Deepika Name Song – Shiva K Creations

Shiva
By Shiva

దీపిక సాంగ్ డౌన్లోడ్

Download Deepika Name Song

ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

                            పరిచయం

నా పేరు శివ కుమార్ మీ అందరికీ తెలుసు ఇంస్టాగ్రామ్ లో నేను సాంగ్స్ రాసి అప్లోడ్ చేస్తున్నాను అని. అయితే మీరు ఈ వెబ్ సైట్ లో ఫుల్ సాంగ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాలో ఇంకొక టాలెంట్ కూడా ఉందండోయ్. స్టోరీస్ రాయడం, ఇంకా మంచి మంచి కవితలు రాయటం, మంచి మాటలు రాయటం, పరిస్థితులకు తగ్గట్టు కొటేషన్స్ రాయగలను. ఇందులో చాలావి నేనే ఎదుర్కొన్న పరిస్థితుల నుంచే ఉంటాయి. మరికొన్ని నేను క్రియేట్ చేసినవి ఉంటాయి. మరి వాటిని కూడా మీరు చదివి నన్ను సపోర్ట్ చేస్తారు కదూ.

                       విషయం

నాకు త్వరగా డబ్బులు సంపాదించాలని కోరిక ఉండేది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా కంపెనీకి జాబ్ కి వెళ్తే 15,000 నుంచి 25 వేల లోపు శాలరీ ఉండేది. నాకు ఆ శాలరీ నచ్చేది కాదు. అలా అని గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తే ఎప్పటికీ వస్తుందో తెలియదు. ఎందుకంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా లేట్ వచ్చాయి. నోటిఫికేషన్ వచ్చేసరికి నేను చదివిన టాపిక్స్ గుర్తుండకుండా అయ్యేంత టైం పట్టేది.

ఇలా అయితే జాబ్ వచ్చేటప్పుడు డబ్బు సంపాదించేది ఎప్పుడు అని అనిపించేది. నేను ఈ ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరో కొంతమంది అనుకుంటూ ఉండగా విన్నాను. Uber లో డ్రైవింగ్ చేసి పికప్, డ్రాప్ లు చేస్తే నెలకి 50,000 పైనే సంపాదించొచ్చు. అని విన్నాను. కారు ఉంటే లక్ష రూపాయలు కూడా సంపాదించవచ్చు అనే మాటలు కూడా విన్నాను. దీనితో నా చెవులు మెదిలి ఎలాగైనా Uber లో ఆ జాబ్ చెయ్యాలనుకున్నాను.

             కారు కొనాలనుకోవడం

కారు కొనడానికి ప్రయత్నం చేశాను. హైదరాబాదులో సొంత ఇల్లు ఉంటేనే కార్ లోన్ ఇస్తానని చెప్పారు. లేదా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళతో లేదా అక్కడ హైదరాబాదులో సొంతం ఇల్లు ఉన్న వారి చేత షూరిటీ సంతకం చేస్తే లోన్ అప్రూవ్ చేస్తానని చెప్పారు. అయితే గవర్నమెంట్ జాబ్ అప్పటికి వచ్చిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లేదా బంధువులు ఎవరూ లేరు. కానీ అక్కడ హైదరాబాదులో సొంతిల్లు ఉన్నవాళ్లు తెలుసు. వాళ్లని అడిగితే సంతకం పెడతామని అన్నారు. అయితే ఇంకా లోన్ అప్రూవ్ అయ్యి కారు వచ్చేస్తుందని ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. షూరిటీ సంతకం చేయించుకోవడానికి లోన్ ఆఫీసర్ ఇంటికి వచ్చాడు.

రాగానే మా ఇల్లు మా ఇంటి దగ్గర ఉన్న వాతావరణం చూసాడు. కార్ లోన్  Emi పే చేయలేమేమో అనే డౌట్ వచ్చిందేమో అనుకున్నాము. కానీ మ్యాటర్ అది కాదు. మేము ఎంత చెప్పినా అతను వినటం లేదు ఇంకా హైదరాబాదులో సొంతిల్లు ఉన్న వారు ఒకరు సంతకం చేస్తే సరిపోదు. ఇంకొక ఇల్లు ఉన్న వారు కూడా సంతకం చేయాలి అని ఏవేవో కండిషన్లు ఇంటికి వచ్చాక చెప్పడం మొదలుపెట్టాడు. ఇవన్నీ మాకు ముందు చెప్పలేదు కదా ఒక ఇల్లు ఉన్నవాళ్లు సంతకం చేస్తే సరిపోతుందని అన్నారు కదా అని మేము అడిగాము. అప్పుడు పక్కనున్న ఏజెంట్ చెప్పిందేంటంటే. లోన్ ఇప్పించినందుకు అతనికి కమిషన్ ఇస్తే అప్రూవ్ చేస్తాడని అన్నాడు. మా దగ్గర డౌన్ పేమెంట్ తక్కువగా ఉంది . అది కూడా చాలా కష్టం మీద సంపాదించాము. దాంట్లో ఇలా కమిషన్లు ఇస్తే తరవాత ఏదైనా అవసరం వస్తే డబ్బు సరిపడదు. అందుకని మేము ఆ లోన్ ఆఫీసర్ కి కమిషన్ ఇవ్వమని చెప్పాము. అక్కడితో లోన్ అప్రూవ్ చేయకుండా వెళ్ళిపోయాడు.

                   నిరాశ & బాధ

కార్ షోరూం లో పనిచేసే ఏజెంట్ ఏమన్నాడు అంటే ఈరోజు మీకు లోన్ అప్రూవ్ అయిపోతే రేపు సండే కాబట్టి షోరూం ఉండదు ఎల్లుండి సోమవారం కచ్చితంగా మీ కారు మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు. అప్పటివరకు ఆనందంతో ఉన్న మేము లోన్ అప్రూవ్ కాకపోవడంతో చాలా ఫీలయ్యాము. అప్పుడు ఈ విషయం తెలిసిన జనాలు ఏమన్నారు అంటే అరే మీకెందుకురా కారు ఏదైనా పని చేసుకుంటే సరిపోతుంది కదా పెద్దపెద్ద పనులు మీకెందుకురా అని అనేవారు. ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తారు అని ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఎవరు మాట్లాడినా దెప్పి పడటం తప్ప మోటివేషన్ ఎవరు చేసేవారు కాదు. కారు కొనడం ఫెయిల్ అయింది అనే విషయం మీద మాకు బాధగా ఉన్న. మేము ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా అనుకున్నది ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల మాత్రం పోలేదు.

                    ఇంకొక మార్గం

మేము కారు కొనాలనే ప్రయత్నంలో ఎవరో ఒకరు విమర్శ చేస్తూనే ఉన్నారు. మేము కారు కొనడానికి ఇంకొక మార్గం వెతికే పనిలో ఉన్నాము . మా దగ్గర డౌన్ పేమెంట్ రెండున్నర లక్షలు మాత్రమే ఉంది. లోన్ ఇవ్వాల్సి వస్తే 5 లక్షల లోన్ ఇవ్వాలి. అంత లోన్ సొంత ఇల్లు లేకుండా ఇవ్వమని చెప్పారు. అయితే మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే డౌన్ పేమెంట్ ఇంకా ఎక్కువ కడితే లోన్ అమౌంట్ తక్కువగా అవుతుంది కదా. కాబట్టి డౌన్ పేమెంట్ ని ఇంకా ఎక్కువ అయ్యేలా పనిచేయడం ప్రారంభించాము. ఆ పని ఏమిటంటే

                     Uber బైక్

అవును మా దగ్గర కారు కొనలేకపోయినా రెండు సంవత్సరాల క్రితం కొన్న బైక్ ఉంది. బైక్ డ్రైవ్ తో కూడా  Uber లో డబ్బులు సంపాదించొచ్చు అని విన్నాము. వెంటనే జాయిన్ అయ్యి బైక్ డ్రైవ్ తో వర్క్ ప్రారంభించాము. అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ట్రాఫిక్ లో డ్రైవ్ చేయాలి. ఒక 1000 లేదా 1500 రోజుకి సంపాదించాలంటే 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దాకా డ్రైవ్ చేయాలి. 30 నుండి 35 ట్రిప్పులు చెయ్యాలి. అప్పుడు మాకు అనిపించింది. నిజంగా మేము కారు కొంటే ఇలా ఊబర్లో మనీ సంపాదించి Emi పే చేసి పెట్రోల్ మరియు కార్ మెయింటెనెన్స్ పోయిన తర్వాత మాకు మిగిలేది చాలా తక్కువ అని అర్థమైంది. దానికన్నా బైక్ తో డ్రైవ్ చేసి మనీ సంపాదించిన పర్వాలేదు అనిపించింది. ఎవరో అన్న మాటలు మనకి ఈజీగా అనిపిస్తాయి. కానీ డబ్బు సంపాదించడం అంత ఈజీ పని కాదు అనేది నిజంగా చేస్తేనే తెలుస్తుంది. ఎలాగైతేనే ఒక సంవత్సరం పాటు బైక్ డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ… డౌన్ పేమెంట్ పెంచడానికి ప్రయత్నం చేశాము.

                   కారు వచ్చేసింది

డౌన్ పేమెంట్ 3 లక్షలు అయింది ఈ లోపు మేము వాడుతున్న HDFC బ్యాంక్ లో సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రి అప్రూవ్డ్ కార్ లోన్ ఆఫర్ వచ్చింది. ఆఫర్ ఐదు లక్షలు లోన్ ఇప్పుడు మేము ఏ తాడ్ పార్టీ లోన్ ఏజెంట్స్ ని కలవాల్సిన పనిలేదు. మరియు లోను కోసం ఎవరిని బ్రతిమలాడాల్సిన పనిలేదు. అలాగే షూరిటీ సంతకం, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తి సంతకం చేయవలసిన అవసరం లేదు. ఒక్క ఫైవ్ మినిట్స్ లో కార్ లోన్ అప్రూవ్ అయిపోతుంది. మరియు మా చేతిలో ఉన్న డౌన్ పేమెంట్ ఇచ్చేస్తే చాలు. ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మాకు నచ్చిన కలర్ అండ్ నాకు నచ్చిన కార్ ఆర్డర్ పెట్టేసాం. టెన్ డేస్ లో ఎవరి అవసరం తీసుకోకుండా కార్ ని తీసుకొచ్చి మా కాంపౌండ్ లో పెట్టేసాము.

                    ట్విస్ట్ ఏమిటంటే

మేము ఆ కారుని క్యాబ్ డ్రైవింగ్ చేయడానికి కొనలేదు. మా పర్సనల్ గా వాడుకోవడానికి. మా ఫ్యామిలీతో మేము సరదాకా అప్పుడప్పుడు తిరగడానికి అలాగే మా మ్యారేజెస్కి కారుని వాడుకోవడానికి కొనుక్కున్నాము. ఈ విషయం తెలియని కొంతమంది జనాలు.. ఆశ్చర్యంతో ఎన్నిసార్లు చెప్పినా సరే నమ్మకుండా నిజం చెప్పండి ఏదొక కంపెనీలో పెట్టడానికి కారుని కొన్నారు కదా అంటూ పదే పదే ప్రశ్నలు అడిగేవారు. అలాగే కొంతమంది ఫైనాన్స్ తీరేసరికే కార్ క్వాలిటీ పోతుంది. మీరు వాడుకోవడానికి పనికిరాదు అన్నట్టు మాట్లాడారు. కారు ఎలా వాడుకోవాలో ఫైనాన్స్ ఎలా కట్టాలో మాకు తెలుసు ఎవరి మాటలు పట్టించుకోలేదు వాళ్ల కుళ్ళు స్వభావాలు మాకు తెలుసు. అందుకే మేము పట్టించుకోలేదు.

                     కొన్న వెంటనే

మొదట చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కి వెళ్లి పంతులు  గారి చేత పూజ చేయించాము. తరువాత జూబ్లీహిల్స్ అమ్మవారి టెంపుల్ కి వెళ్లి పూజ చేయించాము. ఆరోజు అయితే అనుకున్నది సాధించినందుకు. మా ఫ్యామిలీ అంతా చాలా సంతోషించాము. చెప్పుదగ్గ విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ అమ్మవారి గుడికి 10 సంవత్సరాల క్రితం మా నాన్న చిన్న TVS XL బండిని పోనీ పూజ చేయించడానికి తీసుకొచ్చాడు. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ మాకోసం ఒక పెద్ద బైక్ Unicon 160 కొన్ని పూజ చేయించడానికి తీసుకొచ్చాము. మళ్లీ ఇప్పుడు కారు కొని పూజ చేయించడానికి తీసుకొచ్చాము. ఇలా మేము సక్సెస్ అవ్వడానికి కారణం ఏమిటంటే  ఈ 10 సంవత్సరాలు మేము సమయాన్ని వృధా చేయకుండా మేము ఏదైతే కావాలనుకున్నామో దాని గురించి పని చేస్తూ వచ్చాము ఆ అమ్మవారు మేము పడ్డ కష్టానికి ఫలితాన్ని ఇచ్చింది. అందుకే నేను కచ్చితంగా చెప్పేది ఏమిటంటే. మీరు ఏది కావాలనుకుంటే అది సాధించవచ్చు మీ సమయాన్ని మీరు వృధా చేయకుండా వాడుకుంటే మరియు కష్టపడితే. ఇతరుల మీద ఆధారపడకుండా మీరు ఏం సాధించాలనుకున్నారో దానిమీద మీరు పని చేయండి.

                కారు ముందు ఎందుకు

ముందుగా మేము కార్ ఎందుకు కొన్నామంటే మేము ఎప్పుడో సెటిల్ అయ్యాక, 30 లేదా 35 వచ్చాక కారు కొంటే మా అమ్మానాన్నలు కార్లో తిరగడానికి అవకాశం ఉంటుందో లేదో అని అనిపించింది. ఎందుకంటే వారికి వయసు అవుతుంది కాబట్టి. మా కోసం కష్టపడి మమ్మల్ని చదివించి పెంచినందుకు మేము తర్వాత ఎప్పుడో ప్రయోజకులైన వారిని సరదాగా తిప్ప లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే ముందుగా వారిని కారులో సరదాగా తిప్పాలి అనే కోరికతో మొదటగా కారుని కొనేశాము.

 

ఇక్కడ Download అనే దానిపై క్లిక్ చేసి ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Deepika Song Link 👇

Download

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ ఈ పాటను రాయడానికి నాకు మూడు రోజుల సమయం పట్టింది. మరియు ఈ సాంగ్ ని తయారు చేయడానికి ఒకరోజు సమయం పట్టింది. ఈ సాంగ్ కోసం మొత్తం నాలుగైదు రోజులు సమయం పట్టింది. ఈ కష్టానికి మీరు విలువనిస్తూ ఈ సాంగ్ ని మీరు ఎలా ఆనందించారో ఎవరి కోసం ఈ పాటని డౌన్లోడ్ చేశారో అలాగే మీరు ఎలా ఫీలయ్యారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలా మీరు కామెంట్ చేయడం వల్ల మీ పేర్లతో మరిన్ని పాటలు రాయడానికి ఉత్సాహం లభిస్తుంది. కచ్చితంగా కామెంట్ చేస్తారు కదూ. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.

మీకు తెలుసు కదా మన ఇంస్టాగ్రామ్ పేజ్ Shiva_k_creations మరి ఈ పేజ్ ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.

                      ముఖ్య గమనిక

ఈ వెబ్ సైట్ లో మా జీవితంలో మేము ఎదుర్కొన్న ఎన్నో పరిస్థితులలో ఎదురైన అనుభవం మీకు షేర్ చేసుకుంటూ అనేక స్టోరీస్ ఆర్టికల్స్ రూపంలో పోస్ట్ చేయబడతాయి. వీటిని మీరు మీ జీవితానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నావల్ల ఈ ప్రపంచం మారిపోతుందని నేను అనుకోను కానీ ఇంతమందిలో ఒక్కరికి నా మాట నచ్చిన వారి జీవితానికి ఉపయోగపడిన నేను ధన్యుడనే. నా సమయాన్ని కేటాయించి ఈ స్టోరీస్ రాసినందుకు నాకు ఫలితం దక్కినట్టే. ఉంటాను మరి చాలాసేపు మాట్లాడాను మరో పోస్ట్ లో మళ్ళీ కలుద్దాం.

 

 

 

Share This Article
Follow:
In this website iam uploading Songs With Names - Like Love Songs - Like Birthday Songs - Video Editing With Photos - Birthday Video - Wedding Anniversary Videos - Wedding Invitations - All Festival Videos - House Warming Invitations - Puja Invitations - Engagement Invitations - And Any Other Invitations - All Ad Videos
5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *