Shiva Name Song – Shiva K Creations

Shiva
By Shiva

శివ సాంగ్ డౌన్లోడ్

Shiva Name Song Download

 

శివ పేరుతో పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

                      పరిచయం

నా పేరు శివ కుమార్. ఇంస్టాగ్రామ్ లో చాలామంది అమ్మాయిల పేర్లతో సాంగ్స్ రాస్తున్నావు. కానీ అబ్బాయిల పేరు మీద సాంగ్స్ రాయవా బ్రో అని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మరి వాళ్లకు తెలియదు కదా ముందే అబ్బాయిల పేర్లు మీద సాంగ్స్ రాద్దామని అనుకున్నాను అని. అయినా మీకు కావలసింది చేయడమే కదా నా పని. సో ఈరోజు మొట్టమొదటిగా శివ అనే పేరుతో సాంగ్ రాస్తున్నాను. శివ అనే పేరు మీద లవ్ సాంగ్ రాయాలా, లేదా ఏదైనా పవర్ ఫుల్ గా సాంగ్ రాద్దామా అని ఆలోచించాను. లవ్ సాంగ్ అయితే అబ్బాయి పేరుతో సాంగ్ చేసి అబ్బాయే పాడితే బాగుంటుందా అనిపించింది. అందుకే అందరికీ ఉపయోగపడేలాగా ఒక మనిషి ఎలా ఉంటాడో ఒక పాట రాద్దాం అనుకున్నాను.

                       శివ పేరు

శివ అనే పేరు మీద పాట రాసేటప్పుడు ఇలా అనుకున్నాను. శివా అనే ఒక వ్యక్తి అందరిలో కలిసిపోయేవాడు. కాబట్టి శివ పేరుకు బంధుత్వం జోడించాలి అనుకున్నాను. అందుకే శివా పేరుని శివన్న అనే పేరుగా మార్చాను. ఇప్పుడు పాట రాయడానికి ఒక పేరు అయితే సిద్ధమైంది. ఇక పాట రాయడం మొదలు పెడదామా. శివా అనే వ్యక్తి ఒక పల్లెటూర్లో ఉంటే ఆ పల్లెకి ఆ వ్యక్తి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక స్నేహితుడు లాగా తోడుంటాడు. ఆ ఊరికి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యను తీరుస్తాడు. కాబట్టి ఈ భావాన్ని ఒక లైనులో రాద్దామనుకున్నాను. పల్లెకి వెలుగుల మారవన్న ఓ శివన్న అనే లిరిక్ రాశాను. పాటలో మొదటి లైన్ పూర్తయినట్టే.

                       రెండవ లైన్

పాటలో ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరికి అర్థం కావాలని పాట సులభంగా రాయాలని అనుకున్నాను. దానివల్లే పాటలో ప్రతి మాట చాలా సరళంగా ఉంటాయి. అలా అనుకుంటూ రెండవ లైన్ రాయటం మొదలుపెట్టాను. దేవుడుని ఎక్కువగా ప్రార్ధించేది పేదరికంలో ఉన్నవాళ్లే. కాబట్టి దేవుడు పేదింట్లోనే ఉంటాడని అంటారు. ఇదే భావాన్ని ఒక వ్యక్తిలో చూపించాలి అనుకున్నాను. కష్టాలను తీర్చే పేదింట దేవుడిలా శివాని పేరుతో ఈ విధంగా రాశాను. పేదింట దేవుడిలా అయ్యావ్ అన్నా. ఎలా ఉంది ఈ లైన్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అనుకున్న ప్రతి భావాన్ని ఒక పాట రూపంలోకి వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా ఆలోచిస్తారు అని. ఒకే దగ్గర ఉండి ఆలోచిస్తూ పాటలను రాస్తారా. లేక పుస్తకాలు చదువుతూ అందులో ఉన్న మాటలను ఆధారంగా చేసుకొని పాటలు రాస్తారా అని.

                     మూడవ లైన్

పూర్వకాలంలో ఈ ప్రపంచాన్ని రాజులు పరిపాలించేవారు. అయితే ఆ రాజులు కొంతమంది ప్రజలను బానిసలుగా చూస్తూ చాలా కఠినంగా ఉండేవారు. ఆ సమయంలో ప్రజలు వారు పడే కష్టాన్ని గుర్తించి వారిపై దయ చూపాలని కోరుకునేవారు. ఒకవేళ ఏ రాజైనా తమపై దయ చూపిస్తే ఆ రాజుని దయగల మహారాజు అని పిలిచేవారు. అదే గుణం ఒక వ్యక్తిలో కూడా ఉంటే అది పాట లాగా రాయాలి అనుకున్నాను. అందుకే దయగల మహారాజువు నువ్వు అన్న. మా శివన్న. ఎలాగైతేనో మూడవ లైన్ కూడా పూర్తయింది. పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమా పాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. వింటుంటేనే మనలో దాగున్న హీరోయిన్స్ బయటకు వస్తుంది. అలాంటి పాటని నేను ఎప్పుడైనా రాయగలనా అనుకున్నాను. సరేలే ఇలా రాసుకుంటూ వెళితే కచ్చితంగా ఏదో ఒక రోజు అలాంటి పాట కూడా రాయచ్చు కదా అనిపించింది.

                        నాల్గవ లైన్ 

ఎవరైనా కష్టాన్ని తీరిస్తే వాళ్లని ఎప్పటికీ మర్చిపోకూడదు అని అంటారు కదా. అలాగే మనకున్న సమస్యలను తీర్చే వాళ్ళని, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళని కచ్చితంగా మనం తలుచుకుంటూ ఉంటాం కదా. అలాంటి భావాన్ని ఒక వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటదో రాయాలనుకున్నాను. అందుకే నిన్ను తలవని గడిపే లేదన్న అనే లైన్ గా రాసాను. ఇలా ఒక్కొక్క లైను పాటలోకి చేరేకొద్ది అద్భుతం అంతా ఒకచోటకి చేరుతుంది అనిపించింది. ఈ పాట రాస్తున్నప్పుడు నాకు నేను రాసిన ‘ OG ‘ మూవీ ఫ్యాన్ మేడ్ సాంగ్ గుర్తుకు వచ్చింది. అందులో అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విషయాలు పెట్టి సాంగ్ రాశాను. రీసెంట్ గానే మన instagram పేజ్ లో కూడా పోస్ట్ చేశాను. చాలా తక్కువ ఇస్తే ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చిన పాట అది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్లు బాగా ఆ పాటని ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకంటే అన్ని లైక్స్ అండ్ కామెంట్స్ బాగా వచ్చాయి.

                      ఐదవ లైన్ 

ధర్మంతో ధైర్యంగా నిలబడే వారికి ఎదిరించి నిలబడలేరు. ఈ మాటను నీకు ఎదురు నిలిచే వాడే లేడు అన్న అనే దానిగా రాశాను. ధర్మం లేని వారికి ఎంత డబ్బున్న, వెనకాల ఎంతమంది ఉన్నా ఏదో ఒక రోజు ఓటమిపాలు అవ్వక తప్పదు. కాలం ఏదో ఒక రోజు వారిని ఓటమికి గురి చేస్తుంది. మొదట ఏదో నేనే బలవంతుడిని అనేట్టుగా వాళ్లకి అనిపిస్తుంది. కానీ తర్వాత ధర్మం యొక్క బలం ఏమిటో తెలుస్తుంది. గౌరవం అనేది డబ్బు సంపాదిస్తే రాదు. ఎదుటివారికి సాయం చేయడం వల్ల మంచి పేరు గౌరవాలు వస్తాయి. చాలామంది అందరిలో గొప్పగా తిరగాలని చూస్తారు. గౌరవంగా అధికారకంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఎవరికీ ఏ మంచి చేయరు. వారి దగ్గర డబ్బు ఉన్నదన్న అహంతో అందరూ వాళ్లకి గౌరవం ఇచ్చేయాలి అనుకుంటారు. మనుషులందరూ డబ్బుకు మాత్రమే విలువనివ్వరు. కొందరు మంచితనానికి మాత్రమే విలువనిస్తారు. వారి దగ్గర డబ్బును కాకుండా మంచితనాన్ని చూపిస్తే ఖచ్చితంగా మీకు గౌరవం వస్తుంది. అలాంటి వ్యక్తి గురించి రాసిన లైనే ఇప్పుడు నేను రాయాలనుకుంటున్నాను.

                        ఆరవ లైన్ 

విజయం అందరికీ రావాలని కోరుకుంటారు. ఎప్పుడు విజయం వాళ్లదే కావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. కానీ విజయం కోరుకున్న వాళ్ళందరికీ దక్కేది కాదు. ఎవరైతే నిజాయితీగా ఉండి ఎంత కష్టం ఎదురైనా వారి పనిని ఆపకుండా కొనసాగిస్తారో విజయం వాళ్లకే వస్తుంది. అలా కష్టపడే వారి వెంట విజయం వస్తుందని అర్ధాన్ని రాయాలనుకున్నాను. శివ అనే వ్యక్తి ఆ విధంగా కష్టపడతాడు కాబట్టి విజయం తన వెంట వస్తుందని రాసాను. విజయం నీ వెంటే వచ్చు అన్న పాటకి ఆరవ లైన్ కూడా ఆడ్ అయిపోయింది. మన వెంట ఎప్పుడూ ఉండేది మన నీడ ఆ విధంగానే కష్టపడే వారి వెంట విజయం కూడా మన నీడ వలె వెంట వస్తుందని ఈ లైన్ లో చెప్పడం జరిగింది. ఒక పాట రాయడంలో చాలా కష్టం ఉంటుంది. కానీ కొంతమంది నెగటివ్ పీపుల్ దారుణంగా కామెంట్ చేస్తారు. నిజానికి మనం చేసే పని వాళ్ళని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుందా అని ఆలోచన వస్తుంది కానీ. మనం ఏమీ చేయలేము వారికి ఎందుకు అలా నెగిటివ్ కామెంట్స్ చేయాల్సి వస్తుందో కూడా అర్థం కాదు. కానీ మన ఆ నెగటివ్ కామెంట్ ని చూడకూడదు. ఎంతోమంది మనం చేసే పనిని ఇష్టపడేవారు ఉంటారు వారిని చూసుకుంటూ ముందుకు వెళ్లిపోవడమే.

                      చివరి భాగం

కొంతమంది జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి మనిషికి తోడుంటూ ఎల్లప్పుడూ నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి యొక్క మొఖం ఎప్పుడు సూర్యకాంతి వలె వెలుగుతుందని తన నవ్వు గురించి ఒక మాట రాద్దాం అనుకున్నాను. ఆ మాటనే నీ నవ్వులో ఆ సూర్యుని వెలిగే ఉంటుంది అని రాశాను. ధర్మంతో నిండి ఉన్నవారి చూపులో ఒక పవర్ ఫుల్ కరెంటు లాంటి మెరుపు ఉంటుంది. ఆ మెరుపు ఎలా ఉంటుందంటే ఆకాశంలో వర్షం కురిసేముందు ఉరిమే ఉరుముల లాగా ఉంటుంది. అదే అర్థాన్ని ఇక్కడ మనం తీసుకున్నాము. నీ చూపులో ఉరుముల మెరుపులే. ఇది ఒక వ్యక్తికి అన్యాయం చేసిన వారి పట్ల ఒక్క చూపు వాళ్లపై చూడగానే ఆ సంఘటనపై కోపం ఉక్రోషం అనేది ఒక్క చూపులో వాళ్ల మీద పడుతుంది. ఆ చూపుతోనే భయం కలిగి ఏం చేస్తాడనే భయంతో తప్పును ఒప్పుకొని లొంగిపోతారు. అలాంటి అర్ధాన్ని ఇప్పుడు ఈ లైన్ లో రాయడం జరిగింది.

మొత్తానికి పాట రాయడం అయితే అయిపోయింది. ఇప్పుడు రాసిన పాటలో ఉపయోగించిన చరణాన్ని అక్కడక్కడ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటే పాట పూర్తయిపోతుంది. ఆ విధంగా చేసిన తర్వాత ఒక సరికొత్త సాంగ్ శివ పేరు మీద వచ్చేసింది. ఇప్పుడు ఇదే సాంగ్ ని ఆడియో రూపంలోకి చేయాలి. టుడేస్ కష్టపడిన తర్వాత ఆడియో చేయడం కూడా పూర్తయింది.

ఇక్కడDownloadఅనే దానిపై క్లిక్ చేసి మీరు శివ పేరుతో సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Shiva Song Link👇

Download

హాయ్ ఫ్రెండ్స్ మీరు శివ అనే పేరుతో పాటని డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారు కదూ. మీరు ఈ పాటని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఈ పాట ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ పేరుతో కూడా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన ఇంస్టాగ్రామ్ పేజ్ని  ఫాలో అవ్వండి. మీ కామెంట్ మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పాటలు రాయడం అనే నా జర్నీ ఇలా ముందుకు కొనసాగాలంటే మీ అభిప్రాయం నాకు అవసరం. మీ ఎంకరేజ్మెంట్ నాకు తోడుగా ఎప్పుడూ ఉండాలి.

ఈ వెబ్సైట్లో మేము చేసిన సాంగ్ ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా మరి ఆ పాటకి వీడియో ఎడిటింగ్ కూడా చేయించుకోవాలని మీకు అనిపించొచ్చు కదా. కాబట్టి మేము వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాము. వీడియో ఎడిటింగ్ అనేది చాలా సమయంతో కూడుకున్న పని కాబట్టి ఎడిటింగ్ కోసం ఎన్నో బ్యాక్గ్రౌండ్స్ ని కొనాలి. అలాగే ఎడిటింగ్ చేయడానికి సాఫ్ట్వేర్స్ కూడా కొనాలి. ఫుల్ సాంగ్ కి వీడియో ఎడిటింగ్ చేయాలంటే కనీసం ఒకరోజు సమయం పడుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఎడిటింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే 1000 రూపీస్ పే చేసి మా దగ్గర మా స్టూడియోలో మీరు ఎడిటింగ్ చేయించుకోవచ్చు. నెంబర్ అయితే వేరే ఆర్టికల్లో పెయిడ్ ఎడిటింగ్ అని ఉంటుంది అందులో ఉంటుంది.లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయమని ఇంస్టాగ్రామ్ లో సాంగ్ తర్వాత చూపించాను కదా. ఆ నెంబర్ కి వాట్సప్ లో మెసేజ్ చేయండి.

 

 

 

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *