Sirisha Name Song – Shiva K Creations

Shiva
By Shiva

శిరీష సాంగ్ డౌన్లోడ్

Sirisha Name Song Download

శిరీష సాంగ్ ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

                      పరిచయం

హలో ఫ్రెండ్స్ నా పేరు శివకుమార్. నేను పాటలు రాయడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్ చేసిన పేరు శిరీష. శిరీష పేరు మీద సాంగ్ చేయమని చాలామంది కామెంట్స్ చేశారు. ఇంకొంతమంది instagram లో మెసేజెస్ కూడా చేసేవారు. చివరగా నాకు అనిపించింది. కొంచెం టైం తీసుకుని శిరీష పేరు మీద ఒక మంచి పాట రాయాలనుకున్నాను. ఆరోజు రానే వచ్చింది. ఈరోజే ఈ పాటను రాయడం మొదలుపెట్టాను. అందరూ కోరుకున్నట్టుగానే ఈ సాంగ్ రాస్తున్నాను. ఈ పాట నేను అనుకున్నట్టుగానే వస్తుందని అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అని గుర్తుంచుకోండి.

                   మొదటి భాగం 

మన కాలేజీలో, మన చుట్టాలలో, మన ఫ్రెండ్స్ లో చాలామంది అమ్మాయిలను చూస్తూ ఉంటాం. కొంతమందితో మాట్లాడుతూ స్నేహం చేస్తాం. మనం ఎంతమందితో స్నేహం చేసిన కలగని ఫీలింగ్ ఎవరో ఒక్కరిని చూడటం వల్ల ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నాకు అనవసరం. నాకు తను మాత్రమే కావాలి అనేలా ఇష్టం కలుగుతుంది. మన మనసంతా తన కోసమే వెతుకుతూ ఉంటుంది. తన మాట వినబడిన, తను ఎదురుపడిన మనసంతా అదోలా అయిపోతుంది. తను ఎప్పుడు మన లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందో ఆశగా ఎదురుచూస్తుంది. ఒక్కసారి తను ప్రేమను యాక్సెప్ట్ చేస్తే మనసంతా తనే ఫేవరెట్ అయిపోతుంది. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా ఆ మనసు ఇంకా పట్టించుకోదు. తనే మన యువరాణి అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఫేవరెట్ అనుకునే ఒక్క అమ్మాయి కోసం ఈ పాట రాస్తున్నాను.

                      ఫేవరెట్

ఒక అమ్మాయి నా ఫేవరెట్ అనే మాటను ఒక పాటల్లో ఒక లైన్ గా రాయాలనుకున్నాను. నా ఫేవరెట్ నా శిరీషనే అనే లైను రాశాను. దీనికి అర్థం ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నాకు నువ్వు మాత్రమే ఫేవరెట్ అని అర్థం. అలాగే దీనికి అనుగుణంగా ఇంకొక లైన్ ఉంటే బాగుంటుందనిపించింది. సేమ్ ఫస్ట్ రాసిన లైన్ ని మ్యాచ్ చేస్తూ ఇంకొక లైన్ ఉంటే ప్రాస్ బావుంటుంది పాటకి అనిపించింది. నా సరిజోడంటూ అయ్యేది నా శిరీషనే  అనే లైన్ రాశాను. మొదటి రెండు లైన్లు కూడా పాటకి చరణం గా సెట్ అయిపోయాయి. ఇంక మిగిలింది మధ్యలో భావాలను వివరించడమే. రాసిన రెండు లైన్లను నాలుగైదు సార్లు చదివాను. నేను ఎలా అయితే అనుకున్నానో అలా ఈ లిరిక్స్ లో భావం కనిపించింది. ఈ పాట ఇలానే కంటిన్యూ చేస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అనిపించింది. కాబట్టి రాయటం కొనసాగించాను.

                   తనలో లక్షణాలు

ఒక అమ్మాయి మనకు ఫేవరెట్ అయిన తర్వాత తనలో ప్రతిదీ మనకు ఇష్టం అవుతుంది. తనతో గడిపిన క్షణాలను జ్ఞాపకాలుగా మార్చుకోవడం. ఆ జ్ఞాపకాలను మరల తలుచుకుంటూ ఆనందపడటం. తన మాటలను గుర్తు చేసుకోవడం. తన ముఖాన్ని మనం ముందే ఉన్నట్టుగా ఊహించుకోవడం. తన ముఖం మన కళ్ళలో కనిపించినప్పుడు ఆనందించడం. ఇవన్నీ ఒక అమ్మాయి మనకు నచ్చిన తర్వాత తనే మన ఫేవరెట్ అయిపోయిన తర్వాత వచ్చే భావాలు. కాబట్టి ఇవన్నీ ఒక శిరీష పేరు మీద ఒక పాట రాస్తే ఎలా ఉంటుంది. అనే కోణంతో ఆలోచించి ఈ పాట రాస్తున్నాను. ఇంక మొదలు పెడుతున్నాను. పాట వినడానికి రెడీగా ఉండండి. ఒకరిని ఇష్టపడిన తర్వాత తనతో గడిపిన క్షణాలు జ్ఞాపకాలుగా మారుతాయి. అవి మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ భావం ఎలా ఉంటుందో ఇప్పుడు రాయబోతున్నాను.

                       రెండవ భాగం

పైన చెప్పిన విధంగా ఒకరితో గడిపిన క్షణాలు మనకి జ్ఞాపకాలుగా అయ్యి ఏ విధంగా మనల్ని ఆనందింప చేస్తాయి అనే లైన్ ఇప్పుడు రాస్తున్నాను. నీ జ్ఞాపకాల గాలి తాకుతూ నడుస్తున్న ఓ శిరీష అనే లైన్ రాసాను. మొదటి లైన్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ మధ్య భాగం కంప్లీట్ అయితే సాంగ్ అనేది అదిరిపోతుంది. చాలా జాగ్రత్తగా టైం తీసుకుని అయినా రాయాలి అనుకున్నాను. అటు ఇటు తెగ తిరుగుతున్నాను కొత్త ఆలోచనలు ఏమైనా వస్తాయా అని. రోడ్డుమీద షాప్ కు వెళ్లి ఏదో ఒకటి డ్రింక్ కొనుక్కొని తాగి బైక్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు ఒక ఆలోచన వచ్చింది. తనతో గడిపిన క్షణాలను జ్ఞాపకాలు ఏవిధంగా మన వెంట వస్తాయో రాసాను కాబట్టి ఇప్పుడు తన మాటలని ఎలా ఫీల్ అవుతున్నానో రాయాలనుకున్నాను . నీ మాటలని పాటలాగ వింటున్న ఓ శిరీష అనే మాటను రాశాను. ఈ భావం లైన్ కూడా చాలా బాగా ఉంది.

          రెండవ భాగం – మూడవ లైన్ 

మనం ఇష్టపడిన అమ్మాయి మొఖం అనిది చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్న మన మనసుకి మాత్రం మనకు నచ్చిన అమ్మాయి ముఖమే అందమైనదిగా కనిపిస్తుంది. అదే నిజమైన ప్రేమ. ఆ అందమైన రూపాన్ని మళ్లీ మళ్లీ తలుచుకుంటూ ఆనందిస్తాం కదా ఆ భావాన్ని ఇప్పుడు రాయాలనుకున్నాను. నీ రూపాన్ని తలుస్తూ మరిచిపోతున్న పోస్ట్ శిరీష అనే లైన్ రాశాను. మొత్తానికి పాటలో మధ్యభాగం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పాటలో మూడవ భాగం రాస్తే పాట కంప్లీట్ అయిపోతుంది. ఏది ఏమైనా నేనొక రైటర్ అనే సంగతి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. నేను అప్పుడే అలా ఫీల్ అవ్వచ్చో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అలాగే అనిపిస్తూ ఉంది. రాసిన ప్రతి లైన్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది అప్పుడే పాట చేసేద్దాం అనిపిస్తుంది. కానీ కంప్లీట్ అయ్యాకే పాట చేస్తే బాగుంటుంది కదా అని ఆగుతాను.

                      మూడవ భాగం

మనకి ఇష్టమైన వాళ్ల పేరు ఎవరి నోటైనా వింటే వెంటనే మన పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఎవరి నోటనైనా కాదు ఎక్కడ చదివినా కూడా అంతే ఆనందం మన నవ్వులో కనిపిస్తుంది. అదే మూడవ భాగంలో మొదటి లైన్ గా రాద్దాం అనిపించింది. ఒకవేళ ఒక పేరు వినగానే మన పెదవులపై చిరునవ్వు వచ్చిందంటే ఆ పేరు మన చిరునవ్వులో ఉందని అర్థం. ఇదే మాటను ఇప్పుడు శిరీష పేరు మీద రాస్తున్నాను. నా పెదవులపై చిరునవ్వు ఉందంటే అక్కడ నీ పేరు ఉందని అర్థం.

                    మూడో భాగం – రెండవ లైన్

మన నిజ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా గానీ మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉంటే ఆ కష్టం కనబడదు. మన మనసును హాయిగా చేసే ఒక వ్యక్తి మన జీవితంలో ఉంటే ఎన్ని కష్టాలైనా భరించొచ్చు అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి మన మనసులో ఉంటే కష్టం ఎదురైన ప్రతిసారి వారిని తలచుకోగానే మనసు హాయిగా అవుతుంది. ఉదాహరణకి రఘువరన్ బీటెక్ మూవీలో హీరో జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లి సెలెక్ట్ అవ్వలేదని చాలా ఫీల్ అవుతాడు. కోపంతో తన రెస్యూమ్ ఫైల్ నీ నేలకేసి కొడతాడు. కానీ ఇంతలోపే ఫ్రస్టేషన్లో ఉన్న హీరోని చూసి హీరోయిన్ కాల్ చేస్తుంది. వెంటనే దానిని ఇష్టపడే అమ్మాయి దగ్గరనుంచి కాల్ రాగానే హీరో కోపం అంతా పోయి ప్రశాంతంగా అయిపోతాడు. ఇదే ఆనందం నిజజీవితంలో కూడా జరుగుతుంది. ఇదే భావాన్ని రాద్దామని అనిపించింది. నా మనసు హాయిగా ఉందంటే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థం. అనే మాటగా రాసాను.

                మూడో భాగం – మూడవ లైన్ 

ఏదో సాధిద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఒకటి సాధించడంలో ఏదైనా కష్టం ఎదురైనా లేక విజయవంతంగా అనుకున్న పని జరిగిన అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది. మనం దేని కోసం కష్టపడుతున్నాం. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం అని ఆలోచన వచ్చి జీవితం గందరగోళంగా ఉంటుంది. జీవితానికి ఒక అర్థం. ఇది చేయడం వల్ల ఇది వస్తుంది అనే ఒక క్లారిటీ ఉండదు. అలాంటి సమయంలో ఎవరైనా మన జీవితంలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇదంతా తన కోసమే చేయాలని. అయితే మన గందరగోళ జీవితంలోకి ఒకరు వచ్చి మన జీవితాన్ని ఆనందమయం చేసినప్పుడు. రోజు పండగలకు జరుపుకున్నట్టుగా మన జీవితం అయిపోతుంది. అలాంటి సందర్భంలో శిరీష అనే పేరు మీద రాయడానికి ప్రయత్నించాను. నా జీవితం కనుల పండుగగా మారిందంటే నా జతగా నువ్వు వచ్చావని అర్థం. ఓ.శిరీష ఓ.ఓ శిరీష అంతే మూడవ భాగం కూడా పూర్తయిపోయింది.

