Sandhya Name Song – Shiva K Creations

Shiva
By Shiva

సంధ్య సాంగ్ డౌన్లోడ్

Sandhya Name Song Download

ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

                    పరిచయం

ఆగండి ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు నా గురించి తెలుసుకోరా. అంతేలే నా పేరు శివకుమార్ అని మీరు తెలుసుకోరా. ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఏదైనా ఒక్క అవకాశం వస్తే ఆ టాలెంట్ ని నిరూపించుకోవాలని అనిపిస్తుంది. అందుకే కష్టమైనా ఈ పాటలను రాయడం అనే పనిని ప్రారంభించాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారు కదూ.

                  మొదటి కథ సారాంశం

నేను నా చిన్నప్పుడు చదివిన కథ ఇప్పుడు మీకు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే కష్టపడిన దానికి ఫలితం లేకపోతే నిరాశే మిగులుతుంది. అయితే ఆ కష్టం ఏమిటి. ఎందుకు నిరాశ మిగలాలి అనే దాని గురించి ఈ కథ.

                     తండ్రి బాధ

ఒక తండ్రి తన కొడుకు గురించి తన స్నేహితుడితో ఇలా బాధపడుతూ… ఎంతో ప్రేమతో పెంచుకున్నానురా నా కొడుకుని.. దేనికి పనికి రాకుండా అయిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా తెలియడం లేదు అని తన స్నేహితుడితో చెప్పుకున్నాడు. అప్పుడా స్నేహితులు నీ కొడుకుని నా దగ్గరికి పంపు అని అన్నాడు

ఒకరోజు తన కొడుకుని స్నేహితుడి వద్దకు పంపగా ఆ స్నేహితుడు ఇలా అన్నాడు. నీకు ఒక మొక్కని ఇస్తాను ఈ మొక్కని నువ్వు నాటి 30 రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు నీరును పోసి పెంచిన తర్వాత 31వ రోజు ఈ మొక్కని వేర్లతో లాగి చూస్తే కింద బంగారం ఉంటుంది అని అన్నాడు.

అప్పుడా కుర్రవాడు ఇంటికి ఆ మొక్కని తీసుకొని వెళ్లి తన తండ్రి స్నేహితుడు చెప్పిన విధంగా క్రమం తప్పకుండా 30 రోజులు నీరును పోసి పెంచాడు. 31 వ రోజు ఆ మొక్కని పేర్లతో సహా లాగి చూస్తే అతను చెప్పిన విధంగా బంగారం ఏమీ లేదు. కోపంతో తన తండ్రి స్నేహితుడి ఇంటికి వెళ్లి నోటికి వచ్చిన విధంగా తిట్టడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతాను విను ఒక 30 రోజులు కష్టపడి నీరు పోసి పెంచిన మొక్కే నీకు పనికి రాలేదని కోపం వస్తే. నిన్ను మీ నాన్న ఎంతో కష్టపడి నీకు తట్టుకోవడానికి బట్టలు ఉండటానికి ఇల్లు నీకు కావలసిన సౌకర్యాలకు డబ్బు నీ చదువులకు ఫీజులు కట్టి నిన్ను పెంచితే నువ్వు దేనికి పనికి రాకపోతే మీ నాన్నకి ఏం ఫలితం వచ్చినట్టు చెప్పు. మరి మీ నాన్న ఎంత బాధ పడాలి. అర్థం చేసుకో వయసు పెరుగుతుంది అంటే బుద్ధి కూడా పెరగాలి. ఇంకెంతకాలం నీవు ఇలా పనికిరాకుండా తిరుగుతావు ఆలోచించు. కష్టం నీకు వస్తేనే కాదు. మన వాళ్లకు వచ్చినా కష్టమే కదా. మరి మీ నాన్నది కూడా కష్టమే కదా నువ్వు ఇలా పనికి రాకుండా తిరుగుతూ మీ నాన్నకి నిరాశ మిగులుస్తావా ఏంటి. నిన్ను పెంచినందుకు ఫలితం లేదని బాధతోనే అతను జీవించాలా అని అన్నాడు.

దానితో ఆ కుర్రవాడు నిజమే అనుకున్నాడు మా నాన్న కష్టాన్ని నేను వృధా చేశాను ఇన్ని రోజులు అని అర్థం చేసుకున్నాడు. ఇకనుంచైనా మా నాన్నకి కష్టం కలగకుండా చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. బాగా చదువుకొని ఆ తెలివితేటలతో వ్యాపారం పెట్టి వాళ్ల నాన్నకి కావాల్సినవన్నీ కొనిపెట్టి. వాళ్లు ఉండే ఊరిలో వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాడు. నా కుమారుడు ఎలా ఎదిగాడు చూడు అని అందరికీ చెప్పుకునే విధంగా తయారయ్యాడు.

                         సూక్తి

కష్టం ఎవరిదైనా కష్టమే. మనకు వస్తే కష్టం ఎదుటివారికి వస్తే కష్టం కాదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎదుటివారి కష్టంతో మనం బతుకుతున్నప్పుడు వారి కష్టాన్ని తీర్చే విధంగా మనం కూడా తయారవ్వాలి. ప్రతి కొడుకు ఇది తెలుసుకుని బాగా చదువుకొని తన ఇంటికి ఆ ఊరికి పేరు తెచ్చుకునేలా తయారవ్వాలి అనేదే ఈ కథ యొక్క సారాంశం.

                 వైజాగ్ వెళ్ళినప్పుడు

నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఒక వీడియో షూటింగ్ కోసం అని వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ లో దిగి వీడియోస్ షూటింగ్ అయిపోయాక కైలాసగిరి అక్కడ కూడా వీడియో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇద్దరం కలిసి తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము.

              ట్రైన్ లో ఏం జరిగిందంటే

మేమిద్దరం కలిసి రెండు టికెట్స్ స్లీపర్ క్లాస్ లో తాత్కాల్ టికెట్స్ బుక్ చేసాము. అయితే రెండు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ట్రైన్ ఎక్కి మా సీట్లలో మేము పడుకున్నాము. ఈ లోగా పక్కన మిగిలిన సీట్లలోకి కూడా ఎవరి సీట్ నెంబర్ లో వారు పడుకున్నారు ఒక సీట్లో ఇద్దరు భార్యాభర్తలు మరియు వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలకి ఐదు సంవత్సరాల ఒకరికి సంవత్సరాలు ఒకరికి ఉంటాయి. ఈ ఇద్దరు పిల్లలతో ఆ తల్లిదండ్రులు మొత్తం నలుగురు కలిసి ఒకే సీట్లో అడ్జస్ట్ అయి పడుకున్నారు.

              మేము ఏం చేశామంటే

వాళ్లు నలుగురు ఒకే సీట్లో పడుకోవడం చూసి మా రెండు సీట్లలో ఒక సీటు వారికి ఇచ్చేసాము. తర్వాత మిగిలిన ఒక్క సీట్లో మేము ఇద్దరం కలిసి పడుకున్నాము. మేము ఇచ్చిన ఒక సీటు వారు బుక్ చేసుకున్న ఇంకొక సీటు ఈ రెండు సీట్లలో వాళ్లు ప్రయాణం మంచిగా చేసేలాగా 450 రూపాయల సీటుని ఫ్రీగా వాళ్లకి ఇచ్చేసాము.

       మేము ఎందుకు అలా చేశామంటే

మేము మా చిన్నప్పుడు మా ఫ్యామిలీతో ఇలాగే  ట్రైన్ లో జనరల్ బోగీలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి నిలబడి ప్రయాణం చేయవలసి వచ్చేది. సీట్లు దొరకక ఒక్కొక్కసారి నిలబడి కూడా ప్రయాణం చేయవలసి వచ్చేది. నిలబడి ప్రయాణం చేస్తూ ఎంతో ఇబ్బందితో ఎవరైనా ఒక సీటు ఇస్తారేమో అని చూసేవాళ్లం. కానీ ఎవరూ కూడా కాసంత చోటుని కూడా ఇచ్చేవారు కాదు. ఆ ఇబ్బందితో ట్రైన్ ఎప్పుడెప్పుడు దిగిపోదామా అనిపించేది. అలాంటి ఇబ్బంది జర్నీలు ఎన్నో చేసాము. అది కూడా ఫ్యామిలీతో చేయాల్సి వచ్చింది ఎందుకంటే అప్పుడు పరిస్థితి అలా ఉంది. ఇప్పటికీ చాలామంది ఆ పరిస్థితిలోనే ప్రయాణం చేస్తున్నారు. మేము అది చూడలేక మా సీటుని వాళ్ళకి ఇచ్చేసాము.

                  ఏదైనా మంచి పని చేస్తే

మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే అది ఎక్కడికి పోదు. తిరిగి మనకు అవసరమైనప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో మన వద్దకు కచ్చితంగా చేరుతుంది. మేము చేసిన ఈ సహాయం వారు ఎప్పటికీ మర్చిపోరు. అలాగే వారు ఈరోజు ప్రయాణంలో ఈ సహాయాన్ని పొందారు కాబట్టి ఒకవేళ వాళ్లకి ఇంకొక ప్రయాణంలో వేరొకరి పరిస్థితి అలాగే కనిపిస్తే కచ్చితంగా వారు కూడా సహాయం చేస్తారు. అందుకనే ఒకరికొకరు ఈ విధంగా సహాయం చేసుకోవడం వల్ల సమాజం కచ్చితంగా మారుతుంది మంచి అనేది పెరుగుతుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ ప్రతి చోట ఏదో ఒక సహాయం ఎవరో ఒకరికి అవసరం అవుతుంది. కాబట్టి మీరు ఆ పరిస్థితికి దగ్గరగా ఉంటే మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండి.

                    కరివేపాకు కథ

ఈ కరివేపాకు కథ విన్నాక నీలో మార్పు కచ్చితంగా వస్తుంది. ఇంట్లో ఏదైనా ఉప్మా,సాంబార్ ఫ్రై కర్రీ చేసినప్పుడు కరివేపాకుని వాడుతారు కదా ఒకవేళ పొరపాటున మనం తినే ప్లేట్లోకి కరివేపాకు వస్తే వెంటనే పక్కకి తీసి పెట్టేస్తాము. దీనివల్ల మనకు జరిగే ఎన్నో లాభాలను కోల్పోతున్నట్టే. ఎందుకంటే కరివేపాకు వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. కంటి చూపు నువ్వు మెరుగుపడడానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కరివేపాకు మన రక్తంలోని ఇమోగ్లోబిన్ లెవెల్ పెంచుతుంది. ఎముకలను దంతాలను బలంగా అయ్యేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకు సంబంధించిన రోగాలను రాకుండా చేస్తుంది. కరివేపాకుతో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి. కరివేపాకు మీరు తినే ఉప్పాలో కానీ సాంబార్లో కానీ ఉంటే తీసి పడేయకండి. అలాగే ప్రతి ఒక్కరిని కరివేపాకు గాడు అని నన్ను హేలన్ చేస్తూ వాళ్ళని ఆళ్ళను చేయకండి. ఇప్పటికైనా కరివేపాకు యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కాబట్టి. కరివేపాకును తినటం ప్రారంభించండి.

