- వైషు సాంగ్ డౌన్లోడ్
మీరు ఈ పాటను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
ఈ పాటను మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు నా గురించి తెలుసుకుంటారు కదూ. నా పేరు శివ కుమార్ నాకు చిన్నప్పటి నుంచి కవితలు, మంచి మాటలు, నవ్వు తెప్పించే విధంగా మాట్లాడటం నాకు ఉన్న అలవాటు. ఉన్నది ఇద్దరు ముగ్గురు స్నేహితులు అయిన నాతో ఎవరున్నా వారితో నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ నాకు సమయాన్ని గడపడమే తెలుసు.
సారాంశం
ఈరోజు ఈ ఆర్టికల్ లో నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ విషయాలు మీరు చదవడం వల్ల, మీరు తెలుసుకోవడం వల్ల మీ జీవితంలో సమస్యలన్నీ తీరిపోతాయి అని నేను చెప్పను కానీ కొంచెం తెలివితో మీకు ఎదురయ్యే సమస్యలను పోగొట్టుకోవచ్చని చెప్పగలను.
మొదటి విషయం
మీరు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారనే దానిపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువగా స్కూల్స్, కాలేజెస్ బంకు కొట్టి థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసేవాళ్ళతో… లేదా మందు, సిగరెట్, పాన్ పరాకులు తినే వారితో స్నేహం చేస్తే…. ఇంకా ఎక్కువగా వారితోనే మీ సమయాన్ని గడుపుతూ ఉంటే.కచ్చితంగా చాలామందిలో 90% స్నేహితులలో ఉండే అలవాట్లకు గురవుతారు. అదే మీరు ఒక మంచి గోల్, ఒక మంచి ఆశయం, తననే నమ్ముకున్న ఫ్యామిలీని, కష్టపడి చదివిస్తున్న అమ్మానాన్నలని బాగా చూసుకోవాలి. అనే ఆశయంతో ఉండేవాడితో మీరు స్నేహం చేస్తే. ఇంకా ఎక్కువగా అతనితోనే సమయాన్ని గడుపుతూ ఉంటే, కచ్చితంగా మీరు కూడా అతని వెళ్లే దారిలోకే మీరు వెళ్తారు. కాబట్టి మీరు ఎంచుకునే స్నేహం. మీరు తిరిగే మనుషులు ఎటువంటి వారో ముందుగా తెలుసుకొని, వారితో మీ సమయాన్ని గడపండి.
రెండవ విషయం
మీకు 16 లేదా 17 సంవత్సరాలు వచ్చేసరికి మీ జీవితానికి ప్రేమ అనే ఒక కొత్త పదం మీ క్లాస్మేట్స్ లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా గానో పరిచయం అవుతుంది. ఈ ప్రేమ ఎటువంటిది అంటే మీ జీవితంలో ప్రేమ అనేది ఒకటి ఉండాలి. అని తెలియజేస్తూ మీలో ఒక మంచి భావనను మేల్కొల్పుతుంది. ఇలా జరగడం అనేది మంచిదే. ఎందుకంటే చిన్నప్పుడు చిన్న చిన్న ఆట బొమ్మలతో మీ జీవితం మొదలయ్యి, మూడు నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత సైకిల్ తొక్కటం. అలాగే స్నేహితులతో ఆడుకోవడం, ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది.
అలాగే వయసు వచ్చాక ప్రేమ అనేది తెలుసుకోవడం కూడా, మీ జీవితానికి అవసరమైన పార్టె. కాబట్టి మీరు ప్రేమ అనే ఒక కొత్త భావనను తెలుసుకోవడానికి, ఒక అమ్మాయిని చూసి మాట్లాడి స్నేహం చేయడం ద్వారా. మీలో ఈ భావనను నింపుకోవచ్చు. ఇది మీ జీవితానికి హానికరం కాదు. పైగా ఇలా చేయటం వల్ల, తర్వాత మీ జీవితంలోకి వచ్చే వారిని ప్రేమ భావంతో, చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీలో ప్రేమ అనే భావన ఉంటేనే కదా, మొదలవుతేనే కదా వచ్చిన వారిని ప్రేమగా చూసుకోగలుగుతారు. కాబట్టి వయసు రాగానే మీలో ప్రేమ భావన కలగడం అనేది మంచి విషయమే. కాకపోతే ఒక అమ్మాయి తో స్నేహం కంటే ముందుకు వెళ్లి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇది మనం తెలుసుకోవలసిన రెండో విషయం.
మూడవ విషయం
కొంతమంది విద్యార్థులు స్కూల్స్ కి, కాలేజెస్ కి టీచర్స్ పై సెటైర్లు వేస్తారు. సరదాగా టైం పాస్ చేస్తూ చదువు ఎందుకు అనేది తెలుసుకోకుండా. ఇంట్లో తల్లిదండ్రులు దేనికోసం కష్టపడి చదివిస్తున్నారో అర్థం చేసుకోకుండా. స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్లి వచ్చేస్తూ ఉంటారు. ఇది చేయడం చాలా తప్పు ఇది తల్లిదండ్రులకు బాధాకరమైన విషయం. మరియు మీ జీవితానికి మీరు చదువుకొని ఏదైనా జాబ్ చేయవచ్చు. జాబ్ రాకపోయినా చదువుకున్న తెలివితేటలను ఉపయోగించి, మీరు ఏ వ్యాపారంలోనైనా లాభం పొందవచ్చు. కాబట్టి మీ జీవితానికి చదవనేది చాలా అవసరం. ఇది ఏ స్నేహితుడు మీకు చెప్పడు. ఒక టీచర్ తప్ప. కాబట్టి టీచర్లను హేళన చేయకుండా మనం చదువుకోవడం చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి.
నాల్గవ విషయం
జీవితంలో ముందుకు వెళ్లే కొలది మనం ఏదైనా ఒక పని చేస్తూ సక్సెస్ బాటలో వెళుతూ ఉంటే మన బంధువులు, స్నేహితులు ఈర్షతో నిన్ను డిస్టర్బ్ చేయడానికి కొన్ని నిందలను తోస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే నువ్వు చేసే పని గొప్పదేం కాదని అది ఎక్కువ కాలం ఉండదని కొందరు, ఇంకొందరు అరే వీడు చాలా సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. కాబట్టి వీడితో స్నేహంగా ఉంటూ, ఆప్యాయంగా మాట్లాడుతూ ఎలాగైనా మన దగ్గర ఉన్న సంపదను మన వెనక తిరుగుతూ ఉంటారు. ఒకవేళ నీ నుంచి లాభాన్ని పొందుతుంటే నీతో చాలా ఆప్యాయంగా ఉంటారు. నీ నుంచి వాళ్లు లాభాన్ని పొందలేక పోతే నీతో ఉన్న బంధాలలో గొడవలు పెట్టి నీ మీద కొన్ని నిందలు వేసి నువ్వు చేసే పనిని డిస్టర్బ్ అయ్యేలా చేస్తూ ఉంటారు. కాబట్టి నీతో ఉన్నవారు ఎలాంటి వారో నువ్వు ముందుగా తెలుసుకోవడం చాలా మంచిది.
ఐదవ విషయం
ఈ లోకంలో మనం జీవించడానికి మనం చెడు మార్గంలో నడవకుండా ఉండటానికి దైవభక్తి ఉండాలి. ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని కాపాడటానికీ దైవ భక్తి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటానికి దైవభక్తి అవసరం. దేవుడు మీద భక్తి వల్ల మన జీవితానికి ప్రశాంతత వస్తుంది. మనం ఎంత తెలివైన వాళ్ళమయిన సరే దైవ భక్తి కూడా ఉండాలి. జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా సరే చివరికి ఏమీ తోచని పరిస్థితి కచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం ముందు నుంచే దైవభక్తిని అలవర్చుకోవడం చాలా మంచిది. దేవుడు అంటే ఒక నాలెడ్జ్ మన మైండ్ ని ప్రశాంతంగా జీవించినంత కాలం ఉంచే గొప్ప సూత్రం. మన డైలీ లైఫ్ లో భగవంతుని స్మరించుకోవడం అనేది కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి.
ఆరవ విషయం
అదే విధంగా సాయం చేయటం మంచి అలవాటు. సాయం పొందిన వారి కంటే. సాయం చేసిన ఎక్కువ మేలు జరుగుతుంది. ఎలా అంటే మనం చేసే పనిలో ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలు ఏ కారణంగా అయినా రావచ్చు. అయితే ఈ ఆటంకాలు అనేవి. మనం చేసిన చెడు కర్మ ద్వారాగా కూడా రావచ్చు. ఈ కర్మ అనేది తగ్గించుకునే అవకాశం కూడా మనకి ఉంది. మనం ఇతరులకు సాయం చేయడం ద్వారా కర్మని తగ్గించవచ్చు. ఎదుటివారి మనసుని సంతోషపరిచిన మనకు ఉన్న కర్మ తగ్గుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక అలవాటుగా మార్చుకోవాలి.
ఏడవ విషయం
మనం అనేక రకాల విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. ఎవరితో అయినా మాట్లాడడానికి, లేదా మన జీవితానికి సంబంధించిన విషయాలు, ఈ ప్రకృతిలో జరిగే మార్పుల గురించి ఇంకా ఈ ప్రపంచంలో వచ్చే టెక్నాలజీ గురించి, వస్తున్న మోడ్రన్ వస్తువుల గురించి, ఇలా ఎన్నో రకాల విషయాలను తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా అనేక రకాల విషయాలను తెలుసుకోవడం వల్ల మన జీవితానికి అవసరమయ్యే తెలివితేటలు వస్తాయి. కాబట్టి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడంలో మీరు ఉత్సాహాన్ని చూపించాలి.
ఎనిమిదవ విషయం
ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగిపోతూ మన జీవితానికి ఏది ఆనందం అనేది తెలుసుకోకపోతే మనం ఎందుకు జీవిస్తున్నాం అనేది తెలియకుండా పోతుంది. కొందరు నిరంతరం రాత్రి పగలు అని తేడా తెలియకుండా పని చేస్తూ ఉంటారు. ఎంతో డబ్బుని సంపాదిస్తారు. అయినప్పటికీ వారి జీవితానికి అవసరమయ్యే వస్తువులను కూడా కొనుక్కోరు. డబ్బుని దాచేసి వారి అవసరాలకు ఇతరులపై ఆధారపడుతూ వారి అవసరాన్ని ఇతరులు తీర్చలేకపోతే. పిసినాతనంతో బ్రతికేస్తూ ఉంటారు. దీనివల్ల చివరకి వారు కూడబెట్టిన ధనం దేనికి చెందకుండా పోతుంది. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ వారి జీవితంలో వయసు అయిపోతూ ఉంటుంది. జీవితం చివరి వరకు ఇది గమనించకుండా ఉంటే వారు ఎంత కష్టపడినా ఆనందం దొరకదు. కాబట్టి మనం ఎంత కష్టపడతామో ఆ కష్టాన్ని ఉపయోగించి సంపాదించిన ధనంతో అవసరాలను తీర్చుకుంటూ ఆనందంగా జీవించటం మనం ముందుగానే తెలుసుకోవాలి .
తొమ్మిదవ విషయం
రోడ్డుమీద వాహనాలను జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే ఈ భూమ్మీద జీవించడానికి మనకి ఏ విధంగా అయితే హక్కు ఉందో అదే విధంగా ఇతర మనుషులకు, ఇతర జీవులకు కూడా ఉంటుంది కదా. కాబట్టి మనం రోడ్డుపై వాహనాలను ఎవరికి హాని కలిగించకుండా, ప్రమాదాలను కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
పదవ విషయం
- పైన చెప్పిన విషయాలు అన్నిటిని రోజు గుర్తు చేసుకుంటూ ఈ విషయాన్ని కూడా ముఖ్యంగా గుర్తించుకోవాలి. మన అవసరాల కోసం బంధువులను, స్నేహితులను దగ్గర చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే స్నేహమైనా ఏ బంధమైనా మనకు నాలెడ్జ్ ని షేర్ చేసి మన జీవితాన్ని మనమే నిలబెట్టుకునేలా చేయగలరు కానీ మనకి ఎల్లప్పుడూ డబ్బుని ఇస్తూ మన అవసరాలను తీరుస్తూ మన భారాన్ని మోయలేరు. మనం వారికి ఎప్పటికైనా బరువని అనిపించినప్పుడు మన బంధుత్వాన్ని మన స్నేహాన్ని వద్దనుకుంటూ..మనల్లీ కచ్చితంగా దూరం చేస్తారు. అప్పుడు ఇతరులపై ఆధారపడిన మనం ఎదురయ్యే సమస్యలకు బలవుతాం. కాబట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్లు నిలబడేలా తయారవ్వాలి. ఇతరులనుంచి, అంటే స్నేహితుల నుంచి కానీ బంధుత్వాల నుంచి కానీ ఏవైనా విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే అంటే నాలెడ్జ్ ని పొందేందుకు మాత్రమే వాడుకోవాలి. డబ్బును ఆశించడం,బహుమతులను ఇవ్వాలనుకోవడం మన జీవితానికి హానికరం. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి.
ఇక్కడ ఉన్న Download అనే దానిపై క్లిక్ చేసి మీరు సాంగ్ నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Vaishu Song Download 👇
ఈ పాటని మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో, మీరు ఎలా ఫీలయ్యారో, ఎవరికోసం డౌన్లోడ్ చేసుకున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మరిచిపోకండి. ఎందుకంటే మీ అభిప్రాయం మాకు ఉత్సాహాన్ని కలిగించి మరిన్ని పాటలు రాసేలా మాకు ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే మా ఇంస్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసి మరిన్ని సాంగ్స్ ని ఎంజాయ్ చేయండి.
11వ విషయం
ఇతరుల వస్తువులను వాడేటప్పుడు వాటికి ఏవైనా రిపేర్లు వస్తే బాగు చేయాల్సిన బాధ్యత మనకి ఉంటుంది. ఇది ఇతరులు చెప్పకుండానే మనం గ్రహించాలి. అది మనిషి అన్నాక ఉండవలసిన కనీస బాధ్యత. ప్రతి విషయానికి ఎవరో చెబితేనే చేయటం అనేది చాలా తప్పు. అలా ఉంటే మనసు లేని మెషిన్ లాగా ఉన్నట్టు అవుతుంది.
12వ విషయం
గౌరవం అనేది మనం ఉండే తీరును చూసి అవతలి వారే మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. అంతేగాని మనం కోరుకునేది గౌరవం కాదు అలా ఎప్పటికీ జరగదు. మనం ఉండే తీరుని మనం మార్చుకున్నప్పుడే అవతలి వారు మనల్ని గౌరవిస్తారు కాబట్టి. మనకి గౌరవం ఇవ్వాలి అంటే మనం ఉండే తీరు మార్చుకోవాలి.