                     చివరి భాగం

ఈ పాటలో మొత్తం చరణం లో రెండు లైన్లు రాయడం జరిగింది. ఇంకా పాట మధ్య భాగంలో రెండు పేరాగ్రాఫ్లో ఫుల్లుగా భావాలను నింపడం జరిగింది. ఒక భాగం ఏమో శిరీష అనే పేరు నాలుగు సార్లు వచ్చేలా రాయడం జరిగింది. మూడవ భాగంలో బావలన్నీ వివరిస్తూ ఒక పేరాగ్రాఫ్ మొత్తం రాసి ఆ పేరాగ్రాఫ్ చివర ఒకసారి మాత్రమే శిరీష పేరు వచ్చేలా రాశాను. ఎందుకంటే ప్రతి భాగంలోనూ ప్రతిసారి శిరీష పేరు వస్తే భావానికి ఉన్న అర్థం బాగోదని మూడవ భాగంలో ఎక్కువసార్లు పేరుని జోడించలేదు. ఇప్పుడు పైన రాసిన చరణం లోని రెండు లైన్లను ప్రతి మధ్య భాగం తర్వాత రిపీటెడ్ గా పెడితే పాట పూర్తయిపోయినట్టే. చరణం లోని లైన్లో పెట్టడం జరిగింది. మొత్తంగా పాటను చదివి చూస్తే అద్భుతంగా అనిపించింది. నాలో ఎప్పటినుంచో ఉన్న ఫీలింగ్స్నే ఇలా ఒక పాట రూపంలో రాయగలిగాను అని అనిపించింది. రైటర్ ఏది రాయాలన్నా ముందు రైటర్ కి అలాంటి మనసు ఉండాలి అంటారు కదా. ఇప్పుడు అది నిజమని అనిపిస్తుంది.

ఇక్కడDownloadఅనే దానిపై క్లిక్ చేసి శిరీష పేరు ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Sirisha Song Link👇

Download

ఏ విధంగా అయితేనో కష్టపడి పాట రాయడం అయితే పూర్తి చేశాను. రాసిన పాటను ఆడియోగా కన్వర్ట్ చేయడానికి మూడు రోజుల సమయం పట్టింది. పాట పూర్తయిన తర్వాత వింటూ ఉంటే ఎంతసేపైనా అలాగే వినాలి అనిపించింది. నాకు తెలిసిన ఏ శిరీష అయినా ఉంటే సెండ్ చేసి సర్ప్రైజ్ చేయాలనిపించింది. కానీ నాకు అలాంటి అవకాశం అవసరం లేదనుకోండి. అందుకే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని ఈ ఆడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫుల్ సాంగ్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు వచ్చారంటే instagram లో ఆ సగం సాంగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందుకే కదా ఫుల్ సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవడం వరకు వచ్చారు.

డౌన్లోడ్ చేసుకోండి. కానీ నా కష్టాన్ని గుర్తించి నాకు మంచి అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం మరిచిపోవద్దు. మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరికైనా సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటే ఇంస్టాగ్రామ్ లో నా వీడియోస్ కి కామెంట్ చేయొచ్చు. లేదా ఇలా వెబ్సైట్ కొచ్చి ఏదో ఒక ఆర్టికల్ కి కామెంట్ చేసిన పర్వాలేదు. కామెంట్ చేసిన వెంటనే సాంగ్ వచ్చేసిందని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే అర్థం చేసుకోండి చాలా పేర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీలాగే కామెంట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ పాట గురించి. మరి అలా ఒక్కొక్కరిది చేసుకుంటూ వస్తే మీ వరకు వచ్చేసరికి కొంచెం సమయం పడుతుంది కదా. కాబట్టి వెయిట్ చేయండి. ఇట్లు మీ ప్రేమతో శివ

 

 

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *