దేవి సాంగ్ డౌన్లోడ్
ఈ సాంగ్ ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
పాత వారికి నా పేరు గుర్తున్నప్పటికీ వచ్చిన కొత్త వారికి నా పేరు తెలియాలి కాబట్టి నా పేరు శివకుమార్. నాకు పాటలు, కవితలు, స్టోరీలు రాయడం అంటే చాలా ఇష్టం అండోయ్. నా పాటలను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను రాసిన స్టోరీస్ కూడా మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. నేను రాసే స్టోరీస్ కొన్ని సరదాగా ను కొన్ని జీవితానికి ఉపయోగపడే విధంగానూ ఉంటాయి. మీరు నవ్వుకోవాలి అనిపించిన ఏదైనా విషయం తెలుసుకోవాలని అనిపించిన నా స్టోరీస్ చదివి మీకు కావలసింది మీరు పొందవచ్చు.
విషయం
ఈ ఆర్టికల్లో నా డైలీ లైఫ్ లో జరిగే కొన్ని హాస్యాస్పదమైన విషయాలు మరియు కొన్ని జీవితానికి ఉపయోగపడే విషయాలు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ.
మొదటి విషయం
అమ్మాయి అందాన్ని బట్టి లేదా మన వయసులో ఉన్న దాన్ని బట్టి ఒక అమ్మాయి మీద ప్రేమ కలగడం సహజం. అది అందరిలో జరిగే సాధారణ ప్రక్రియ. కాబట్టి ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఒక అమ్మాయిని ఇష్టపడడం తప్పు కాదు. అయితే ఆ ఇష్టపడడంతోనే మనమీదికి ఒక బాధ్యత వస్తుంది. మరి ఆ బాధ్యతను మోసే దమ్ము ధైర్యం మనలో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రేమని మనం పొందాలన్నా దాని నుంచి వచ్చే సౌఖ్యాన్ని మనం గెలుచుకోవాలన్న ఆ బాధ్యతను మోసే దమ్ము ధైర్యం మనకు ఉండాలి. కేవలం ప్రేమ ప్రేమ అని తన చుట్టూ తిరిగేస్తాను అంటే మీది అబద్ధపు ప్రేమ అయిపోతుంది. తన నుంచి వచ్చే బాధ్యతలు అన్నిటినీ మోసే విధంగా మీరు తయారై ఉండాలి.
రెండొవ విషయం
మనం ఏ పరిస్థితుల్లో ఉన్న మన అమ్మానాన్న ఏ విధంగా అయితే మన పక్కన ఎప్పుడూ ఉంటారో అదే విధంగా భార్య కూడా మన పక్కన ఏ పరిస్థితుల్లో ఉన్న ఉంటుంది. అవసరమైన ధైర్యాన్ని ఇస్తూ కష్టాన్ని పంచుకుంటూ భర్త సౌఖ్యాలను చూస్తూ, పిల్లలను కని వారిని పెంచుతూ వారి అవసరాలను తీరుస్తూ అనేక విధాలుగా అత్తవారింటికి వెళ్లి ఒక అమ్మాయి ఎన్నో సేవలను చేస్తుంది. భర్త డబ్బు సంపాదించవచ్చు కానీ భార్య లేకపోతే ఆ సంపాదనకి అర్థమే లేదు.
మూడవ విషయం
కొంతమంది మగవాళ్ళు డబ్బు సంపాదిస్తున్నామని తమరు హీరోలులా భార్య సంపాదించట్లేదు కాబట్టి ఇంటికి వచ్చిన పనిమనిషిలా చూస్తారు. తనకు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఉచితంగా ఊరికి సేవ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతారు. ఇది చాలా తప్పు ఎంతో అలారం ముద్దుగా పెంచుకున్న ఒక అమ్మాయి, పుట్టింటిని వదిలి అత్తింటికి సేవలు చేయడానికి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా భర్త మరియు అత్తవారి కుటుంబం ఆ అమ్మాయి చేసిన త్యాగాన్ని సేవని గుర్తించి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వారికి కచ్చితంగా ఉంటుంది.
