లక్ష్మీ సాంగ్ డౌన్లోడ్
ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవొచ్చు.
పరిచయం
లక్ష్మీ సాంగ్ రాయడానికి నాకు వారం రోజులు సమయం పట్టింది. ఆ లిరిక్స్ ని పాటలాగ మార్చడానికి ఇంకొక 3 రోజులు సమయం పట్టింది. దాదాపుగా ఈ పాట రాయడానికి పది రోజులు సమయం పట్టింది. నా పేరు శివకుమార్. నాకు ఇలా పాటలు రాయడం అంటే చాలా ఇష్టం. మొదట్లో నేను సమయానికి అనుగుణంగా, పరిస్థితి తగ్గట్టు మంచి మాటలు రాసేవాడిని. తర్వాత అలా స్టోరీస్ రాయడం అలవాటు కూడా మొదలైంది. ఎందుకంటే నాకు ఎప్పటినుంచో షార్ట్ ఫిలింను తీయాలని ఉండేది. ఫ్రెండ్స్ సపోర్ట్ లేక దేనికో దానికి ఉపయోగపడుతుందిలే అనుకుంటూ రాసుకుంటూ ఉండిపోయా. అదే ఎప్పుడు ఇలా పాటలు రాయడానికి కారణమైంది.
పాట అర్ధం
పాట రాసేటప్పుడు నేనేమనుకున్నానంటే తను నా అదృష్టంగా భావించాలి. ఆ ఫీలింగ్ ఆ పాటలో ఉండాలి. తను నా లైఫ్ లోకి రావడం వల్ల, నా జీవితంలో ఉండటం వల్ల, ఏం జరుగుతుందనేది ఆ పాటలో పెట్టాలి అనుకున్నాను. అనుకున్నట్టుగానే మొదటి లైన్ రాసాను. మబ్బులు లేని వర్షంలా అంటే మబ్బులు లేకుండా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ( suddenly ) వర్షం పడుతుంది. అలానే ఊహించకుండానే వర్షం ఎలా వచ్చిందో అలాగే ఊహించలేని సమయాన అదృష్టమై కురిసింది. ఈ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో పాటలో అది స్పష్టంగా వచ్చింది. అదేవిధంగా తను నా సంతోషం అని అర్థం వచ్చేలాగా పాటలో ఉండాలనిపించింది. దానికోసం అని ఒక రెండు లైన్లు రాశాను.
రెండవ భావం
అవి ఏమిటంటే సంతోషాలన్నీ కలిసి ఒకచోట చేరి నీలా పుట్టెనా అనే లైన్ రాసాను. అంటే ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ ఒకే చోట చేరి ఒక రూపం ధరించింది అని అర్థం. అది తానే అయిందని అర్థం. ఇది కూడా నేను అనుకున్నట్టుగానే వచ్చింది. పాటలో ప్రతి లైన్ రాస్తూ ఉంటే అబ్బా ఆహా అనేలా వస్తున్నాయి. తరువాత లిరిక్స్ కూడా అలాగే వస్తాయా అనే డౌట్ వచ్చేది. సరే అని మూడో లైన్ ని రాయటం మొదలుపెట్టాను. ఈసారి తనతో ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ని పుష్పం ఆధారంగా చెప్పాలనుకున్నాను. చాలాసేపు ఆలోచించగా ఒక లైన్ వచ్చింది. ఆ లైన్ ఏమిటంటే పరిమళాలు అన్నీ కలిసి విరిసిన పుష్పమా. స్వీట్ అండ్ షార్ట్గా ఈ లైన్ కూడా చాలా బాగా వచ్చింది.
మూడవ భాగం
ఈసారి పాటలో లిరిక్స్ ఎలా ఉండాలంటే ఒక ఐదు,ఆరు లైన్లు వర్ణిస్తూ మధ్యలో ఆపకుండా పాడుతూనే ఉండాలి. ఆ విధంగా రాయడానికి ఆలోచిస్తున్నాను. మొదటి రెండు లైన్లు ఆలోచనకి తట్టాయి. అవి తను మాట్లాడే మాటలు గురించి రాయాలనిపించింది. నీ మాటే విని నా మనసే చేప పిల్ల లాగా కేరింతలు కొట్టేనే. సముద్రంలో, చెరువులలో చేపలు కేరింతలు కొడతాయి కదా. అదేవిధంగా తన మాట వినగానే మనసు కేరింతలు కొడుతుంది అనే అర్థం వచ్చేలాగా రాశాను. నేను రాద్దాం పేరాగ్రాఫ్ పాటలో రెండు లైన్లు పూర్తి అయ్యాయి. ఈ పాట రాయాలని నేను మొదలుపెట్టినప్పుడు. అసలు ఈ సాంగ్ ఏ విధంగా వస్తుందో నాలో ఆ టాలెంట్ ఉందో లేదో అనే డౌట్ ఉండేది. కానీ సగం పాట రాశాక నాలో ఇంత టాలెంట్ ఉంది ఏంట్రా బాబు నాకే తెలియకుండా అని అనిపించింది.
నాల్గవ భాగం
మూడవ భాగంలో తన మాటల గురించి రాసాను కదా. ఇప్పుడు తన చూపు గురించి రాయాలనిపించింది. తన తను నాకోసం చూసినప్పుడు నా మనసు ఎలా ఫీల్ అయిందో రాయాలనుకున్నాను. పక్షిలా ఎగిరే నా మనసే నీ చూపే నాపై పడితే. అందుకే ఈ లైన్ రాశాను. ఏదేమైనా పాటలో ఒక్కొక్క లైన్ వస్తూ ఉంటే మజా పెరుగుతుంది. ఇంకొక లైన్ రాస్తే ఎలా ఉంటుందా అని ఆత్రుత పెరుగుతుంది. నెక్స్ట్ లైన్ ఏం రాద్దామా అని ఆలోచిస్తూ ఉంటే నా బుర్రలోకి ఒక ఆలోచన తట్టింది. తను నా పక్కన ఉన్నప్పుడు ఎలా ఫీలయ్యాను అనే దాని గురించి ఇప్పుడు రాద్దాం అనుకున్నాను. ఆ లిరిక్స్ లో నువ్వు నా పక్కన ఉంటే అనే పదం రావాలి. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే.
ఆకాశంలో మెరుపులు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఆకాశంలో మెరిసే మెరుపులే నాలో నాలో మెరవా నా పక్కన నువ్వుంటే.అనే లైన్ పూర్తి చేశాను. రాసిన వెంటనే రెండు మూడు సార్లు చదివాను. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను పెద్ద రైటర్ అయ్యుండొచ్చు. నేనే ఇన్ని రోజులు గుర్తించలేకపోయాను నాలో ఉన్న టాలెంట్ని అని. ఆకాశంలో మెరుపులు మెరిస్తే ఎంత వెలుగులు వస్తాయో అంత వెలుగులు నాలో కూడా వస్తాయి. నా పక్కన నువ్వుంటే. అదిరింది కదా ఈ లైన్. ఈలోపే అప్పుడే అయిపోలేదు కథ పాట పూర్తి చేయాలి కదా అనే భయం వస్తుంది.
ఐదవ భాగం
అందుకే మళ్ళీ నా గురించి నేను ఎక్కువ ఊహించుకోవడం మానేసి. మళ్లీ రాయడం మొదలుపెట్టాను. తను ఇచ్చిన ప్రేమ గురించి అర్థం వచ్చేలా రాయాలి అనుకున్నాను. ఆలోచిస్తూ ఉన్నాను. ఫలితంగా ఒక ఆలోచన వచ్చింది. నా జీవితాన అద్భుతాలు ఎన్నో జరిగేనే నీ ప్రేమే నేను పొందితే. ఇలా రాశాను. పైన రాసిన లిరిక్స్ కి ఇప్పుడు రాసిన లైన్ జోడిస్తే సరిగ్గా సెట్ అయిపోయింది. అంతేకాకుండా ఆహా ఏమి పాట రా బాబు అనేలా వచ్చింది ఆ లైన్. చివరిగా పేరాగ్రాఫ్ పాటలో ఇంకొక రెండు లైన్లు వస్తే పాటల మధ్య భాగం కంప్లీట్ అయినట్టే. అందుచేత వెంటనే చివర లైన్లు రాయటం మొదలుపెట్టాను. అమ్మాయి మాట గురించి, తన చూపు గురించి రాశాను. ఇంకా తను నా జీవితంలో ఉంటే నేను ఎలా ఫీలవుతానో ఆ ఫీలింగ్స్ అన్ని రాశాను. ఇంకేమీ మిగిలింది పాటలో చెప్పడానికి అని ఆలోచిస్తున్నాను.
చివరి అద్భుతం
ఎలా అయినా ఇప్పటివరకు రాసిన మ్యాచ్ అయ్యేలా ఏదైనా మంచి భావం వస్తే బాగుండు అని చూస్తున్నా. అప్పుడే నాకు మా అమ్మ రెండు అరటి పండ్లు తినమని ఇచ్చింది. తీసుకొని అరచేతిలో పెట్టుకొని చూస్తూ ఉంటే ఒక ఆలోచన తట్టింది. ఇవి జత అరటి పండ్లు కాబట్టి తను నా జతగా ఉంటే ఏం జరుగుతుందో రాయాలి అనుకున్నాను. ఆ విధమైన అర్ధాన్ని ఇలా రాసాను. కష్టం లేని ప్రపంచం కాదా నా జతగా నువ్వుంటే చివరిగా అనుకున్న పాటకి కావాల్సిన లిరిక్స్ వచ్చేసాయి. పైన రాసిన చరణాలను ఎక్కడ ఎక్కడ పెట్టాలో సమకూర్చితే పాట కంప్లీట్ అయిపోయినట్టే. చివరి భావం రాసిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు కష్టం లేని ప్రపంచం ఎవరికైనా ఉంటుందా అని. మళ్లీ నేనే అర్థం చేసుకున్నాను.కష్టాలు లేని ప్రపంచం ఎవరికీ ఉండదు కానీ. మనల్ని అర్థం చేసుకునే మనిషి మన తోడుంటే ఎంతటి కష్టాన్నైనా తట్టుకొని నిలబడవచ్చు అని.
అనుకున్నది జరిగింది
ఇప్పటివరకు రాసిన లైన్స్ అన్ని కలిపి. పైన చరణాలను అక్కడక్కడ మధ్యలో మళ్లీ రిపీట్ చేసి మొత్తానికి అయితే పాట రాయటం కంప్లీట్ అయింది. రాసిన పాటని ఆడియో సాంగ్ లాగా కన్వర్ట్ చేయడం మిగిలింది. ఆడియో సాంగ్ లాగా కన్వర్ట్ చేయడం తర్వాత రోజు నుంచి మొదలు పెట్టాను. ఫస్ట్ రోజు చాలా ట్రై చేశాను. రాసేటప్పుడు చాలా బాగా అనిపించింది కానీ సాంగ్ చేసేటప్పుడు చాలా కష్టం అనిపించింది. ట్యూన్చే చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మొదట సగం పాట బాగానే వస్తుంది. తర్వాత ట్యూన్ చేంజ్ అయి కొన్ని అక్షరాలను ఫ్లోలో పాడటానికి అవడం లేదు. మనసులో ఈ సాంగ్ ని అద్భుతంగా సృష్టించాలని మాత్రం కోరిక పరుగులు పెడుతూనే ఉంది. అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒక్కసారిగా సాంగ్ వచ్చేసింది. మొత్తానికి సాంగ్ కంప్లీట్ అయిపోయింది.
షూటింగ్ టైమ్
పాట అయిపోగానే తర్వాత చేయవలసింది షూటింగ్ ఏ కదా. షూటింగ్ కోసం అని వైజాగ్ వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇంత బాగా వచ్చిన సాంగ్. ఏదైనా మంచి ప్రదేశంలో ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తే ఆ ఫీలే వేరు. మొదట ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచించాము. తర్వాత అందరం డిస్కస్ చేసుకున్న తర్వాత వైజాగ్ కైలాసగిరి అయితే బాగుంటుందని మా తమ్ముడు చెప్పాడు. చందు తమ్ముడు పోయిన సంక్రాంతికి కైలాసగిరి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాడు అంట. ఆ లొకేషన్ చాలా బాగుంది వీడియో తీస్తే చాలా బాగుంటదని చెప్పాడు. అయితే ఇంకా ట్రైన్ కి టికెట్స్ బుక్ చేసుకుని ఆ మరుసటి రోజే బయలుదేరిపోయాము. ఈ సాంగ్ వైజాగ్ బీచ్ లో షూటింగ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. కైలాసగిరి కొండపైన ఇంకో పేరుతో ఏదైనా సాంగ్ రిలీజ్ చేద్దాం అని చెప్పాను.
కైలాసగిరి
మొదట కైలాసగిరి కొండ పైన ఐశ్వర్య పేరు మీద సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టుగా. వీడియో షూటింగ్ చేసుకుని వచ్చాము. కైలాసగిరి మీద షూటింగ్ అయ్యేసరికి సాయంత్రం 6:00 అయింది. 6 నుంచి 7 గంటల వరకు బస్ కోసం వెయిట్ చేసాము. వెయిటింగ్ చేస్తున్న సమయంలోనే తిరిగి ఇంటికి వెళ్లడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. కన్ఫామ్ టికెట్ యాప్ లో టికెట్స్ త్వరగానే అయిపోయాయి. హమ్మయ్య ఇంటికి వెళ్లడానికి అయితే టికెట్స్ దొరికేసాయి. కానీ మేము అనుకున్న పేరుమీద సాంగ్ రిలీజ్ మాత్రం షూటింగ్ అవలేదు. చల్ల గాలి వేస్తోంది. వర్షం పడేలాగా వాతావరణం మారిపోయింది. వర్షం పడుతుందేమో అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాము. కానీ కాసేపటికి అలా చల్లగాలి వేస్తుంది కానీ వర్షం మాత్రం పడలేదు.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి మీరు ఈ పాటని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Laxmi Song Link 👇
హలో ఫ్రెండ్స్ పైన డౌన్లోడ్ అని Pink కలర్ లో ఉంది కదా. దానిపై క్లిక్ చేస్తే డ్రైవ్ కి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా లక్ష్మీ సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మన వెబ్సైట్లో 10,000 మంది సాంగ్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. మాకు వచ్చిన అనలిటిక్స్ ద్వారా తెలిసింది. సో మీరు కూడా ఆ విధంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫుల్ సాంగ్ ఎలా అనిపించిందో. మీరు ఎలా ఫీలయ్యారో, ఎవరి కోసం ఈ సాంగ్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారో. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. హే గాయ్స్ చెప్పాను కదా నేను ఈ పాటకి ఎంత కష్టపడ్డాను. మీరు ఒక రెండు నిమిషాల్లోనే ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక 30 సెకండ్స్ సమయం కేటాయించి ఈ ఆర్టికల్ కి కామెంట్ చేయలేరా. చేస్తారు లే నాకు ఆ నమ్మకం ఉంది.
సక్సెస్ సూచన
పైన వర్షం పడలేదని చెప్పాను కదా. బస్సు వచ్చింది. ఎక్కేసి త్వరగా వైజాగ్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. కిందికి వచ్చేసరికి ఏడున్నర అయింది. బీచ్ లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండి ఉంది. చూడగానే త్వరగా వెళ్లి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి తినేసాము. నైట్ ఎనిమిదైనా వైజాగ్ లైటింగ్ చాలా బాగా ఉంది. టైం ఎంత అయినప్పటికీ వీడియోస్ తీసుకోవడానికి లైటింగ్ అదిరింది. బీచ్ లో కూర్చుని వేడివేడిగా ఫ్రైడ్ రైస్ తింటుంటే మాకు చాలా బాగా అనిపించింది. తినడం అయిపోయాక వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశాము. వీడియో తీసిన వాడు చందు అనే మా తమ్ముడు. సో మంచి అవుట్ ఫిట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్నాము. తిరిగి రైల్వే స్టేషన్ కి ఆటోలో వెళ్లి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాము.
వచ్చిన మరుసటి రోజు ఎడిటింగ్ చేసి వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాము. అనుకున్నట్టుగానే వైజాగ్ బీచ్ లో సంధ్య పేరు మీద చేసిన సాంగ్ చాలా హిట్ అయింది. చాలామంది లైక్స్ అండ్ కామెంట్స్ కూడా చేశారు. నేను పడ్డ కష్టానికి ఫలితం అయితే కనిపించింది. నెక్స్ట్ అదే మాదిరిగా ఇంకొక మంచి సాంగ్ రాయాలని అనిపించింది. మీలో ఎవరికైనా స్వాతి పేరు మీద సాంగ్ కావాలనుకుంటే నెక్స్ట్ పేజ్ లో అప్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇట్లు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీ శివ.