మౌనిక సాంగ్ డౌన్లోడ్
ఈపాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
హలో ఫ్రెండ్స్ నా పేరు శివకుమార్. నా దగ్గర మాట్లాడడానికి చాలా విషయాలు ఉంటాయి. వినే వాళ్ళు ఉండాలి కానీ కబుర్లు చాలా చెప్తాను. మీతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే ఒక ఫ్రెండ్ లాగా నన్ను పరిచయం చేసుకోండి. మీ జీవితం అంతా ఏదో ఒక కథ చెబుతూ నవ్విస్తూ ఉంటాను. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో, అంతే విశాలంగా నా బ్రెయిన్ పనిచేస్తుంది. బోలెడన్ని విషయాలు నా బ్రెయిన్ లో దాచుకున్నాను. ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి తీయాలి. మీరు వినడానికి సిద్ధమే కదా మరి నేనైతే మొదలు పెడుతున్నాను మరి. స్టార్ట్ చేస్తున్న.
ఒకరోజు
ఒక రోజు పొద్దున్నే లెగిసి. మా తమ్ముడితో కలిసి మా ఊరిలో పొలాల సైడు అలా వెళ్లడం మాకు అలవాటు. అక్కడ చాలా పెద్ద కాలువ ఉంటుంది. అది ఎంత పెద్ద కాలువ అంటే 50 అడుగుల లోతు ఉంటుంది. మొదట్లో ఆ కాలువ అంత లోతు ఉండేది కాదు. కానీ 2023లో వచ్చిన భారీ వర్షాల కురిసాయి. ఆ కారణం చేత పై ఊర్ల నుంచి నీరు ఎక్కువగా వదిలేసారు. ఆ నీరు వల్ల ఆ కాలువ అంత లోతు అయిపోయింది. ఇప్పుడైతే అంత లోతు వరకు నీరు లేదు. కానీ కాలువ అయితే చాలా లోతైనది. అందులో అడుగున మూడు అడుగుల లోతు నీరు పారుతో ఉంటుంది. ఆ కాలువ పక్కన కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి. ఇంకా జీడి మామిడి, చింత చెట్లు, పెద్దపెద్ద మర్రి చెట్లు కూడా ఉంటాయి.
అలా వాటన్నిటిని చూస్తూ ఆ చెట్ల కింద కూర్చుంటే చాలా బాగుంటుంది. ఆ పారుతున్న కాలువని చూస్తే ఇంకా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడ చూసినా ప్రశాంతతతో నిండిన పచ్చదనం. చూడడానికి అబ్బా అనిపించేలా అక్కడ ప్రదేశం ఉంటుంది. రోజు అదే ప్రదేశానికి వెళ్లడం మాకు అలవాటు. రోజులాగే ఆరోజు కూడా మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ రోజు చాలా కోతులు వస్తాయి. ఎవరిని ఏమీ అనవు. వాటి అంతటావే దొరికినవి తింటూ వెళ్ళిపోతాయి. వాటి మధ్యలో నుంచి నడుస్తూ ఉంటే కాస్త భయమేస్తుంది. కానీ వాటిని మనం ఏమి చేయనంతసేపు అవి మనల్ని ఏమీ అనవు. ఒక మనిషి ఏ విధంగానో అలానే పక్క నుంచి వాటి పని అవి చూసుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ ప్రదేశంలో కోతులు ఉండటం కూడా చాలా అందంగా ఉంటుంది.
వింత ఏమిటంటే
ఆ ప్రదేశం దగ్గర చాలా సమయం కూర్చుని టైం అయ్యాక ఇంక చాలులే అనుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తుంటే. ఒక పెద్ద చింత మీద గుమ్మడికాయ పాదు ఉంది. ఆ పాదుకి చాలా గుమ్మడికాయలు కాసాయి. అవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ గుమ్మడికాయలు పాదు ఉన్న చింత చెట్టును కోతులు ఎక్కుతున్నాయి. ఆ కోతులలో ఒక కోతి ఒక పెద్ద గుమ్మడికాయని చూసింది. చూసి మనిషి తలకాయి అనుకుందేమో మరి అది భయపడింది. ఎందుకంటే ఆ కోతిని కొట్టడానికే మనిషి చెట్టు ఎక్కాడేమో అని, తిరిగి గుమ్మడికాయని బెదిరిస్తుంది. అది చూసి మేము చాలా నవ్వుకున్నాం. ఇంకా అది ఏం చేసిందంటే ఎంత బెదిరించినా అది బెదరడం లేదు అని మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్లి ఒక చేతితో దాన్ని కొట్టడం దానిని కలపడం చేసింది. అది ఏంటి అని పరిశీలంగా వింతగా చూపు చూస్తూ ఉంటే మాకు చాలా నవ్వొచ్చింది.
ఇంకొక రోజు
మా ఇంటికి మరదలు వచ్చారు. వాళ్లతో పాటు మా తమ్ముళ్ళు ఇద్దరు, మా చెల్లి ఒకర్తి, మరదలు నలుగురు, మొత్తం ఎనిమిది మంది అయ్యాము. మనమంతా కలిసి సరదాగా ఏదైనా ఆట ఆడుకుందాం అని అన్నారు. అరే ఏ ఆట ఆడుదాం అని కాసేపు ఆలోచించాక జల్దీ ఫైవ్ ఆడదామని ఒకరు అన్నారు. అలా అన్నారో లేదో వెంటనే షాప్ కు వెళ్లి జల్దీ ఫైవ్ బుక్కు నంబర్స్ కొని తీసుకొచ్చాము.
ఆ విధంగా ఆట మొదలైంది ప్రతి ఒక్కరూ ఆ నెంబర్ కావాలి, ఈ నెంబర్ కావాలి,నావి నాలుగైపోయాయి, నావి మూడు అయిపోయాయి, ఇంకా రెండు,ఇంకా ఒకటి ఇంకొక్క నెంబర్ వస్తే జల్దీ ఫైవ్ అయిపోతుంది. అనుకుంటూ సరదాగా ఆట కొనసాగిపోతూ ఉంది. సడన్ గా నేను నిలువులైను అని అన్నాను. అప్పుడే నీది లైన్ అయిపోయిందా అని అందరం షాక్ అయ్యారు. కొంతసేపు ఆలోచించాక నిలువు లైన్ ఏంటిఅనుకున్నారు. మధ్య లైను, కింద లైను,పై లైను ఉంటాయి కదా. అప్పుడు నేను సరదాగా అన్నానని గ్రహించి అందరూ ఒక్కసారిగా నవ్వారు.
అలా ఆరోజు జల్లిపై ఆటని సరదాగా ఆడుకున్నాం. ఇంట్లో మనుషులంతా కలిసి అలా ఏదైనా ఆట ఆడుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ ఆనందం ఒకవైపు. మళ్లీ అటువంటి రోజులు ఎప్పుడొస్తాయా బెంగ మరోవైపు. సెలవులు కాబట్టి మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఒక వారం రోజులు ఉండి సరదాగా మా ఇంటి దగ్గర గడిపారు. తిరిగి ఇంటికి వెళ్లి పోయారు. మళ్లీ ఆ రోజులు రావాలంటే చాలా సమయం పడుతుంది. అది నా మనసుకు తెలిసిన మళ్లీ ఆ రోజులు కావాలని కోరుకుంటుంది.
హైవే రోడ్డు
మా చిన్న తమ్ముడు ఇంటికి టైల్స్ వేయించడం కోసం అని మంచి టైల్స్ షాప్ కావాలి. వెతకడానికి శివరాత్రి రోజు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు బయలుదేరాము. మంచి టైల్స్ షాప్ వెతుకుతున్నాము. అలా జగ్గంపేట మొత్తం తిరిగాము. తర్వాత ఒక షాప్ కనిపించింది. థియేటర్స్ ఉన్న గల్లీలో ఒక షాప్ ఉంది. ఆ షాప్ లోకి మేము ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళాము. మాకు నచ్చిన టైల్స్ ఉన్నాయేమో అని చూసాము. అక్కడున్న టైల్స్ డిజైన్స్ కొన్నే ఉన్నాయి. ఉన్నవి కొంచెం బాగానే ఉన్నాయి. కానీ ఇంకొన్ని డిజైన్స్ ఉంటే మాకు సెలెక్ట్ చేసుకోవడానికి బాగున్నావు అనిపించింది. అందుకని ఆ షాప్ నుంచి బయటకు వచ్చేసాం. ఆ షాప్ నుంచి బయటికి వచ్చాము. ఇంకేమైనా షాపులు ఉన్నాయేమో అని తిరుగుతూ ఉంటే.
ఈరోజు శివరాత్రి కాబట్టి షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాము. దారిలో ఒక షాప్ కనిపించింది. టైల్స్ అన్ని చూస్తే ఇంతకుముందు చూసినా షాప్స్ కంటే బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి. కిచెన్ లోకి, వాష్ రూమ్ లోకి అయితే టైల్స్ ఉన్నాయని చెప్పారు. మళ్లీ దేవుడి గదిలో టైల్స్ వేరే దగ్గర కొనాలా అని అనిపించింది. ఈ లోపు ఆ షాప్ లో పనిచేసే అతను రేపు ఉదయం 10 గంటల తర్వాత రమ్మని చెప్పాడు. ఎందుకంటే తనకు తెలియదు. ఓనర్ కి తెలుస్తుంది. దేవుడు గదిలోకి డిజైన్స్ కూడా ఉండొచ్చు అని అన్నాడు. సరే అని వచ్చేసాము.
అలా ముందుకు వెళ్తుంటే కొబ్బరికాయలు అమ్మే షాప్ వచ్చింది. కొబ్బరికాయలు చూస్తే ముదిరిపోయినట్టుగా అనిపించాయి. కానీ మాకు కొబ్బరికాయలు కావలసి ఉంది. ఎందుకైనా మంచిది అని ఇంక వేరేవి లేవా అని అడిగాము. మా అదృష్టం బాగుందండి. లోపల నుంచి కొన్ని కొబ్బరికాయలు బయటికి తీసుకుని వచ్చాడు. హమ్మయ్య కొబ్బరిబండాలు దొరికేసాయి అనుకున్నాము. అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం. తీరా ఇంటికి వచ్చాక పగల కొట్టి నీళ్లు తాగి చూసాము. నీళ్లు కొంచెం ఉప్పుగా ఉన్నాయి. కానీ రుచి ఎలా ఉన్నా కొబ్బరినీళ్లు మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి తాగేసాము.
ఇంటికి వస్తుంటే
ఇంటికి వస్తుంటే మా తమ్ముడు నాతో కొన్ని మాటలు చెప్పాడు. జీవితం అంటే ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తూ పని చేసుకుంటూ బ్రతకడం కాదు. జీవితం అంటే జీవించడానికి ఒక పని చేయాలి. వచ్చిన డబ్బులో కుటుంబ సభ్యులకు అవసరాలను తీర్చాలి. అప్పుడప్పుడు మిగిలిన డబ్బుతో ఫ్యామిలీతో ఒక షికారుకి వెళ్ళాలి. లేదా ఒక సినిమాకి ఐనా వెళ్లాలి.
అలాగే నచ్చింది తినటం. శరీరానికి సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి. బంధువులను కలుస్తూ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కి వెళ్తూ ఉండాలి. ఇలా సరదాగా గడపడమే జీవితం అంటే. అంతేగాని పొద్దున్న లేచిన నుంచి పనిలోనే రోజంతా గడిపేయడం. ఇంకా కుటుంబ సభ్యులను సరదాగా పలకరించకుండా ఉండటం. వారితో సమయాన్ని గడపకుండా పనే జీవితం అన్నట్టు ఉండటం. ఎవరి ఫంక్షన్స్ కి వెళ్లకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపితే అది జీవితం కాదు. అని నాతో అన్నాడు. అప్పుడప్పుడు ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. ఫ్యామిలీ పరిస్థితిని బట్టి అప్పుడప్పుడు చేస్తే ఓకే. కానీ ఎవరి మీదనో పై చేయిగా ఉండాలి. అని వారి కంటే డబ్బున్న వారిలాగా బ్రతకాలని పోటీ పడుతూ ఉండటం. అన్నిటినీ మర్చిపోయి పనిలో మునిగిపోకూడదు అని అన్నాడు.
నేను చెప్పాను
అవును నువ్వు చెప్పింది నిజమే. మన కుటుంబ సభ్యుల యొక్క అత్యవసరాలను తీర్చడానికి కొంచెం ఎక్కువ సేపు పని చేసిన తప్పులేదు కానీ అందరికంటే పైన ఉండాలని డబ్బు సంపాదించడానికి అందరినీ మరిచిపోయి పనిలో మునిగిపోవడం తప్పు. మనం అయితే అలా చేయము కదా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కువ పని చేస్తున్నాను అంతే. అని అన్నాను.
అప్పుడు మా తమ్ముడు నువ్వు ఎవరి కోసం పని చేసినా నీ ఆరోగ్యం సంగతి కూడా చూసుకోవాలి. ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే సంపాదించిన దానికి విలువ అని అన్నాడు. నన్ను చూసి చూడు నువ్వు ఎంత సన్నగా అయిపోయావో. ఇలాగా ఉండేది అని అన్నాడు. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నిద్రపోవడానికి సమయం లేక నేను ఇలా ఉన్నాను కానీ లేకపోతే నేనెందుకు నిద్రపోని చెప్పు అని అన్నాను.
నేను సరే అనలేదు
పోనీ సరే నీ ఇష్టం నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరు నిన్ను జాగ్రత్త చూసుకోరు. అది నీ చేతుల్లో ఉన్నదే. నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోవాలి. అది ఎప్పుడు నుంచి నువ్వు ప్రారంభిస్తావో నీ ఆరోగ్యం నువ్వు బాగుంటావు. ఇంట్లో పెద్దోడువి అయినందుకు నువ్వు బలంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. మీ ఆరోగ్యాన్ని ముందు సరి చేసుకో అని అన్నాడు.
నిజానికి వాడు చెప్పిన మాటలు అన్నీ కూడా వెంటనే అమలు చేసి ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలి నేను. అయినా నేను చేసే పని ఇప్పుడు ఆపడానికి నాకు ఇష్టం లేదు. దానితోనే నా జీవితం ఆధారపడి ఉంది. నా ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ నేను పని చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మా తమ్ముడు చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఆరోగ్యం గురించి నేను ఆలోచించుకోవాలి. అని అనుకున్నాను. దేవుడా నేను చేసే పని త్వరగా సక్సెస్ అయ్యేలా చూడు. సమయానికి సరిగ్గా అన్నీ చేసుకునేలా అవకాశం ఇవ్వు అని మనసులో అనుకుంటున్నాను.
దేవుడిని ఏమని కోరుకోవాలి
మన కుటుంబంలో ఎవరికీ లోటు లేకుండా చూసుకోవడానికి ఒక మంచి పని. అందర్నీ సరదాగా పలకరించాలి. జీవితంలో ఏ చింత లేకుండా, ఎవరి జోలికి మనం వెళ్లకుండా ఉండాలి. ఎవరు మనతో గొడవలు పడకుండా ఉండాలి. ప్రశాంతమైన జీవితం ఇవ్వమని మనం దేవుడిని కోరుకోవాలి. ఎవరి మీద పోటీకి వెళ్ళకూడదు. నాకు అది కావాలి ఏది కావాలి అని సంకల్పాలు పెట్టుకొని పనిలో బిజీ అయిపోకూడదు. ఇప్పుడున్న ప్రపంచం రన్నింగ్ రేస్ వంటిది. పొద్దున లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులే. పక్కవారితో సరదాగా మాట్లాడే సమయం కూడా ఎవరికి ఉండదు.
జీవితంలో డబ్బు ఎంతవరకు అవసరం. దేనికి సంపాదిస్తున్నాం అనే విషయం కూడా మరిచిపోయి, డబ్బు సంపాదనకై పరిగెడుతూ ఉంటారు. అందరూ అని కాదు కొంతమంది చేసే పని ఇదే. డబ్బు సంపాదించి అందరిపై అధికారాన్ని పొందాలని అనుకుంటారు. సంపాదించిన డబ్బు నంతా ఏవేవో పొలాలు కొని, ల్యాండ్స్ కొని డబ్బు అంతా ఖర్చు చేసేసి తిరిగి వారి అత్యవసర వస్తువుల కోసం ఇతరులపై ఆధారపడతారు. వారి దగ్గర నుంచే పొందాలని వారిని బలవంతం చేస్తారు.
సంపాదించిన డబ్బు
వారు సంపాదించిన డబ్బు వారు ఎప్పటికీ అనుభవించలేరు. ఎందుకంటే వారు సంపాదించిన డబ్బంతా ఇన్వెస్ట్మెంట్లు చేసి దాచేస్తారు. మరోవైపు బంగారం వస్తువులు కొని, బీరువాల్లో దాచుకుంటారు. అసలు ఆనందానికి విరుద్ధంగా చేతినిండా మెడ నిండా బంగారు వస్తువులన్నీ వేసుకుంటారు. మేమే అందరికంటే తోపు అని బిల్డప్పులు ఇస్తారు. తిరగడానికి మంచి వాహనం ఉండదు. ఉండడానికి మంచి ఇల్లు ఉండవు. భార్య దగ్గరే ఉండి ఉద్యోగం చేసే అవకాశాన్ని కావాలని కోరుకోరు. అయినా సరే వారికి డబ్బు పిచ్చి ఉంటుంది. జీవితంలో ఏవి కావాలో ఆ వాటిని మాత్రం వదిలేసి. డబ్బు కోసం పాకులాడుతూ ఉంటారు.
కోరిక ఎలా ఉండాలి
ఇతరులు ఎలా ఉన్నప్పటికీ. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుని దేవుడుని ప్రశాంతమైన జీవితం కావాలి అని కోరుకోవాలి. మనవారితో కలిసి ఉంటూ మన అవసరాలు తీరితే సరిపోతుంది. మన అవసరాలకు మించి డబ్బు ఎందుకు. ఆ పరుగులాట ఎందుకు. అనే విషయం మనకి తెలియాలి. లేదంటే ఈ మాయ ప్రపంచంలో మనం కూడా పరిగెడుతూ జీవితం ముగిసిపోతుంది. దీనికి తోడు హాయిగా అనుభవించడం చేతకాకుండా అయిపోతుంది.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాయ్ ఫ్రెండ్స్. మౌనిక ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారని నాకు తెలుసు. ఈ పాటని మీరు ఎవరి కోసం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు. ఈ పాట మీకు ఎలా అనిపించింది. మీరు ఎలా ఫీలయ్యారు. అనే అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పాట మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఇంస్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.
మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ నాతో పాటు ఉంటే నేను ఇలాంటి పాటలు మరెన్నో రాసి మరెందరినో ఆనందపడేలా చేస్తాను. మీ ఆనందాన్ని నాతో షేర్ చేసుకోవడం వల్ల ఎంతమంది ఆనందం పడతారో తెలుసు కదా. కాబట్టి మీ అభిప్రాయాన్ని కచ్చితంగా కామెంట్ చేయండి.
ఈరోజు పుట్టినరోజు
ఈరోజు మా వాడి పుట్టినరోజు ఉంది. నేను త్వరగా వెళ్లి సెలబ్రేట్ చేయడాలి. కాబట్టి ఈ ఆర్టికల్ ఇంతటితో పూర్తిచేస్తున్నాను. మరొక ఆర్టికల్ తో మరెన్నో విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇట్లు మీ ప్రేమతో శివ.