             ఎన్ని గంటలు పడుకోవాలి

స్మార్ట్ ఫోన్ వచ్చాక సరిగ్గా ఎవరు నిద్రపోవడం లేదు అని రీసెర్చ్ లో తేలింది. రోజుకు మినిమం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. తప్పనిసరి పరిస్థితిల్లో రోజుకు ఆరు గంటలైనా నిద్రపోవాలి. ఒక రోజుకి 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే శరీరం శక్తిని కోల్పోయీ ఆయుష్షు తగ్గుతుంది. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. కొంతమంది ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక రాత్రి రెండు గంటల వరకు కూడా మొబైల్ చూస్తూ ఉంటున్నారు. దీనివల్ల బ్లూ లైట్ రేస్ కళ్ళ మీద పడి నిద్ర సమస్యలు వస్తాయి. మరియు కంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్లను వినియోగించరాదు. ఏదైనా పని కోసం అయితే జాగ్రత్తగా వాడాలి. ఏ పని లేకపోతే గనక రాత్రిపూట మొబైల్ వాడకూడదు.

                      Emi ల పరుగు

ఒక్కోసారి మనం అప్పు చేయకూడదు అని అనుకుంటాం. కానీ ఇంట్లో పెళ్లిళ్లు, పెళ్లిళ్లు జరగాలంటే ఇల్లు, వయసులో ఉన్న యువకుడికి ఏదైనా పని చేయాలనే బాధ్యత వీటన్నిటికీ ఒక మధ్యతరగతి కుటుంబంలో డబ్బు కొరత కచ్చితంగా ఉంటుంది. దీనివల్లనే ఒక మధ్య తరగతి కుటుంబానికి Emi అనేది సర్వసాధారణం అయిపోతుంది. ఆ Emi లతో జీవితం పరుగుగా మారిపోతుంది. కానీ తప్పదు. ఇలా అవసరాలకు తీసుకునే Emi ల వల్ల మీరు ఇబ్బంది పడిన మీ జీవితంలో మీరు కచ్చితంగా చేయాల్సిన పెద్ద బాధ్యతలు తీరిపోతాయి. కానీ మీరు ఇటువంటి పెద్ద బాధ్యతలు, అవసరాల కోసం కాకుండా ఇతరుల ముందు గొప్ప కోసమో లేదా సరదా కోసమో  Emi లలో వస్తువులు తీసుకుంటే కనుక మీరు బాధ్యతలు  చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మళ్లీ అప్పు చేయవలసి ఉంటుంది. అవి ఇవి ఏకమయ్యి మీ జీవితం అయోమయం అయిపోతుంది. కాబట్టి వీటిలో దిగే ముందే చాలా ఆలోచించి అవసరమైతేనే తీసుకోవాలి అప్పుడే మీరు దాని నుండి బయట పడతారు.

ఇక్కడ Download అనే దానిపై క్లిక్ చేసి మీరు ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవచ్చు

Sandhya Song Download 👇

Download

ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విన్న తర్వాత మీకు ఎలాగా అనిపించిందో, మీరు ఎలా ఫీలయ్యారో, ఎవరికోసం ఈ పాటను డౌన్లోడ్ చేసుకున్నారో మాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ అభిప్రాయాన్ని తెలపడం మాత్రం మరిచిపోవద్దు. మీ అభిప్రాయం మాకు ఎంతో అవసరం. మీ అభిప్రాయంతో మాకు మరెన్నో పాటలు రాయడానికి మరింత ఉత్సాహం లభిస్తుంది.

మీకు ఈ పాట నచ్చినట్లయితే మన ఇంస్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయ్యి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఉంటాను ఫ్రెండ్స్ ఇట్లు ప్రేమతో మీ శివకుమార్

 

 

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
3 Comments
  • Hi bro నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం నాదగ్గర చాలా మంచి స్టోరీ లు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి మంచి మూవీ తీయాలన్నాడే నా డ్రీం give మీ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ అండ్ నాకు శ్వేతా నేమ్ తో మంచి love సాంగ్ కావాలి బ్రో ఇది ఒక love స్టోరీ బావ మరదలు ది షార్ట్ ఫిల్మ్ కీ చేయిస్తావా బ్రో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *