స్వాతి సాంగ్ డౌన్లోడ్
ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు అయితే శివకుమార్ మనకు రాయడం అంటే చాలా ఇష్టం. సినిమా థియేటర్ కెళ్ళి ఏదైనా సినిమా చూసిన, లేదంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రకృతిని చూసిన, ఎవరి మీదైనా కోపం వచ్చిన, ఎవరి మీద అయినా ఇష్టం పుట్టిన, ఏదో ఒకటి రాయకపోతే మనకే హ్యాపీగా ఉండదు. మనసంతా ఏదో వెలితిగా ఉంటుంది, అందుకే మరి నాకు ఎప్పుడు ఏది అనిపించినా రాయడం అలవాటు.
వివరణ
ఈ ప్రపంచంలో మనకి ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క రకం మనుషులు తగులుతూ ఉంటారు. కొందరు మనకి జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తే, ఇంకొందరు జీవితంలో ఎలా ఉండకూడదు నేర్పిస్తారు, కొందరు మోసం చేయాలని చూస్తారు. ఇంకొందరు మనతో స్నేహం చేస్తూ కష్ట సుఖాలను పంచుకోవాలనుకుంటారు. కొందరి మోసాలు మనల్ని మోసం చేయాలని లేకపోయినా ఒక్కొక్క పరిస్థితుల్లో మనకు అబద్ధం చెప్పి మన చేత ఆ పని చేయించుకోవలసి వస్తుంది. ఇంకొందరు కావాలనే మనల్ని వ్యూహం పన్ని మోసం చేయాలని చూస్తారు. అయితే ఈ ఆర్టికల్లో ఎవరిని ఎలా చూడాలో, మోసపోకుండా ఎలా ఉండాలో, మనల్ని ఎవరు మోసం చేస్తారో, ఎవరు మా అన్నతో స్నేహం చేయాలని చూస్తారో తెలుసుకుందాం.
మొదటి రకం
కొంతమంది వ్యూహం ఏమిటంటే ఏ పనైనా మన చేత చేయించి లాభం మాత్రం వారు పొందాలని చూస్తూ ఉంటారు. ఏదైనా పని మన చేత చేయించి ఒకవేళ ఆ పనితో చెడ్డ పేరు వస్తే మన మీదకే తోసేస్తారు. ఒకవేళ ఆ పని వల్ల మంచి జరిగితే ఆ మంచితనం వాళ్ల మీదకి వచ్చేలా చేసుకుంటారు. కష్టం మనం పడేలా లాభం వాళ్లు పొందేలా ఎప్పుడూ మనతో నవ్వుతూ బయటపడకుండా వ్యూహాలు పన్నుతూ ఉంటారు. మనం సరదాగా వాళ్లతో కాలాన్ని గడుపుతూనే ఉంటాం. మరోపక్క వాళ్లకు కావాల్సిన దాని గురించి వ్యూహం పన్నుతూ ఉంటారు. వాళ్లకు వచ్చిన ఏ అవకాశానైనా సరే వదులుకోకుండా తెలివిగా వారి మీదకి చెడ్డ అని అనిపించుకోకుండా ప్రతిదీ వ్యూహం చాలా తెలివితో వేస్తారు.
వారిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర ఏ వస్తువు ఉన్న, మనల్ని ప్రేమించే మనిషి మన దగ్గర ఉన్న, ఇంకా ఏదైనా సరే వారి దగ్గర లేనిది మన దగ్గర ఉంటే అసూయ చెందుతూ వారి దగ్గరికి ఎలా అయినా మన దగ్గర ఉన్నవి వచ్చేలా చేసుకున్నామని అనుకుంటూ ఉంటారు. ఎవరైతే మన దగ్గర ఉన్నదాన్ని గురించి అసూయ చెందుతూ ఉంటారో వారిని ఎప్పుడూ మన పక్కన ఉంచుకోరాదు. మనల్ని మోసం చేసేవారు ఏ విధంగా ఉంటారంటే మనం చేసే పని పట్ల వారి దృష్టిని ఉంచుతారు.
అస్సలు మనం ఎంత సంపాదిస్తున్నాం అనే విషయం తెలుసుకుని వారిలో మనలా కష్టపడే శక్తి లేకపోయినా, తెలివితేటలు లేకపోయినా మనతో కలిసి పనిచేసేద్దాం అనుకుంటారు. అవకాశం లేకపోయేసరికి అసూయతో మనం చేసే పనిని చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారితోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం చేసే పని గురించి ఆ పని చేస్తే విధానాన్ని ఎవరికీ తెలియచేయకూడదు. ఎవరైతే మనం చేసే పనిని చెడగొట్టాలని చూస్తారో వారితో ఎప్పుడూ స్నేహం చేయరాదు వారితో కలిసి ఎప్పుడు ఉండకూడదు. మీరు వారిని వెంటనే కట్ చేయకపోయినా సరే మెల్లిమెల్లిగా మీ పనులలో ఆటంకాన్ని కలిగించకుండా చేసుకోవడం మంచిది.
మోసం చేసే వ్యక్తులు
కొందరు మోసం చేసే వ్యక్తులు ఎలా ఉంటారంటే, మన దగ్గర మనల్ని పొగుడుతూ, మనం చేసిన ఏ గొప్ప పని నైనా సరే ఇతరుల దగ్గర చులకన చేసి మాట్లాడతారు. మనకి ఎవరి వల్ల మంచి పేరు రాకూడదని చూస్తారు. అవకాశాలని చూసుకొని తెలివిగా వ్యూహం పని మరి మనకి చెడ్డ పేరు వచ్చేలా చేస్తారు. కానీ మీరు అలాంటి వారు చేత మోసపోయి మీరు మంచి చేయకూడదని నిర్ణయానికి రాకూడదు. నా జీవిత అనుభవం చేత మీకు నేను తెలియజేసేది ఏమిటంటే మా చుట్టాల లోనే మా చుట్టూ ఉన్న మనుషుల మధ్య నేను ఎన్నోసార్లు మోసపోయాను.
అయినప్పటికీ నేను ఉన్న పద్ధతిలో నేను ఉండటంవల్ల ఈరోజు మా కుటుంబం తప్ప ఏ కుటుంబం కూడా అంత సంతోషంగా లేవు.ఏవోక కష్టాలు వారిని వెంటాడుతూ వారి జీవితంలో ప్రశాంతత లేకుండా ఉన్నాయి. వారు జీవితంలో అనుకున్న పెద్ద పెద్ద ఆశలు నెరవేరకపోవడమే కాదు. చిన్న చిన్న ఆనందాలకు కూడా నోచుకోని విధంగా వారి జీవితాలు తయారయ్యాయి. కావున మీ జీవితం బావుండాలంటే మీరు చేసే మంచిని ఎప్పుడూ ఆపకండి. మన వల్ల కాకపోయినా కాలం ఎప్పటికైనా సరే వారికి సమాధానం ఇస్తుంది.
రెండవ రకం
కొంతమంది మనల్ని మోసం చేశారని తెలిసిన వారిని ఏమీ అనలేని పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్లకి మనల్ని మోసం చేయాలని లేకపోయినా వాళ్ళ పరిస్థితి మనల్ని ఆ విధంగా చేసేలా చేస్తుంది. ఈ విషయం మనకు తెలియగానే మనల్ని మోసం చేశారనే కోపం మనకు ఉన్న వారిని ఏమీ చేయలేం. విషయం ఏమిటంటే మనల్ని మోసం చేసిన మోసం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. మనల్ని మోసం చేసి మన జీవితం నాశనం చేయాలని అయితే వారు చూడరు. మన గురించి కూడా వారు ఆలోచిస్తారు మన జీవితం పట్ల వారికి గౌరవం ఉంటుంది. అటువంటి వారిని మనము ఏమి చేయలేము.
అలాంటి పరిస్థితుల్లో మనం వారిని క్షమిస్తే కచ్చితంగా వారు ఇంకొకసారి ఆ పని చేయకుండా ఉంటారు. అయినప్పటికీ వారి తో స్నేహంగా ఉంటే మనం వారిపై ఉంచిన నమ్మకాన్ని చూసి వారు మారి తిరిగి మనకి లేదా ఎవరికైనా సరే మేలు చేయడానికి చూస్తారు తప్ప అపాయం తలపెట్టాలని చూడరు. ఇది ఎలా జరుగుతుందంటే కొందరికి వేరే వారి మీద ఆధారపడటం ఇష్టం ఉండదు. వారికి సొంతంగా నిలబడే స్వశక్తి తెలివితేటలు ఉంటాయి.
అయినప్పటికీ ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి కలిసి రాకపోవడం వల్ల ఎదుటివారిని మోసం చేసి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని చూస్తారు. ఇటువంటి పరిస్థితి కనక ఎదుటివారిలో కనిపిస్తే మీరు మిమ్మల్ని మోసం చేసినా సరే మీరు వాళ్ళనీ క్షమించవచ్చు మరియు వారితో స్నేహంగా ఉండవచ్చు. ఎవరైతే ఎదుటివారిని మోసం చేస్తూ బ్రతకాలని అనుకుంటారో వారిని క్షమించకూడదు అలాగే మన దగ్గరికి రానివ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వారు మన జీవితంలో ఉంటే ఎప్పటికైనా మన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు.
మంచి స్నేహితుడు
ఏ పరిస్థితి కారణం చేతయిన సరే మన వద్ద ధనాన్ని తీసుకుంటే ఆ స్నేహితుడు ఏ పరిస్థితుల్లో ఉన్న తిరిగి ఆ ధనాన్ని మనకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతని జీవితం ఎంత గౌరవం ఉందో అలాగే తన స్నేహితుని జీవితం మీద కూడా అంతే గౌరవం ఉంటుంది. తన వల్ల తన స్నేహితుడి జీవితానికి నష్టం కలవకూడదని ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఇవ్వని పరిస్థితి ఉంటే తన స్నేహితుడితో మర్యాదపూర్వకంగా పంచుకుంటాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న స్నేహితుడిని మనం కచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే అతడి పరిస్థితిని మెరుగుపరచడానికి ధన సాయం లేదా మాట సహాయం చేసి అతడి జీవితానికి మీరు ఉపయోగపడినట్లయితే మీరు బలవంతులు అయినట్లే.
ఎందుకంటే మీకు ఎప్పుడైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఆ పరిస్థితుల్లో తోడుగా కచ్చితంగా మీ స్నేహితుడు ఉంటాడు. పరిస్థితి బాగోలేని స్థితిలో మీరు ఏ విధంగా అయితే మీ స్నేహితులు వెంట ఉన్నారో అదేవిధంగా మీకు ఏ పరిస్థితి అయినా ఎదురైతే మీ వెంట కూడా అతడు ఉంటాడు. డబ్బు సహాయం చేయకపోయినా ఎప్పుడూ మీ వెంటే ఉంటాడు. కొంతమందికి పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ కష్టాన్ని పంచుకునే స్నేహితులు లేక బంధువులు లేక. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒకటే అర్థం చేసుకోండి. మీకు వీలైనంతలో మీ జీవితం పాడవని వరకు కొంతమందికైనా మీరు సహాయం చేయడం నేర్చుకుంటే కచ్చితంగా మన జీవితం కింద పడకుండా కాపాడే స్నేహితులు బంధువులు మన వెంట ఉంటారు.
నాల్గవ రకం
వీళ్లు మాటకారులు. ఏ పరిస్థితిలో అయినా మన పక్కనే ఉంటారు కానీ ఎప్పుడు ఏ సహాయం చేయరు. మన దగ్గర మన పరిస్థితి గురించి జాలిపడుతున్నట్టు నటిస్తూ కన్నీరు కారుస్తారు సహాయం మాత్రం చేయరు. సహాయం చేసే అవకాశం ఉన్న ఒక్క రూపాయిని కూడా వదులుకునే బుద్ధి వారికి ఉండదు. సహాయం చేస్తున్నట్టు నటిస్తారు. కానీ సహాయం మాత్రం ఎప్పటికీ చేయరు. పైగా ఇతరుల దగ్గర నేను ఆ పరిస్థితుల్లో ఉంటే ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని అని పోజులు కొడతారు. వాడు కాబట్టి ఇలా ఈ పరిస్థితుల్లో ఉండవలసి వచ్చింది. అని మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇంకా దిగజారేలా మాట్లాడుతారు. ఇతరుల దగ్గర మన విలువ తగ్గిపోయేలా చేస్తారు. మన బలాన్ని పోయేలా చేస్తారు. ఆవిధంగా మనల్ని ఇంకా కృంగదీస్తారు. వీరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఒక్కోసారి అలాంటి వారిని గుర్తించడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారు అంతలా మనల్ని నమ్మిస్తూ ఉంటారు.
చివరికి నేను చెప్పేది ఏమిటంటే. ఈ సమాజంలో మనం జీవించాలి కాబట్టి. అనేక రకాల మనుషులతో ప్రతిరోజు ఏదో ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీరు చదివే చదువులో అయినా, చదివు అయిపోయాక జాబ్లో అయినా, లేదా పెళ్లయిన తర్వాత అత్తవారి అయినా, లేకపోతే పక్కింటి వారితో అయినా మనకి తిప్పలు తప్పవు. మన చుట్టూ మోసం చేసే వాళ్ళు దగ్గరు. ఆఖరికి స్నేహితులు అయినా బంధువులు అయినా మనల్ని మోసం చేయాలనీ చూస్తారు. చేసి వాళ్లే లాభ పడదామనే చూస్తారు. కాబట్టి మన తెలివితేటలు ఉపయోగించాలి. కొన్ని బంధాలను నిలుపుకుంటూ కొన్ని మోసాలని తట్టుకుని నిలబడాలి. మన జీవితాన్ని కొనసాగించాలి.
మనం ఎంత తెలివితేటలు ఉపయోగించిన కొన్ని బంధాల మధ్య నమ్మకాన్ని ఉంచటం వల్ల మనం మోసపోక తప్పదు. అటువంటప్పుడు వారిని ఏదో చేయాలని కోపంతో కాకుండా ఈసారి మోసపోకుండా ఎలా ఉండాలో అలా ఉండి మనం నిలబడి మన జీవితాన్ని మెరుగుపరుచుకొని వారికంటే ఆనందంగా జీవించేలా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి. మోసం చేస్తే జీవితం ఎలా ఉంటుందో వాళ్లకి రుచి చూపించాలి. స్వతహాగా కష్టపడే వాడి జీవితం ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించాలి. మన జీవితం ఎప్పుడైతే మెరుగ్గా ఆనందంగా ఉంటుందో ఆరోజు వాళ్లకి కచ్చితంగా అనిపిస్తుంది. వారిని మోసం చేయకుండా వారి పక్కనే ఉంటే వారు సాధించిన విజయం మనది కూడా అయ్యుండేది అని.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Swathi Song Link 👇
నేను పడిన కష్టాన్ని మీరు ఆనందిస్తున్నారు అంటే నాకు ఆనందమే. నేను ఆశించేది ఏమిటంటే మీరు పడ్డ ఆనందాన్ని నాకు ఒక లైక్ ఒక కామెంట్ ద్వారాగా మీ ఆనందాన్ని నాతో పంచుకుంటే నా కష్టానికి ఫలితం దక్కినట్టే. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటూ నేను ఇలా మరిన్ని స్టోరీస్, పాటలు రాయాలని కోరుకుంటున్నాను.
గమనిక
ఇలా నేను మీతో రోజుకొక టాపిక్ మీద ఎన్నో స్టోరీస్ రాస్తున్నాను మరి మీరు వాటిని ఉపయోగించుకుంటున్నారా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది. అందుకోసమే మీ అభిప్రాయాన్ని మీరు తెలుసుకున్న ఒక మంచి విషయం గురించి లేదా మీరు ఇంకేదైనా విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే నన్ను అడగవచ్చు. కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయాలు నాకు తెలుస్తాయి కాబట్టి మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని విషయాలతో సరికొత్త మాటలతో కొత్త కొత్త పాటలను మీరు వినాలనుకుంటే నన్ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవకుండా చేయలేరన్న విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే మీలోనూ ఏదైనా టాలెంట్ ఉంటే దానిని దాచేయకండే కచ్చితంగా మీరు కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి మీలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకోండి. ఈ సమాజంలో మనకంటూ ఒక టాలెంట్ ఉంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.
ఏదో అలా జీవించేస్తున్నాం ఎలాగో ఈ జీవితాన్ని గడిపేద్దాములే అని వదిలేయకండి. మీలో ఏ ఆలోచన కలిగిన దానిని బయటకు తీసుకువచ్చి కొంచెం తెలివితో అది ఈ సమాజానికి ఉపయోగపడేలా అలాగే మీ జీవితానికి మంచి మార్గం అయ్యేలాగా చేసుకోండి. సరే మరి ఉంటాను చాలా మాట్లాడేసాను. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శివ
Babu maa song petu ‘mohini’ please