అనూష సాంగ్ డౌన్లోడ్
ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
ఇప్పటికే నా పేరు మీరు వినే ఉంటారు. అయినా సరే కొత్తవారికి మరి నా పేరు చెప్పడం నా బాధ్యత కదా. నా పేరు శివకుమార్. నాకు దేని గురించైనా రాయటం అంటే చాలా ఇష్టమండోయ్. ప్రకృతిలో అందంగా ఏది కనిపించినా, లేదా ఎవరితో అయినా ఆనందంగా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు నాకు నేనుగా మోటివేట్ అవ్వడానికి, పరిస్థితి సానుకూలమైనది అయితే ఇంకా ఆనందించడానికి ఏదో ఒక కథనం రాసుకుంటూ ఉంటాను. ఏదైనా కష్టం ఎదురైతే దాన్నుంచి బయటపడేలా బలాన్ని పెంచేలా ఏవైనా మాటలు రాసుకుంటాను. ఇన్ని రోజులు ఈ మాటలన్నీ నాలోనే ఉండిపోతాయి అనుకున్నాను. ఈ విధంగా మీతో షేర్ చేసుకునే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ విధంగా నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందం, మీరు వీటిని ఉపయోగించుకొని ఏదో ఒక పరిస్థితుల్లో ఈ విషయాలను జ్ఞాపకానికి తెచ్చుకొని సులువుగా బయటపడడం లాంటివి చేసి, జీవితంలో ముందుకు ఎదిగి నాకు మీ అభిప్రాయాన్ని తెలిపారు అంటే అది ఇంకా ఆనందకరం. మరి ఆలస్యం చేయకుండా మొదలెడదామా & మీరు రెడీయా – నేను రెడీ. నేను చెప్పే ఈ విషయాలు మీకు ఆ కొంచమైనా సరదాని ఇస్తాయని అనుకుంటున్నాను.
వివరణ
రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను పనులు చేస్తాను. మీరు కూడా చేస్తారనుకోండి. కానీ ఈ ఆర్టికల్ లో నా గురించి మాత్రమే మాట్లాడుతాను. తెల్లవారితే చాలు రోజు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాను. ఇలా ఎదగాలి అలా ఎదగాలి. మంచి పొజిషన్ సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అన్ని ప్రయోగం చేయగా చివరికి ఒకటి మిగులుతుంది. నాకు వచ్చిన ప్రతి ఆలోచనలో లోటు పాట్లు ఏమున్నాయా అని ఆలోచించి కొన్ని ప్రయత్నం చేసి కొన్ని ప్రయత్నం చేయకుండానే తేలిపోతాయి. చివరిగా ఏదో ఒక మార్గం మిగులుతుంది. ఈసారి ఎన్నిసార్లు ఆలోచించినా అదే మార్గం కనబడుతుంది. అప్పుడు నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటాను. దానిమీద పనిచేస్తూ ముందుకు వెళ్తాను ఇదే నేను రోజు చేసే పని. నేను ఏ విధంగా ప్రతిరోజు ఒక విషయాన్ని నిర్ణయం తీసుకుంటాను అనేది ఇప్పటివరకు తెలియజేశాను. తర్వాత విషయాలలో నాకు ఆ ఆలోచనలు ఎలా వస్తాయో చెబుతాను.
ఆలోచన ధోరణి
ఒక్కచోటే ఉంటే ఆలోచనలనేవి రావు. ఒక్కోసారి ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఎవరెవరు ఏం చేస్తున్నారు దేనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఎవరు చేసే దాంట్లో నిజం ఉంది. ఎవరినైనా అనుసరిస్తే దానిలో మనకు వచ్చే లాభమేమిటి. ఇలా ఒక్కోసారి ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న మనుషులని చూస్తే అర్థమవుతుంది. కేవలం మనుషులు చేసే దాన్నే కాకుండా కొత్తగా వచ్చే టెక్నాలజీ గురించి ఆ టెక్నాలజీని ఉపయోగించి వచ్చే అవకాశాలు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే మన జీవితానికి కావలసిన ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుంది.
రోజు పొద్దున్నే
కొంతమంది పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తారు. కొంతమంది వారికి ఇష్టమైన వారి నుంచి మెసేజెస్ వచ్చాయా, లేదా ఇంస్టాగ్రామ్ లో కొత్త వీడియోస్ ఏమైనా వచ్చాయా, ఇలా వీటితోనే ఒక రోజుని మొదలు పెడతారు. పొద్దున్నే లేవగానే మీ ఆలోచన ధోరణి ఏవిధంగా ఉంటే ఆ రోజంతా కూడా అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మొదట లేవగానే మీ ఆలోచన ద్వారా దేని మీద ఉందో గమనించుకోవాలి. నేనైతే లేవగానే నిన్న ముగించిన పని ఈరోజు ఎలా ప్రారంభించాలి నిన్న సక్సెస్ కానిది ఈరోజు ఏ విధంగా సక్సెస్ చేయాలి అనే ఆలోచనతో రోజుని మొదలు పెడతాను. కాబట్టి రోజంతా నేను చేసే పనిలో విజయం ఎలా పొందాలనే ఆలోచనతోనే గడుపుతాను. నిన్న చేసిన దానికంటే ఈరోజు మెరుగ్గా ఏం చేయగలనని ఆలోచిస్తాను. మార్గాలు వెతుకుతాను, వచ్చిన మార్గాలను ప్రయత్నం చేస్తూ అందులో ఏది సరైనది అని నిర్ణయం తీసుకుంటాను. కొంత సమయం పని చేస్తాను. తర్వాత ఆ పనిగురించి మరింత తెలుసుకోవడానికి google సెర్చ్ చేస్తాను. ఈ విధంగా మీరు మార్గాలను వెతికితే కచ్చితంగా మీకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది.
మా తమ్ముడు, నేను
అందరికీ అన్ని షేర్ చేసుకోగలిగే ఫ్రెండ్స్, మనం చేసే పని గురించి ఐడియా లిస్టు లోటుపాట్లను తెలియజేసే ఫ్రెండ్స్ ఉండరు. ఒకవేళ ఉన్నప్పటికీ అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు మన కుటుంబంలోనే ఒక వ్యక్తిని ఫ్రెండ్ గా మార్చుకోవాలి. ఏదైనా కానీ అప్పుడు మన కుటుంబంలోని వారితోనే మాట్లాడుకోవచ్చు. మనం చేసే పనిలో లోటుపాట్లను గురించి తెలుసుకోవచ్చు. అలా అనుకునే నేను మా తమ్ముడు తో స్నేహం చేశాను. నేను చేసే ప్రతి పనిలో నా ఆలోచనతో పాటు మా తమ్ముడు ఆలోచన కూడా ఉంటుంది. ఒకవేళ నేను చేసే పని సరైనది అయితే తప్పకుండా అందులో మా తమ్ముడు పాత్ర కూడా ఉంటుంది. రోజు నేను ఆలోచించే విషయాలలో మా తమ్ముడు ఆలోచనలు కూడా ఉంటాయి. రోజు మా తమ్ముడు నేను మా ఓరి శివాలయం వెనుక నుంచి ఉన్న మార్గంలో పొద్దున్నుంచి సాయంత్రం సాయంత్రం వరకు మధ్య మధ్యలో వస్తూ వెళ్తూ ఉంటాం. ఏ విషయం గురించి అయినా చర్చించుకుంటాం. కొంత సమయం అక్కడే వర్క్ కూడా చేస్తాము.
సక్సెస్ ఎలా
మనం చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని రూల్ ఏమి లేదు. కొందరు ఎవరైనా సహాయం ఇస్తే వాటిని వెంటనే ఫాలో అయ్యి ఒకవేళ వారు చేసిన పని ఫెయిల్ అయితే తర్వాత నుంచి ఎదుటి వారు చెప్పే నిర్ణయాలు తీసుకోవడం మానేస్తారు. కొందరికి తెలియని విషయం ఏంటంటే ఒక్కోసారి ఎదుటివారు మనకి మంచి ఐడియా ఇచ్చినప్పటికీ మనం చేసే పనితీరులోనో లేదా పని బాగా చేసినప్పటికీ మనం చేసిన పని ప్రజలు ఆదరించకపోతేనో అపజయం ఎదురవుతుంది. దానికి ఎదుటివారిని నిందించడం తప్పు. మొదట మనం ఎంచుకున్న నిర్ణయం చివరి వరకు అది సక్సెస్ ని తీసుకురావాలని ప్రయత్నం మన బాధ్యత. కానీ అది ఎంతవరకు విజయాన్ని చేకూరుస్తుంది అనేది ప్రజల ఆదరణలో ఉంటుంది. కాబట్టి నిర్ణయం మీతో పంచుకున్న వారిని నిందించక మరొక మార్గాన్ని వెతకాలి.
రోజంతా మనుషుల మధ్య తిరిగితే ఆ మనుషులు చేసే పనులు వారి ఆలోచనలు వారి నుంచి వచ్చే డిస్టబెన్స్ తప్ప మనకి కొత్త మార్గాలు కనిపించవు. అందుకే ఒక్కొక్కసారి మనుషులకి దూరంగా కూడా వెళ్లి చూడాలి. దూరంగా అంటే మీ ఊరినే వదిలేసి కాదు. మీ ఊరిలోనే ఎవరూ లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాలి. మీరు ఒక్కరే మీ జీవితం గురించి ఆలోచించుకుంటే అక్కడున్న ప్రశాంతతని బట్టి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తోడుగా మీలాగే ఆలోచించే ఫ్రెండ్ కానీ కుటుంబ సభ్యుడు కానీ ఉంటే తీసుకెళ్లవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే ఎన్నో మార్గాలు బయటికి వస్తాయి. అలానే నేను రోజు ప్రయత్నం చేస్తాను.
ఒక్క ప్రయాణమైన
మీ మనసు అయోమయంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండిపోతే ఆ అయోమయంలోనే జీవితం గడిచిపోతుంది. మీకు ఏదైనా మార్గంలో మీ పరిస్థితి కొంచెం కుదుటపడేలా చేసుకోవాలని ఉంటుంది. కానీ మార్గాలు ఏవి కనిపించవు. అలాంటప్పుడు మీరు ధైర్యం చేసే కొంత ధనం ఖర్చు చేసి. మీ ఫ్రెండ్స్ తో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ ఏదైనా పుణ్యక్షేత్రానికి లేదా ప్రశాంతమైన ఆలోచనలు తీసుకువచ్చే ప్రదేశానికి కానీ వెళ్లాలి. అప్పుడు జర్నీలో మీరు ఇంటి దగ్గర అయోమయం పరిస్థితిలో పడేసిన ఆలోచనల్ని మరిచిపోయే అవకాశం ఉంటుంది. అయోమయం పరిస్థితి పోయిన తర్వాత కచ్చితంగా మీకు మార్గాలు అనేవి కనిపిస్తాయి. ఇంట్లోనే ఉంటే మీ పరిస్థితి మారదు. అందుకని మీకు తోచినంతలో ధనాన్ని ఖర్చు చేసి ఎక్కడికైనా ప్రయాణం చేసి రావాలి. కొత్త మార్గాలను వెతకడానికి ఇది ఒక పద్ధతి.
ఎప్పుడూ ఒకే రకమైన ఆలోచనలు ఉండటం వల్ల, అదే బాగోలేని పరిస్థితిలో, కష్టంలో ఉండి ఆలోచిస్తే మీకు కొత్త మార్గాలు కనిపించవు అందుకనే మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే ఎక్కడికైనా ప్రయాణం చేసి రావాలి. ఇలా మేము ప్రయాణం చేసిన ప్రతిసారి మా జీవితానికి అవసరమైన మార్గాలు మాకు దొరికాయి. వచ్చిన ఆలోచనలు ప్రయత్నం చేసుకుంటూ వెళ్లాక మేము ఇప్పుడున్న పొజిషన్ నుంచి కొంచెం అయినా మెరుగ్గా మా జీవిత పరిస్థితిని మేము మార్చుకున్నాము. అలా పని చేసుకుంటూ వెళ్తే కచ్చితంగా మేము అనుకున్న పొజిషన్ కి మేము ఎప్పటికైనా వెళతాము. అనే నమ్మకం ఉంది అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే అవకాశాలు అనేవి వేచి చూస్తే రావు. మనమే అవకాశాలను వెతకాలి అనే మాట వాడుకలో ఎప్పటినుంచో ఉన్న అది నిజమే.
