తేజు సాంగ్ డౌన్లోడ్
తేజు పేరుతో సాంగ్ ఈ పాటని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
హలో ఫ్రెండ్స్ నా పేరు శివకుమార్. నేను రాసిన ఈ తేజు పేరుతో సాంగ్ ఈ పాటని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆర్టికల్ లో పొందుపరిచిన విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో పేర్కొన్న విషయాలు మన అందరి జీవితాలకు ఉపయోగపడేవే. కాబట్టి ఇలాంటి విషయాలను తెలుసుకోవడం మంచిదే. అవకాశం వస్తే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇప్పుడు మనుషులు కామెంట్స్ లో తిడుతూ ఉంటారు. అలాంటి వారికి ఎలా శిక్ష పడుతుందనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.
సోషల్ మీడియా
ఈ సమాజంలో బ్రతకడం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు. కొందరు బాగా చదువుకొని గవర్నమెంట్ జాబులు చేస్తూ ఉంటారు. మరికొందరు జాబులలో సెట్ అవలేక ఏదైనా వ్యాపారం చేస్తారు. ఇంకొందరు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ కొత్త అవకాశాల్ని అందిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాని ఉపయోగించి చేస్తున్న వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా చేసుకుంటున్నారు. పబ్లిసిటీ మార్కెటింగ్ సోషల్ మీడియా ద్వారాగా అందరికీ తెలిసేలాగా తమ వ్యాపారం గురించి వీడియోస్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. దీనివల్ల అవసరంలేని వాళ్లకి కూడా ఈ వీడియో వెళ్తుంది. దానితో చూసేవారికి అవకాశంగా ఇష్టం వచ్చింది మాట్లాడడానికి వీలవుతుంది.
కష్టం గుర్తించరు
ఎవరో చేసుకునే వ్యాపారం గురించి వారు చేసే కష్టాన్ని గుర్తించరు. చూడలేరు. అర్థం చేసుకోకుండానే ఏదో జనాలు మీద పడి డబ్బులు సంపాదిస్తున్నాడు. అన్నట్టుగా బుర్రలో ఏం తడితే అది కామెంట్ చేసి వాళ్ళని హార్ట్ చేస్తారు. ఎవరో ఏదో చేసుకుంటున్నారు లే మనకెందుకు అని వదిలేయరు. ఖాళీగా ఉండి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారు. కొంతమంది ఎదుటివారు వ్యాపారాన్ని చూసి ఓర్వలేక నెగటివ్ కామెంట్స్ చేస్తారు. వీరి నుంచి మన వ్యాపారాన్ని మనం ఎలా చేసుకోవాలి. అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాయింట్ అవుట్
మొదటగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరి జీవితాలు కూడా ప్రశాంతంగా ఉండవు. ఈ సోషల్ మీడియాలో వీడియోలు చూసే వారందరూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. బయట వాళ్లు చేసే పనిలో పై ఉన్న ఓనర్స్ కానీ, అధికారులు కానీ సరిగా సరే పని చేయకపోతే ఇష్టం వచ్చినట్లు తిడతారు. ఈ ఫ్రస్టేషన్ వారి బుర్రల్లో ఉండి తిరిగి ఇంటికి వచ్చాక రిలాక్సేషన్ కోసం, కాలక్షేపం కోసం ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరైనా తమ వ్యాపారాన్ని సులువుగా చేస్తున్నట్లుగా కనిపిస్తే వాడి జీవితాన్ని చూసి ఈర్ష చెందుతారు. అంతే ఇంకా వారికి వాళ్ల జీవితం ఇలా సరదాగా లేదు అని ఎక్కడలేని కోపం ఉక్రోసం వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో అందరూ చాలా సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారనే కోపంతో ఆ అవకాశం వీడికి లేదు అనే బాధతో నోటికి ఏది వస్తే అది కామెంట్ చేస్తారు.
కొంతమంది పద్ధతి అంతే
ఇంకొంతమంది చిల్లర కల్చర్ లో పెరుగుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల సమక్షంలో పెరగకుండా వారి స్వతహాగా బయట ప్రపంచంలో తిరుగుతూ స్నేహితులతో సమయాన్ని గడిపి పెరుగుతారు. వీళ్లు మాట్లాడే లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంటుంది. బాగాలేదు అని చెప్పడానికి కూడా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. ఆ మాటలు వింటే ఒక్కొక్కసారి ఇంత కష్టపడుతూ ఇలాంటి వాళ్ళు చేత మాటలు పడాలా అనిపిస్తుంది. మనం పడే కష్టాన్ని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేస్తారు. మనం ఒక వేస్ట్ పని చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతారు. జనాల దగ్గర మోసం చేస్తూ క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ అమ్ముతూ డబ్బులు తీసుకున్నామన్నట్టు లెక్క కట్టేస్తారు. ఎవరికి ఏది తోచితే అది మాట్లాడుతారు. నిజానికి వారు మనం పడే కష్టాన్ని చూడరు. చూసే అవకాశం కూడా ఉండదు. అయినప్పటికీ తెలియకుండా మాట్లాడేస్తారు.
వీడియోస్ చేయడం
వీడియోస్ తీయడం కోసం ఖరీదైన మొబైల్స్ కొంటాము. ఇంకా వీడియోలు బాగా రావడం కోసం లైటింగ్ సెట్ కొంటాము. మొబైల్ హోల్డర్స్. వాయిస్ బాగా రావడం కోసం మైకులు కొంటాం. ఒక్కోసారి లక్షలు పెట్టి వీడియో క్వాలిటీ కోసం కెమెరాలు కూడా కొనవాల్సి వస్తుంది. ఎన్నుకొని వీడియో తీసాక ఎడిటింగ్ చేయడం కోసం నాన్నా పురాకులు పడాలి. వీడియోస్ ఎడిటింగ్ చేయడం కోసం సాఫ్ట్వేర్ కొనాలి. ఆ సాఫ్ట్వేర్స్ లో ఆ వీడియో ఎడిట్ చేయడం కోసం గంటల సమయం పెట్టాలి. బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ప్రీమియం వెబ్ సైట్లు కొనాలి. ఉదాహరణ చూపించడం కోసం ఫుటేజ్ వెబ్సైట్లు కొనాలి. ఒక వీడియో చేయడం కోసం మనం ఇంతలా కష్టపడితే చూసి సింపుల్ గా వీడియోలకు కామెంట్ చేసేస్తారు. మనకంటూ ఒక ప్రొఫెషన్ సెట్ చేసుకోవడంలో ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ ఆ కష్టాన్ని ఎవరూ చూడరు.
ఏమి చేయాలి
పై చెప్పిన విధంగా ఎన్నో విధాలుగా మనం కష్టపడుతూ ఉంటాం. మన కష్టాన్ని ఎవరూ చూడకుండానే మనం చేసే వీడియోస్ గురించి నెగటివ్గా మాట్లాడుతుంటారు. కానీ నేను కొన్ని వీడియోస్ కి కామెంట్స్ చూసాను. పెద్ద పెద్ద క్రియేటర్స్ అలాగే సెలబ్రిటీస్. సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ వీడియోస్ కింద కామెంట్స్ చెక్ చేశాను. చెప్పాలంటే ఇదొక రీసెర్చ్ అనే చెప్పుకోవాలి. భక్తి పరంగా వీడియోలు చేసేవారి కామెంట్స్ కూడా చూశాను. యూట్యూబ్ అండ్ ఇంస్టాగ్రామ్ లో ఎన్నో వీడియోస్ కింద కామెంట్స్ చెక్ చేస్తాను. నాకు తెలిసింది ఏమిటంటే ఒక్క మాట కూడా పడకుండా నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఏ ఒక్కరి వీడియోస్ కూడా లేవు. నాకు తెలిసింది ఏమిటంటే నెగిటివ్ కామెంట్స్ చేశా వాళ్ళ అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్లు పెరిగిన విధానాన్ని బట్టి ఆ వీడియో ఎందుకో వాళ్ళకి నచ్చదు. అందుకే వీడియో ఎంత బాగున్నా, ఎవరు చేసినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేశారు అంటే నెగిటివ్ కామెంట్స్ తప్పవు.
ఇది ఫిక్స్
ఫైనల్ గా అందరు వీడియోస్ కి వచ్చిన కామెంట్స్ అన్ని చూశాక నేను ఒకటి ఫిక్స్ అయ్యాను. నెగిటివిటీ అనేది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. దానివల్ల మనం పడే కష్టాన్ని వృధా చేసుకోరాదు. ఎవరో ఏదో చేతికి వచ్చింది కామెంట్స్ చేశారని మన ప్రొఫెషన్ ని ఆపకూడదు. ప్రొఫెషన్ అంటేనే మన లైఫ్ కి సంబంధించింది. ఎవరికి వాళ్లు వాళ్ళ జీవితానికి సరిపడా పనిని చేసుకుంటూ ఎవరి జీవితంలో వాళ్లు ఉంటారు. నిజానికి వాళ్లు కూడా ఏదో ఒక పనిలో ఏదో ఒక సిచువేషన్ లో వేరొకరితో తిట్లు తింటూనే ఉంటారు. అయినప్పటికీ వారిదే పై చేయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వారికే అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడతారు. కానీ మనం పడే కష్టం గురించి, మన ప్రొఫెషన్ గురించి, మన జీవితం గురించి వారికి తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు. అది వాళ్ళకి అవసరం కూడా లేదు. వారికి ఆ సమయంలో ఆ వీడియో నచ్చలేదు. అంతే ఎలాగైనా వాళ్లని ఏదో ఒకటి అనాలి అని డిసైడ్ అవుతారు.
వాళ్లకే తెలుసు అనుకుంటారు
అందుకే ఈసారి నా వీడియోస్ కి వచ్చే కామెంట్స్ గురించి అస్సలు ఆలోచించను. అలాంటి వారికి అసలు రిప్లై ఇవ్వను. ఒక్కోసారి వారికి బుద్ధి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చెప్పాలని ప్రయత్నం చేసిన వాళ్లు దాన్ని పట్టించుకోరు. వారి ఏది అనుకున్నారో అదే చెప్తారు తప్ప మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకోరు. అలాంటప్పుడు వారికి సమాధానం ఇచ్చి కూడా ఉపయోగముండదు. పైగా మన సమయం వృధా అవుతుంది. అందుకే నేను అలాంటి వాళ్ళ సంగతి ఇంకా పట్టించుకోను. ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్లందరికీ నేను ఒకటే షేర్ చేసుకుంటున్నాను. మన పని నిజాయితీది అయితే మనం ఎవరు మాట వినాల్సిన పనిలేదు. ఎవరి మాటలకి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మనం చేసే పని ఎదుటివారికి నష్టాన్ని కలిగించేదిగా ఉండకూడదు అంతే. ఇది చూసుకొని మనం ముందుకు వెళ్లిపోవాలి.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి మీరు తేజు పేరుతో సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Teju Song Link 👇
హలో ఫ్రెండ్స్ instagram లో నేను అప్లోడ్ చేసిన తేజు సాంగ్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఆ సాంగ్ రాయడానికి నేను చాలా కష్టపడ్డాను. నాకు చాలా సమయం కూడా పట్టింది. మరి ఇంత కష్టానికి మీరు నాకు ఏమి పే చేయాల్సిన అవసరం లేదండి. కేవలం మీరు ఈ సాంగ్ ని ఎలా ఫీలయ్యారు. ఎవరికోసం ఈ పాటని డౌన్లోడ్ చేసుకోవాలని అనుకున్నారు. మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే చాలు. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటాను.
మీరు చేసే ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. ప్రతి వీడియోలోనూ అలాగే ప్రతి ఆర్టికల్ లోను ఇదే నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు చేసే ఒక్క కామెంట్ లేదా ఒక లైక్ ఇలా నా పాటల జర్నీని ముందుకు తీసుకెళ్తుంది అన్న విషయం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ పాటల జర్నీలో నిజంగా నేను ఒక స్థాయికి వెళ్తే కనుక మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోను. ఆకాశానికి ఎగిరిపోయిన ఆ ఆకాశానికి నిచ్చెన వేసింది మీరు అనే సంగతి నేనెప్పుడూ మర్చిపోను. పెద్ద విజయ పథకం నాకు లభించి గాలిలో ఎగిరిపోతూ హాయిగా విహరిస్తున్న కూడా మిమ్ములను మర్చిపోను. అలా గాలిలో ఎగరడానికి రెక్కలు అందించినవారు. మీరు అని నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. థాంక్యూ ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.బాయ్ బాయ్ ప్రేమతో మీ శివ


