంచెం సేపు వాళ్లతో జర్నీ చేశాక అలవాటయింది. తర్వాత వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసాము. అరకు వచ్చేసరికి మేము అనుకున్నట్టుగా వీడియో షూటింగ్ అయిపోయింది.
ఉడెన్ బ్రిడ్జ్
అరకు స్టేషన్ వచ్చేసరికి విష్ చేయడం కోచ్ లో తీయాలనుకున్న షూటింగ్ వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మిగిలింది. ఉడెన్ బ్రిడ్జ్ మా ప్లాన్ ప్రకారం ఇక్కడ కూడా వీడియోస్ తీయాలని అనుకున్నాము. ట్రైన్ లో వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. కానీ ఇక్కడకు వచ్చేసరికి వెదర్ కొంచెం చీకటిగా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఆ రోజు మబ్బులు వేసాయి. అందుకని ఆ చెట్ల మధ్యలో వీడియో సూర్యుడు కాంతి లేక క్వాలిటీ సరిగా రాలేదు. ఇంత దూరం వచ్చాము కాబట్టి ఎలాగైనా వీడియో తీయాలి అనుకున్నాం. అలా తీస్తూ ప్రయత్నం చేస్తూ ఉండగా కొంతసేపటికి మళ్ళీ సూర్యుడు వచ్చాడు.
లొకేషన్ అయితే ఇప్పుడు ఇప్పుడే వెలుగుతో నిండింది. మా ముఖాల్లో కూడా కాస్త వెలుగు వచ్చింది. వీడియోస్ తీయడం మళ్ళీ మొదలుపెట్టాము. అక్కడ కొంతమంది కుర్రాళ్ళు మేం వీడియోస్ తీస్తుంటే వెనకాల నుంచి గోల చేసేవారు. మేము అది పట్టించుకోకుండా మా పని మేము చేసుకుని అక్కడి నుంచి వచ్చేసాము. అనుకున్నట్టుగా వుడెన్ బ్రిడ్జ్ దగ్గర కూడా వీడియోస్ కంప్లీట్ చేశాము.
ఎందుకు అలా
షూటింగ్ అయిపోయి 10 డేస్ అయింది. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయింది. కానీ అంతకుముందు షూట్ చేసిన కొన్ని వీడియోస్ పెండింగ్ ఉండటంవల్ల అరకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నాకైతే అరకు వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేద్దామా అని ఉంది. ఆ సమయం కూడా దగ్గరికి రానే వస్తోంది. అరకు వీడియోలో మెయిన్ గా విస్తడం కోచ్ లో స్వాతి పేరుతో సాంగ్ షూటింగ్ చేసాము. ఆ సాంగ్ షూటింగ్ వీడియో చాలా బాగా వచ్చింది. చూస్తారు కదా మీకే తెలుస్తుంది. స్వాతి పేరుతో సాంగ్ కూడా చాలా కొత్తగా నిజంగా సినిమా సాంగ్ ఏ అన్నట్టుగా వచ్చింది. ఆ పాట యొక్క చరణాలు మొదటివి కొన్ని లైన్స్ వింటేనే ఫుల్ సాంగ్ ఎక్కడ అని వెతుక్కునేలా ఆ పాట ఉంటుంది. త్వరగా అప్లోడ్ చేయాలని నాకు ఉంది. సో వీలైనంత త్వరగా నే ఆ పాట వచ్చేస్తుంది. ఇంస్టాగ్రామ్లో చాలామంది స్వాతి పేరు మీద సాంగ్ అడిగారు. అందుకనే మెయిన్ గా ఆ పాట చేయడం జరిగింది.
వీడియో కామెంట్స్
ఇంస్టాగ్రామ్ లో చాలామంది మేము అప్లోడ్ చేసిన వీడియోస్ కి వాళ్ళ నేమ్స్ తో సాంగ్స్ చేయమని కామెంట్ చేస్తారు. అవి వందల్లో కూడా కాదు. వేళల్లో కామెంట్స్ వస్తాయి. కానీ ప్రతి ఒక్కటే నేను ఓపిగ్గా ఎవరు ఏ నేమ్ తో సాంగ్ చేయమన్నారని చూస్తాను. అందరిని నేమ్స్ తో సాంగ్స్ చేయాలని నాకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన ఇంస్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవి కామెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే వాళ్ల నేమ్ తో సాంగ్ చేసి వాళ్ళని కూడా నాకు ఆనందింపజేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక సాంగ్ చేయడానికి మినిమం పది రోజుల సమయం పడుతుంది. దీనితో చాలా పేర్లతో పాటలు పెండింగ్లో ఉండిపోతాయి. కానీ ఎప్పటికైనా మన వెబ్సైట్లో అందరి నేమ్స్ తో సాంగ్స్ వచ్చేలా చేస్తాము. అదే మా లక్ష్యం. ఫ్యూచర్లో ఎవరు ఏ నేమ్తో సాంగ్ వెతికినా మన వెబ్సైట్ వచ్చేలా మేము వర్క్ చేస్తున్నాము. దానికి సమయం పడుతుంది. మీరు ఓపికతో వేచి చూస్తే కచ్చితంగా మీ పేరుతో సాంగ్ వస్తుంది.
ఇంస్టాగ్రామ్ మెసేజెస్
మెసేజ్ రిక్వెస్ట్లలో చాలామంది వాళ్ళ పేర్లతో పాటలు చేయమని మెసేజెస్ చేశారు. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మెసేజెస్ పెట్టారు. కొన్ని ప్రమోషన్స్ మెసేజెస్ కూడా ఉన్నాయి. కానీ నాకు ప్రమోషన్స్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అందులో ఏది నిజమైన ప్రోడక్ట్ అని నేను నమ్మలేను. ఇంకా జనాలని మోసం చేయలేను. అందుకే నేను ప్రమోషన్స్ జోలికి వెళ్ళను. దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. మాది ఎడిటింగ్ ప్రొఫెషన్ కాబట్టి చాలామంది కస్టమర్లు ఉంటారు. దీనివల్ల మేము వర్క్ చేయాలనుకుంటే చాలామంది కస్టమర్లు మా వద్ద ఉన్నారు. కాబట్టి మేము ఏ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు.
మా వద్ద ఉన్న కస్టమర్స్ కి మేము వీడియోస్ చేస్తే సరిపోతుంది. మేము జీవితంలో ఎదగలిగే అంత అవకాశం మా చేతుల్లోనే ఉంది. ఇంక మేము వేరే ప్రమోషన్స్ గురించి ఆశ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇంస్టాగ్రామ్ లో వేరే వాళ్ళ రీల్స్ నాకు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్లు తర్వాత చూసుకునెందుకు వీలుగా ఉండేలా. ఇంకొంతమంది వాళ్ల కంటెంట్ నన్ను చూడమని వాళ్ళ వీడియోస్ నాకు సెండ్ చేస్తారు. నాకు వీలున్నంతవరకు నేను చూస్తాను. చాలామందికి రిప్లై కూడా ఇస్తాను. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను వీడియో షూటింగ్లో మరియు ఎడిటింగ్ లో బిజీగా ఉంటాను.
వాట్సాప్ మెసేజ్
instagram లో కామెంట్స్ చేసిన వాళ్ళందరి నేమ్స్ తో సాంగ్స్ చేయాలని ఉంటుంది. ఇంకా instagram లో మెసేజ్ చేసిన వాళ్ళ నేమ్స్ తో కూడా చేయాలని అనుకుంటాను. కానీ ఒక్కొక్కరి నేమ్ తో సాంగ్ చేయడం పది రోజుల సమయం కంటే ఎక్కువ పడుతుంది. మళ్లీ సాంగ్ చేసిన తర్వాత వీడియో షూట్ చేసి ఆ నేమ్ గురించి instagram లో పోస్ట్ పెట్టాలి. ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక పాటకి 10 టు 12 డేస్ టైం పడుతుంది. అందుకనే నేను ఇలా పోస్ట్ పెట్టడానికి వీడియో షూటింగ్ కి ఎడిటింగ్ కి చాలా సమయం పడుతుంది.
కాబట్టి కావలసిన వాళ్లు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అని చెప్తున్నాను. అయితే వాట్సాప్ లో మెసేజ్ చేసినవాళ్లు స్టూడియో కి మెసేజ్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు మనీ పే చేసి మీకు కావాల్సిన పేరు మీద సాంగ్ చేయించుకోవచ్చు. సో మీకు త్వరగా సాంగ్ కావాలంటే మనీ పే చేసి మా చేత క్రియేషన్ చేయించుకోవచ్చు. కాబట్టి మనీ పే చేసి చేయించుకోగలిగిన వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. లేదా మా వెబ్ సైట్ లో కానీ, ఇంస్టాగ్రామ్ లో కానీ మీ పేరుతో సాంగ్ పోస్ట్ చేసే వరకు వేచి ఉండండి.
కొన్ని విషయాలు
ఒక బంధం సరదాగా సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఉదాహరణకి నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఫ్రెండ్ మీ వద్దకు వచ్చే ప్రతిసారి ఎంతో కొంత ఖర్చు అవుతూ ఉంది అనుకోండి. ఇంకొక ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవడం లేదు. సరదాగా కబుర్లు చెబుతూ కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ఫ్రెండ్ తో ఖర్చు ఉంటుంది ఇంకొక ఫ్రెండ్ తో ఖర్చు అనేది ఉండదు. నిజానికి డబ్బు ఖర్చు చేస్తే ఆనందం రావచ్చు. కానీ ప్రతిసారి డబ్బుని ఖర్చు చేయడం కష్టం. ఎందుకంటే మన దగ్గర ప్రతిసారి డబ్బు ఉండదు. అదే మన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా సరదా ని క్రియేట్ చేసే ఫ్రెండ్తో మనం ఎప్పుడైనా సంతోషంగా ఉండవచ్చు. ఇక్కడ డబ్బు లేనప్పుడు ఒక ఫ్రెండ్ ని మనం ఆహ్వానించలేము. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఆ ఫ్రెండ్ తో సరదా అనేది ఉంటుంది కాబట్టి.
ఇంకొక ఫ్రెండ్ అలా కాదు డబ్బు లేకపోయినా సరదా అనేది ఉంటుంది. ఈ ఫ్రెండ్ ని మీరు ఎప్పుడైనా ఆహ్వానించడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్రెండ్ వల్ల మీ జేబులో డబ్బు లేకపోయినా ఆనందం వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఎవరైతే మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి జేబుతో పని పెడతారో వారితో మనం బంధాన్ని ఎప్పటికీ కొనసాగించలేం. డబ్బుతో ముడిపడి ఉన్న బంధాలు ఎప్పటికైనా విడిపోక తప్పదు. కాబట్టి మీరు ఎవరితో అయినా బంధుత్వం పెట్టుకోవాలి అనుకుంటే డబ్బుతో కాకుండా మంచి మనసుతో, మంచి మాటలతో బంధాన్ని ఏర్పరచుకోండి. ఆ బంధుత్వం ఎప్పటికీ మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ విషయం మీకు తెలిస్తే ఎవరితో అయినా మీరు చాలా ఆనందంగా ఉంటారు.
ఇక్కడ ‘ Download ‘ అనే దాని పై క్లిక్ చేసి అను పేరుతో సాంగ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Anu Song Link 👇
హాయ్ హలో ఫ్రెండ్స్ anu పేరుతో ఫుల్ సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు వచ్చారని నాకు తెలుసు. ఇంస్టాగ్రామ్ లో అను అనే పేరుతో సాంగ్ మీరు చూశారని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వరకు ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి కచ్చితంగా నేను అనుకున్నది అయి ఉంటుంది. అయితే నేను అనుకోవడమే కాకుండా మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయండి. మీ కామెంట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే ఈ విధంగా అనేక పేర్లతో సాంగ్స్ చేయడానికి నాకు కొంత ఉత్సాహం లభిస్తుంది. కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ.
ఎందుకు అలా
ఎందుకు మనుషులు అలా ఉంటారనేది నాకు తెలియదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి చూడటానికి ఎంతో డబ్బు అవసరం. ఆ డబ్బు సంపాదించడం మనం ఎంతో కష్టపడటం అవసరం. దానికి చాలా సమయం అవసరం. ఇవి తెలుసుకోకుండా ఎవరో నాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని ఎదుటి వ్యక్తులను విమర్శిస్తూ సమయాన్ని వృధా చేస్తారు. ఎందుకని మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. మనకంటూ ఒక ప్రొఫెషన్ ఉండి దానిలో పని చేసుకుంటూ వెళ్లి మనకు కావాల్సినవి సంపాదించుకోవచ్చు కదా. బంధాలతో సమయం కుదిరినప్పుడు వారితో సంతోషంగా జీవించవచ్చు కదా. అలా చేయరు. బంధువులతో చిన్న చిన్న వాటి కోసం గొడవలు పడుతూ సరదాలను సంతోషాలను కోల్పోతారు. బంధాల నుంచి కేవలం సరదా కబుర్లు కష్టసుఖాలు పంచుకోవడమే అయితే ఆ బంధుత్వాలు ఎంత బాగుంటాయో కదా. ఇట్లు ప్రేమతో మీ శివ.