సాధారణంగా అయితే ఇది వారి బాధ్యత కూడా. వారికి పుట్టిన సంతానమే వారి వారసుల అన్నట్టు ఫీలయ్యి ఇంటికి వచ్చిన భార్య మాత్రం పరాయి వారిలా చూస్తే మీరు ఏ సంపాదనైతే చూసుకుని మగవారిలో ఫీల్ అవుతున్నారో ఆ సంపాదనకి ముప్పు వాటిల్లక తప్పదు. మన జీవితానికి డబ్బు ఎంత అవసరమో భార్య కూడా అంతే అవసరం అని గుర్తించి భార్యను సరిగ్గా చూసుకోవడం మన బాధ్యత అని తెలుసుకోవాలి.
నాల్గవ విషయం
పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో అంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని పుట్టింటి వాళ్లే చూసుకోవాలని బాధ్యత అంతా పుట్టింటి వాళ్ళదే అని తప్పించుకోవడం సరికాదు. ఎందుకంటే మీ దగ్గర ఆ స్తోమత లేనప్పుడు అత్తవారింట్లో చూసుకునే అవకాశం ఉన్నప్పుడు మీరు వదిలేయడంలో తప్పు లేకపోవచ్చు. కానీ అన్ని అత్తింటి వారికే సంబంధం మాకు ఏమీ సంబంధం లేదు అన్నట్టు దూరంగా ఉంటే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటి వారిది ఎంత అదే విధంగా భర్తది కూడా అంతే బాధ్యత ఉంటుంది. తను ఏ విధమైన ఆహారం తింటుంది. బిడ్డకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలుసుకుంటూ ఉండడం భర్త యొక్క కనీస బాధ్యత. ఇది కొంతమంది భర్తలలో లేకపోవడం బాధపడవలసిన విషయం. భర్త ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న భార్య ఆ కష్టాన్ని పంచుకుంటుంది. అలాగే ఆ భార్య తనకు కష్టం వచ్చినప్పుడు తన పక్కన ఉన్నాడా లేదా అని పరీక్షించుకుంటుంది.
ఒకవేళ మీరు నాది కాదు బాధ్యత పుట్టింటి వారిదే అని దూరంగా ఉన్నట్లయితే భార్య మిమ్మల్ని కష్టం వచ్చినప్పుడు నా పక్కన లేడు అనే విషయంలో మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది మరియు బాధపడుతుంది. ఇలాంటివి జరగడం వల్ల భార్యకు తన భర్త పై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. ఏ కష్టం వచ్చినా పక్కన నేను ఉంటాను అనే ధైర్యం భర్త ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా దూరంగా ఉండటం భార్యకి దురదృష్టం గా ఫీల్ అవుతుంది. కాబట్టి మగవారుగా మనము ఈ విషయాన్ని తెలుసుకోవడం మన బాధ్యత.
ఐదవ విషయం
కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే మగ పిల్లలకు పెళ్లి చేసే విషయంలో చాలా కఠినంగా ఉంటారు. తమ పిల్లలు ప్రయోజకులుగా అవ్వడం కోసం ఖర్చు చేసిన డబ్బును కూడా పెళ్లి ద్వారాగా పొందాలని చూస్తారు. డబ్బునే మొదటి లాభంగా మాట్లాడుతూ ఉంటారు. జీవితాంతం వాళ్ల అబ్బాయిని మరియు ఆ కుటుంబానికి సేవ చేయడానికి వచ్చిన అమ్మాయిని వారు పట్టించుకోరు. ఎంతసేపు కోడలు ఏం తెచ్చిందా పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారా అని మాత్రమే చూస్తారు. తల్లిదండ్రులు పిల్లల సుఖాలను కోరుకునే వాళ్లే అయితే పెళ్లి చేసి జంట అయిన తర్వాత వారు సుఖంగా ఉండాలని కోరుకుంటారు.
ఆ విధంగా కట్న కానుకలతో వచ్చే లాభాలను చూడరు. కట్న కానుకలు పుట్టింటి వారి సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. వారి సంపాదనకు మించి లాభాన్ని ఆశిస్తూ వారిని ఎదురైన ప్రతిసారి కట్న కానుకుల గురించే మాట్లాడుతూ పుట్టింటి వారిని అవమానిస్తారు. చివరికి పుట్టింటికి అత్తింటికి ఉన్న సంబంధం మెల్లగా పోతుంది. ఎప్పుడైతే మనిషి ప్రేమకు, బంధాలకు విలువనిస్తాడో అప్పుడు మాత్రమే ఆ బంధుత్వం బలంగా ఉంటుంది. కొడుకు మంచి సంపాదనలో ఉన్నప్పటికీ లాభం పుట్టింటి నుంచే రావాలి అని అనుకుంటారు. అది చాలా తప్పు. పుట్టింట్లో ఉన్న అన్నదమ్ముల గురించి కూడా వారితో వెంట వచ్చే అమ్మాయి ల గురించి కూడా అత్తింటి వాళ్ళు ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఉన్నది అమ్మాయిలే కాబట్టి. వారి సౌఖ్యాలను చూసే బాధ్యత వారిపై ఉందని గుర్తించాలి.
మొదటి నుంచి ఎంతసేపు ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత కట్న కానుకలు గురించి పుట్టింటి వారిని వేధించకూడదు. ఈ మాత్రం జ్ఞానం కనీసం కొంతమంది తల్లిదండ్రులకు ఉండటం లేదు ఈ కాలంలో. తల్లిదండ్రులు చదువుకోకపోయినా ఇటువంటి విషయాలు తెలియకపోయినా చదువుకొని ఉన్న మనమే వారికి అన్ని విషయాలు తెలియచేయాలి. అది మన కనీస బాధ్యత. పెద్దవారు ఎప్పుడు కట్న కానుకలని గౌరవాలని పరువు.. ఊరిలో పేరు గురించి మాత్రమే ఆలోచిస్తారు.తమ పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు అనే దాని గురించి వారు ఆలోచించరు. కనీసం భర్త ఈ విషయాన్ని గుర్తించి తమ భార్యకు ఏమి కావాలో చూసుకోవాలి.
తరువాత తనకీ ఎలా ఉంటే ఇష్టమో తెలుసుకొని ఉండవలసిన బాధ్యత భర్తకు ఉంటుంది. ఎప్పుడైతే ఈ విషయాలను జ్ఞానంతో తెలుసుకొని బంధుత్వాలతో వ్యవహరిస్తారో ఆ బంధుత్వాలు ఎనలేని సుఖాలను సంతోషాలను పొందుతారు. పుట్టిల్లు మరియు అత్తిల్లు కలిసి ఎదురైన కష్టాలను పంచుకుంటూ ఉంటే ఆ బంధుత్వంలో ప్రేమ అనురాగాలు పెరుగుతాయి దానితో పుట్టిల్లు మరియు అత్తిల్లు సుఖ సంతోషాలతో నిండుతాయి. తమ బంధువులు ఎప్పుడు తమతో పాటు ఉండాలని కోరుకోవాలి కానీ తమ నుంచి వచ్చే ఆస్తిపాస్తులు గురించి ఆశిస్తూ వారిని అవమానించడం చాలా తప్పు. ఎప్పుడైతే బంధుత్వాలతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటాడో ఆ ఇల్లు సందడిమయం అవుతాయి.
ఆరవ విషయం
మగవారు ఉద్యోగం భార్య పక్కనే ఉండే విధంగా చేసుకోవాలి. భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తూ భార్యని దూరంగా ఉంచి అప్పుడప్పుడు వెళ్లి వస్తుండడం అనేది ఆ సంసారంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా పొందడానికి వీలుగా ఉండదు. కాబట్టి భర్త ఎక్కడైతే ఉద్యోగం చేస్తాడో భార్యని కూడా అక్కడ ఉంచుకునే విధంగా చేసుకోవాలి. భర్త ఉద్యోగానికి వెళ్లడం ఇంటికి వచ్చిన వెంటనే ఇంటిని శుభ్రంగా ఉంచి అందంగా తయారయ్యి భర్త కంటపడటం ఇద్దరూ కలిసి భోజనం చేయటం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం.
ఇలాంటివి సినిమాల్లో చూసి మనం ఎంతో ఎంజాయ్ చేస్తాం. అలాంటివి నిజంగా మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది అనే విషయం ఎంతమంది ఆలోచిస్తున్నారు. అంటే ఆలోచించని వాళ్లు లేరు అని కాదు. కొంతమంది వారి గురించే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే భార్య భర్త పక్కనే ఉంటుందో వంటకి సమస్య ఉండదు. ఉద్యోగం అయిపోయిన వెంటనే మొబైల్ తో కాలాన్ని గడిపే అవసరం ఉండదు. పెళ్లి అనే దాంట్లో అసలైన ఆనందాన్ని పొందాలంటే భార్య ఎప్పుడూ పక్కనే ఉండే విధంగా చేసుకోవాలి.
ఏడవ విషయం
ఏదైనా సినిమాలో ఒక హీరో,హీరోయిన్ ని బైక్ మీద ఎక్కించుకొని ప్రపంచమంతా ఆనందంగా గంతులేస్తూ తెగ ఫీల్ అయిపోతూ ఉన్న సన్నివేశాన్ని చూస్తూ మనం ఎంతో ఆనందిస్తాం. మరి అటువంటి సంతోషాన్ని మన నిజ జీవితంలో పొందాలంటే మనకి కూడా ఒక మంచి బైక్ ఉండాలి కదా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఏమని నేర్పిస్తారు అంటే అమ్మాయితో పాటు ఈ సౌఖ్యాన్ని కూడా పుట్టింటి నుంచే రావాలని అంటే పుట్టింటి వాళ్లే అబ్బాయికి బైక్ కూడా పెట్టాలని ఆశిస్తారు. ఒకవేళ వారికి అవకాశం ఉంటే తమ కూతురిపై ప్రేమతో ఖచ్చితంగా బైక్ ఇప్పించవచ్చు.
కానీ ఒకవేళ వారి దగ్గర ఆ స్తోమత లేకపోతే… బైకు పెట్టడానికి చాలా కాలం గడిపేస్తే…. ఒక్కోసారి పూర్తిగా పెట్టలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. అయితే మరి ఆ సినిమాలో చూసిన ఆనందాన్ని పొందడం వదిలేస్తారా. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పొందే ఏ ఆనందమైన ఇంక దేనితోనూ రాదు. అలాంటి ఆనందాన్ని పుట్టింటి వారిపై ఆధారపడి వదిలేయడం అనేది చాలా అమాయకత్వం. అబ్బాయికి బైకు కొనుక్కునే అవకాశం కల్పించుకోవడం భార్యతో ఆ సరదాని పొందడం తల్లిదండ్రులకు నేర్పించడం ఎలాగో కొంతమందికి తెలియదు. అలాంటప్పుడు కనీసం ఈ సినిమాలు లేదా నిజజీవితంలో కొంతమంది భార్య భర్తలు ఆనందంగా తిరిగే విధానాన్ని బట్టి అయినా తెలుసుకుని బైకు కొనుక్కోవడం మన కనీసం బాధ్యతగా మనం అర్థం చేసుకోవాలి.
ఎనిమిదవ విషయం
ఒక ఆడపిల్ల ఎన్ని బంగారం ఆభరణాలు ధరిస్తే అంత అందంగా ఉంటుంది. మగవారి ఒంటిమీద ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత చెండాలంగా ఉంటుంది. చేతినిండా ఉంగరాలు ఉంటే చేతికి సంకెళ్లు ఉన్నట్టు ఉంటుంది. అలా అని మగవారు బంగారం ధరించరాదు అని కాదు. మగవారు ధరించే ఆభరణాలు చాలా సింపుల్ గా ఉండాలి. మెడలో సన్నని చైన్ చేతికి వేలికి ఒక ఉంగరం ఇంకా చేతికి ఒక వాచి ఉంటే మంచి దుస్తులు ధరిస్తే చాలు. మగాడు హీరోలా ఉంటాడు. అంతేకానీ మేడ నిండా బంగారం. చైనులు చేతి వేలన్నిటికీ ఉంగరాలు ఉంటే ఉన్న అందం కూడా పోతుంది.
కొంతమంది బంగారు వస్తువులపై ఉంచినదృష్టి తమ నిజ జీవితంలో ఏం కావాలో ఆలోచించుకోరు. వాళ్లు తిరగడానికి అవసరాలకు తిరిగే వాహనం మంచిది ఉండదు కానీ మెడలో చేతి వేళ్ళకి మాత్రం బంగారం ఆభరణాలు ధరిస్తారు. తమకి తాము హీరోలుగా భావించుకుంటారు. ఎప్పుడైతే మగవారు సంపాదించిన ధనంతో ఆడవారికి ఆభరణాలు కొంటారో అందులో తనపై ఉన్న అభిమానం తెలుస్తుంది. ఇంకా తన భార్యను అందంగా చూసుకోవడంలో తనకే ఆనందం లభిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం మగవారిగా తెలుసుకోవడం మంచిది. భార్యతో ఒక మంచి మగాడిలా ఉండటానికి తనకు కావలసిన సౌకర్యాలను అమర్చడం. తనను ప్రేమగా చూసుకోవడం మగవారి బాధ్యత అని గుర్తించుకోవాలి.
ఇక్కడ ‘ Download ‘ అనే దానిపై క్లిక్ చేసి ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Devi Song Link 👇
హాయ్ హలో ఫ్రెండ్స్ నాకు తెలుసు మీరు ఈ వెబ్సైట్ కి దేవి సాంగ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారని ఇక్కడ వరకు వచ్చారంటే మీరు ఇంస్టాగ్రామ్ లో విన్న సాంగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నాలో నేను అనుకుంటే సరి కాదు కదా అందుకే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం ద్వారా నా కష్టానికి ఫలితం దక్కిందని నేను ఆనందిస్తాను. ఆనందంతో మరిన్ని పాటలను రాయటానికి ఉత్సాహం చూపుతాను. మన instagram పేజ్ని ఫాలో అవ్వడం నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోరు. మీరు మర్చిపోరని అనుకుంటున్నాను.
తొమ్మిదవ విషయం
భార్యతో వచ్చే సౌఖ్యాలన్నిటిని అనుభవించాలంటే మగవారు జ్ఞానంతో వ్యవహరించడం అలవర్చుకోవాలి. అన్నీ పుట్టింటి వారి మీదే ఆధారపడుతూ కాలాన్ని వృధా చేసుకోకూడదు. తమకు వచ్చే ఏ ఆనందాన్ని అయినా పొందడానికి తమపై తమకే సాధించుకోవడానికి దమ్ము ఉండాలి. అప్పుడే భార్య నుంచి వచ్చే అన్ని సౌఖ్యాలు లభిస్తాయి. ఈ విషయాలను షేర్ చేయడానికి గల కారణం కొంతమంది మగవారు ఈ విషయాలు తెలియక జీవితాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నారు. ఇంకా మంచి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.
పైన విషయాలు తెలుసుకోవడం వల్ల పెళ్లి అనే బంధం లో అన్ని సుఖాలను పొందాలని మా ఉద్దేశం. ఎవరినీ కించపరచాలని మేము అనుకోవడం లేదు. పెళ్లి అనే బంధంతో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. పెళ్లి ద్వారా వచ్చిన బంధం ఆనందంగా ఉంటే, ఆ బంధం వెంట ఉండే కుటుంబాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి. కుటుంబాలు అన్ని ఆనందంగా ఉంటే ఈ ప్రపంచమే ఆనందమయం అవుతుంది. దీనంతటికీ కారణం పెళ్లితో వచ్చే బంధమే. కాబట్టి ఆ బంధాలను ఆనందమయం చేయాలనేదే మా కోరిక. మా ఈ పేజ్ ని అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉంటాను. మరి చాలా విషయాలు మాట్లాడేసాను మరొక పేజ్ లో మరొక ఆర్టికల్ తో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ శివ.