పనిచేసే తీరు
కొందరు పని ఎలా చేస్తారంటే చేసిన వెంటనే ఫలితం వచ్చేయాలని అనుకుంటారు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం తిన్నది అరగడానికే నాలుగైదు గంటలు సమయం పట్టినప్పుడు. మనం చేసిన ఏ పనైనా సరే ఫలితాన్ని తీసుకురావాలి అంటే కొంత సమయం పడుతుంది కదా మరి. తిన్నది అరగడానికి నాలుగైదు గంటలు పడితే మనం చేసే పని ఫలితాన్ని తీసుకురావడానికి నాలుగైదు రోజులు పట్టొచ్చు లేదా నాలుగైదు నెలలు పట్టొచ్చు ఇంకా నాలుగైదు సంవత్సరాలు కూడా అవ్వచ్చు. మీరు తీసుకున్నది సరైన నిర్ణయమే అయితే మీకు ఆ పని పట్ల నమ్మకమే ఉంటే మీరు అందులో విజయం ఎప్పటికైనా సాధిస్తారని అవకాశం ఆ పనిలో కనిపిస్తే మీరు ఎన్ని సంవత్సరాలు అయినా ఆ పనిలో పని చేయవచ్చు. అయితే మీరు విజయం వస్తుందా రాదా అనే దానిపై కాకుండా మీరు చేసే పనిలో రోజురోజుకి ఎలా డెవలప్ అయ్యారు అనే దాని గురించి ఆలోచించాలి.
ప్రకృతిని చూస్తే
ఎప్పుడూ మనం చేసే పని గురించి కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటే మన జీవితం గందరగోళంగానే ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతిని కూడా ఆస్వాదించడం గమనించడం చేయాలి. ప్రకృతి ఎప్పుడో ఒకసారి మాత్రమే హడావిడి చేస్తూ కనిపిస్తుంది. మిగిలిన సమయం అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన ప్రకృతిని చూసి మనం ఆస్వాదించగలిగితే. ప్రకృతిలో ఉన్న ప్రశాంతత మనలోకి మన ఆలోచన విధానం మారుతుంది. మన ఆలోచన విధానం మారితే దానంతట అదే మన జీవితంలోని సమస్యలు కూడా పోతాయి. ఎప్పుడు గందరగోళమైన ఆలోచనలో ఉండకుండా ప్రకృతిని ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి. కొంత సమయం ఆ ప్రకృతిలో గడపడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటివి చేస్తేనే మనం ఉండే విధానం మారుతుంది.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి మీరు ఈ పాటని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Anusha Song Link 👇
అనూష పేరు మీద సాంగ్ ఇంస్టాగ్రామ్ లో వినే వచ్చారు కదా. అక్కడ మీకు అనుష సాంగ్ నచ్చింది కాబట్టి ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారని నాకు తెలుసు. మరి మీకు ఆ పాట ఎలా అనిపించింది ఎలా ఫీలయ్యారు నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా.
ఫుల్ సాంగ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ అండ్ ఒక కామెంట్ తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. మీ లైక్ అలాగే కామెంట్ నాకు చాలా అవసరం ఎందుకంటే నాకు మరింత ఉత్సాహం కలిగి ప్రోత్సాహం లభించే మరిన్ని పాటలు రాయగలుగుతాం. మన ఇంస్టాగ్రామ్ పేజీ పేరు Shiva_K_Creations ఫాలో అవ్వడం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు వచ్చిన ఈ ఆలోచన ముందుకు సాగాలంటే ఆదరణ నాకు చాలా అవసరం. ఇట్లు నవ్వుతూ మాట్లాడే మీ శివ
టాలెంట్
ఈ ప్రపంచంలో ప్రతి జీవికి, ప్రతి మనిషికి, ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టుకి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు భగవంతుడు. చేపలు నీళ్లలో ఈద గలవు. పక్షులు ఆకాశంలో ఎగరగలవు. అడవిలో వృక్షాలు తమంతట తాము ఎదగగలవు. జంతువులు తమంతటి తాము జీవించగలవు. అలాగే మనలో కూడా కచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తించడం మన బాధ్యత. పైన చెప్పిన విషయాల విధంగా మనం ఆలోచిస్తే మనలో ఏదో ఒక టాలెంట్ కనిపిస్తుంది. ప్రకృతి వైపు చూస్తే మనలో ఏముందో బయటపడుతుంది. ఉంటాను ఈ ఆర్టికల్ లో చాలా విషయాలు తెలుసుకున్నాం అనుకుంటున్నాను. మరొక ఆర్టికల్ లో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే మీ శివ