Nandu Song – Shiva K Creations

Shiva
By Shiva

నందు సాంగ్ డౌన్లోడ్

Nandu Name Song Download

ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

                       పరిచయం

ఈపాటికి నా గురించి మీరు తెలుసుకునే ఉండొచ్చు. కానీ కొత్త వారికి నా గురించి చెప్పడం నా బాధ్యత. నా పేరు శివకుమార్ అండోయ్. ఈరోజు నేను మీకు నేను ఏం చేయగలను అనేది చెప్తాను. నేను స్టోరీస్, కవితలు, మంచి మాటలు, ఇంకా పాటలు కూడా రాస్తాను. అది నా అలవాటుగా మారింది. దాని కారణంగానే ఈ ఆర్టికల్స్ పోస్ట్ చేయడానికి ఈ వెబ్ సైట్ తీసుకోవడం జరిగింది.

                        సారాంశం

ఈ ప్రపంచంలో మనుషుల జీవితాలలో చేసుకునే పండుగలు కానీ పెళ్లిళ్లు ఘనంగా చేసుకోవడానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అలాగే ఏదైనా పనిని ప్రారంభించడానికి ఒక రకమైన పద్ధతితో చేయాలనీ ఆచారాలు ఉన్నాయి. ఎందుకంటే సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో కొన్ని ఆచారాలను మన పూర్వీకులు పెట్టారు. ఇప్పటి మనుషులు వాటిని ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారో ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాం.

                    పెళ్లి ఆచారాలు

పెళ్లి అంటే ఒక కొత్త బంధాన్ని ఒక కొత్త ఆనందాన్ని జీవితంలోకి చేర్చుకోవడం. కానీ కొంతమంది అలా అనుకోవడం లేదు. పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి పనులు మొదలెట్టినప్పటి నుంచి. ప్రతి ఒక్క ఆచారంలో లాభాన్ని పొందుదామనే చూస్తున్నారు. ఒక కొత్త బంధం మన జీవితంలోకి వస్తుంది. ఆ బంధంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా సరే ఇద్దరు పంచుకుంటూ. ఆహా జీవితాన్ని గడిపేయవచ్చు అనే ఆలోచనలో ఉండటం లేదు. ప్రతి ఆచారాన్ని లాభం కోసం వాడుకుంటున్నారు. పెళ్లి అనే బంధాన్ని బిజినెస్ గా మారుస్తున్నారు. బంధాల మధ్య విలువ లేకుండా కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇస్తున్నారు. బంధాలు మనుషులు అంటేనే అసహ్యం వచ్చేలా చేస్తున్నారు.

పెళ్ళికొడుకుకి బట్టలు పెట్టే దగ్గర నుంచి, పెళ్ళికొడుకుకి ఇచ్చే కానుకల వరకు లాభం మగ పెళ్లి వారిదే అవ్వాలని చూస్తున్నారు. అయ్యేలా ప్రతి పనిలోనూ ఆటంకం వచ్చేలా చేస్తారు. అలా కాని పక్షంలో గొడవలకు దిగుతారు. ఆడపిల్లని ఇచ్చినందుకు సరేలే అని సర్దుకోవాలి. అంతే తప్ప మగ పెళ్లి వారిని ఏమీ అనని పరిస్థితి ఎదురవుతుంది. ఇది నేటి సమాజంలో ఆచారాలను అడ్డుపెట్టుకొని చేస్తున్న డ్రామా.


                  పండుగ ఆచారాలు

సంక్రాంతి పండుగ వస్తే చాలు. కోడి పందాలు,పేకాటలు, నంబరు గుండాటలు మొదలవుతాయి. ఎప్పటినుంచో పూర్వీకులతో వస్తున్న ఆచారం అని చెబుతూ మొదలెడతారు. పండుగలు అనేవి మనుషులందరూ బంధువులతో కలిసి సరదాలు సంతోషాలతో జరుపుకునేవి. అయినప్పటికీ చాలామంది ఈ విషయాన్ని మరిచిపోతున్నారు. వారు సంపాదించిన కష్టాన్ని పణంగా పెట్టి కోడి పందాలు,పేకాటలు, ఆడుతున్నారు. అది చాలదు అన్నట్టు నంబర్ గుండాటలు ఆడుతారు. సరదా కాస్తా ఒక ఏడాదంతా జీవితం భారమయ్యేలా చేసుకుంటున్నారు.

కొంతమంది అయితే ఏకంగా ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి. అప్పులు తీసుకొచ్చి మరీ ఆడుతారు. ఆటలలో  ధనం పోగొట్టుకొని. తిరిగి అప్పు తీర్చలేక ఆ పొలాలను మరియు ఇళ్లను అప్పు తీసుకున్న వారికే తక్కువ ధరలో అమ్మేస్తారు. ఇలా చేయటం వల్ల జీవితంలో వారు ముందుకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతారు. ఏ ఆచారమైన జీవితాన్ని ఆనందమయం చేయాలి. కానీ ఇలా జీవితాలను నాశనం చేసుకోకూడదు అని తెలుసుకోవాలి.


               తుమ్మితే అంతే సంగతి

కొంతమందిలో ఎప్పటికీ విడవని ఇదొక జబ్బులా ఉండిపోయింది. పూర్వం మనుషులలో ఎవరికైనా జలుబు లేదా జ్వరం ఉంటే, వారు తుమ్ముతున్నప్పుడు లేదా దగ్గినప్పుడు మూడు అడుగుల దూరం పాటించేవారు. ఎందుకంటే అప్పటిలో జలుబు లేదా జ్వరం ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండటానికి. ఈ ఆచారాన్ని మొదలుపెట్టారు.

పైన ఉన్న కథ వెనుక అంతరార్థం వదిలేసారు. ఎవరైనా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మెద చాలు ఆగిపోవాల్సిందే. ఇంకా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని ఆపేయాల్సిందే. ఒకవేళ అలా కొనసాగిస్తే తుమ్మినప్పుడు బయలుదేరితే ఏదో ప్రమాదం జరిగిపోతుందనుకుంటారు. ఒక కొత్త పనిని ప్రారంభించినప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని సరిగా సాగదు. అని నమ్మకంగా కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే కొంతమంది మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు.

అదే పాపము చేయకూడదని ఎన్ని గ్రంథాలు ఎంతమంది చెప్పినా వినరు. ఇలాంటివి మాత్రం నమ్ముతారు. ఒక మనిషికి మనం చెడు చేస్తే కర్మ రూపంలో అది తిరిగి మన దగ్గరకే వచ్చే మనం చేసే పనిలో ఏదైనా ఆటంకం రావొచ్చేమో కానీ ఎవరో తుమ్మితే తగ్గితే మనం చేసే పనికి ఏమీ కాదు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మూఢ నమ్మకాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కనబడితే చెప్పడం ప్రారంభించండి ఇలాంటి మూఢనమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టండి.


                       నది స్నానం

కొంతమంది మనుషులు నమ్మేది ఏమిటంటే ఎవరికి ఏ ద్రోహం అయినా చేసేయవచ్చు. ఎవరో చేసుకునే మంచి పనికి ఆటంకం కలిగించవచ్చు. ఎవరికి ఏ దానం చేయకుండా ప్రతి వారి దగ్గర డబ్బు లాక్కోవచ్చు. వీటి నుంచి వచ్చే పాపాలను ఒక నదిలో మూడుసార్లు మునిగితే చాలు పాపాలు పోయి జీవితం ఆనందంగా అయిపోతుంది అని అపోహలో బతుకుతున్నారు.

కానీ మనిషే కాదు ఈ భూమ్మీదకి ఏ జీవం వచ్చి జన్మ కష్టాలు అనేవి తప్పవు. చేసిన పాపాలకు శిక్ష అనేది తప్పదు. మనం చూస్తూనే ఉన్నాం. కష్టం లేని మనిషి లేడు. ఈ జీవి లేదు. అయినా సరే ఇటువంటి మూఢనమ్మకాలకు పడిపోతున్నారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అనే దాని గురించి ఆలోచించడమే మానేశారు. మనిషి ఏం చేయాలనుకుంటే అది చేసి చివరికి ఏదైనా పుణ్య నదిలో స్నానం చేస్తే ఆ పాపం తొలగిపోతుందని అపోహలో బతుకుతున్నాడు. నిజం ఏమిటంటే కర్మ అనేది ఎవరిని విడిచి పెట్టదు.

                 ఎప్పుడు క్షమిస్తాడు

ఒక పొరపాటు చేశాక దేవుడుని నేను మళ్ళీ ఆ తప్పు చెయ్యను. నాకు తెలియక జరిగింది. అని క్షమాపణ కోరుకోవాలి.మళ్లీ ఎప్పుడూ ఆ తప్పు చేయకుండా ఉంటే జీవితం బాగుంటుంది. అంతే కానీ పాపాలన్నీ చేసేసి దేవుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసిన ఉపయోగం లేదు. పుణ్య నదిలో స్నానం చేసిన కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఇది నేను చెప్పింది కాదు. హిందూ సంస్కృతి,పురాణాలలో పెద్దలు చెప్పిన మాటలలో మొదలగు వాటిలో ఉన్నదే. మనం నిజజీవితంలో అనుభవిస్తున్నదే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే. మనం ఎదుటి వారికి మంచి చేసిన చేయకపోయినా, ఎదుటివారికి హానిని కలిగించకుండా ఉంటే. ఏ కర్మ మనల్ని ఏమీ చేయదు.

మనం చేసే పనులలో ఆటంకాలు తగ్గుతాయి. ఇంకా మన జీవితం ఆనందంగా మారుతుంది. మనం చేయగలిగినంత ఎదుటి వారికి సాయం కూడా చేయాలి. అలా చేస్తే అది ఇంకా మన జీవితానికి మంచిది.


                    పెద్ద మనుషులు 

మనం కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం. కొన్ని పురాణాలలోనూ కూడా వింటూ ఉంటాం. ఊరికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ ఊరిలో వారికి ఏదైనా సమస్య వస్తే ఆయన సహాయం చేస్తాడు. ఎవరి మధ్య అయినా ఏదైనా గొడవ వస్తే మధ్యలో నిలబడతాడు. అటు ఉన్నవారిలో ఇటు ఉన్నవారిలో న్యాయం ఎవరి దగ్గర ఉందో తెలుసుకుంటాడు. ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష విధిస్తాడు. న్యాయం ఎవరి పక్షాన ఉందో వారికి న్యాయం జరిగేలా చేస్తారు. ఇది ఒకప్పుడు జరిగిన పెద్ద మనుషుల కథ.

కానీ పైన చెప్పిన విధంగా ఇప్పుడు లేదు. మన బంధువులలో ఉండవచ్చు. లేదా మన చుట్టూ ఉండే మనుషుల మధ్య పెద్ద మనుషులుగా కొంతమంది ఉంటారు. పెద్దమనుషులు లాగా చలామణి అవుతూ ఉంటారు. నిజానికి వీళ్ళకి తోటి వారికి సహాయం చేయాలని ఆలోచన ఉండదు. కేవలం ఒక అధికారాన్ని సంపాదించి. మనుషుల మధ్య గొడవలు పెడుతూ మళ్లీ వాళ్లే ఆ గొడవలను సరిదిద్దుతున్నట్టు కనిపిస్తారు. వీళ్ళని గుర్తించడం ఎలా అంటే. వాళ్ల వస్త్రాధారణ వైట్ అండ్ వైట్ దుస్తులు ధరిస్తే ఖచ్చితంగా వారిని నమ్మాల్సిన పనిలేదు. అటువంటి దుస్తులు ధరించిన వారిలో 80 శాతం పెద్దమనుషులు కాదు. అబద్ధాలు బూటకాలతో మంచి చేస్తున్నాం అన్నట్టుగా మంచి మాటలు చెబుతారు. మనుషుల మధ్య గొడవలు పెడుతారు. ఒక ఆటలాగా ప్రతి ఒక్కరి జీవితంతో ఆడుకుంటూ ఉంటారు.

వీరు మొదట చేసేది ఎదుటివారిలో నమ్మకాన్ని ఏర్పరచుకోవడం. దానికోసం చాలా గౌరవంగా ఆప్యాయంగా మాట్లాడుతారు. స్నేహం లేదా ఒకరకమైన బంధాన్ని మనతో ఏర్పరచుకుంటారు. మన కుటుంబాలలో జరిగే సమస్యలను వారికి మనమే చెప్పే విధంగా అవుతారు. వాళ్లు మనతో బంధాన్ని కుదుర్చుకుంటారు.

పైన విధంగా సంబంధాన్ని ఏర్పరచుకొని. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, మనకి ఎవరితో అయితే శత్రుత్వం ఉందో. వారితో కూడా స్నేహం చేసి ఈ విషయాలను వాళ్ళకి తెలియజేస్తారు. మన బలాన్ని దెబ్బతీస్తారు. మన ఇంట్లో ఏం జరుగుతుందనే విషయం. ఇలాంటి పెద్ద మనుషుల ద్వారా మన శత్రువుల ఇంటికి చేరుతుంది. అప్పుడు ఏదైనా సమస్య ఉంటే అది ఇంకా పెద్దది అవుతుంది. మరియు ఆ సమస్యను మనం ఎదుర్కోలేని విధంగా తయారవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య ఉంటే అది మీరే పరిష్కరించుకోవాలి. పెద్దమనుషులు అనే ఆచారాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మంచి చేసే పెద్దమనుషులు ఎవరూ లేరు అని గుర్తుంచుకోవాలి.

                       పిల్లి ఎదురొస్తే 

పూర్వం ఇల్లు అన్నీ కూడా తాటాకులు మరియు కొబ్బరాకుల గోడలతో ఉంటాయి. ఇంకొన్ని ఇల్లు మట్టి గోడలచే నిర్మించబడి ఉండేవి. ఇలాంటి ఇళ్లకు పైన ఇంట్లోకి వెలుతురు వచ్చే విధంగా కొంచెం ఖాళీ విడిచి పెట్టేవారు. ఈ కాళీ నుంచి పిల్లులు సులభంగా లోపలికి వచ్చేస్తాయు. వారు అటకపై పెట్టిన లేదా ఇంట్లో ఏదో ఒక మూల ఉంచిన పాలు తాగేస్తాయి. ఇంకా పెరుగు కుండలపై మూతకాని పెట్టకుంటే పిల్లులు తాగేసేవి.

అలాంటి సమయంలో బయటికి వెళుతున్నప్పుడు వారికి పిల్లి ఎదురు వస్తే వారికి జ్ఞాపకం వచ్చి పెరుగు కుండలపై లేదా పాలకొండలపై మూత పెట్టామా లేదా అని ఇంకొకసారి చూసుకోవడానికి వెనక్కి వచ్చి జాగ్రత్త చేసుకుని మరలా వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లేవారు. ఈ విధంగా పెళ్లి ఎదురు వస్తే వెనకకు వెళ్లడం అనే అలవాటు మొదలైంది.

ఈ కథను తెలుసుకొని కొంతమంది ఈ కాలం మనుషులు ఏ కారణం లేకుండానే పెళ్లి ఎదురు వస్తే ఏదో చెడు జరుగుతుంది అని అనుకుని కొంచెం సేపు ఆగి వెళ్తున్నారు. ఇది అన్నిటిలో కెల్లా పెద్ద మూఢనమ్మకం. ఇప్పుడు మీరు అసలు కథను తెలుసుకున్నారు కాబట్టి ఎవరైనా ఇలాంటి మూఢనమ్మకాలను ఫాలో అవుతుంటే వారికి చెప్పే ప్రయత్నం చేయండి.

ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Nandu Song Link 👇

Download

హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ పాటని డౌన్లోడ్ చేసుకోవడం కోసం వచ్చారని నాకు తెలుసు. Instagram లో ఈ పాట మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఫుల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారంటే. అది నిజమే అయి ఉంటుంది కదా మరి. అయితే ఇది నేను అనుకోవడం కాదు. మీ చేత ఆ మాట నాకు వినిపించాలి. కాబట్టి ఈ పాట మీకు ఎలా అనిపించింది. మీరు ఎలా ఫీలయ్యారు. ఎవరి కోసం ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారు. నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మరిచిపోకండి. మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. దాని వల్ల నేను మరింత ఉత్సాహంతో ఇంకొన్ని పేర్లతో పాటలు రాయడానికి ఇష్టపడతాను.

అలాగే మీకు ఇంకొక విషయం కూడా తెలియ చేయాలనుకుంటున్నాను. మీరు ఇలా పేర్లతో పాటలను డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా, నేను ఈ పేజ్ లో రాసిన ఆర్టికల్స్ ని కూడా చదివితే బాగుంటుంది. అవి కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో మీ జీవితానికి ఉపయోగపడతాయి. అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా నేను చదివిన పుస్తకాల నుంచే ఉంటాయి. ఇంకా నేను విన్న ప్రవచనాల నుంచి కొన్ని ఉంటాయి. కొన్ని నాకు ఎదురైన అనుభవాల నుంచి రాసినవి ఉంటాయి. ఈ స్టోరీస్ ని కూడా మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.

ఇవన్నీ మీకు నచ్చినట్లయితే, మన ఈ వెబ్సైట్ ని తరచూ విజిట్ చేయడం మరిచిపోకండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం మరిన్ని పాటల కోసం. ఇంస్టాగ్రామ్ పేజ్ని  కూడా ఫాలో అవ్వండి. థాంక్యూ థాంక్యూ ఉంటాను మరి. మరొక పేజ్ లో మరొక స్టోరీ తో మళ్ళీ కలుద్దాం.

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *