దివ్య సాంగ్ డౌన్లోడ్
ఈ పాటను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరిచయం
ఈరోజు మీరు నా గురించి తెలుసుకోవాల్సిందే. నా పేరు శివకుమార్. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా రాయటం అలవాటుగా వచ్చింది. నవ్వు తెప్పించే కవితలు. ఫ్రెండ్స్ తో జోక్స్ వేయడం. స్టోరీలు రాయటం నా అలవాటు. ఈ అలవాటు కాస్త కొన్ని రోజులకు పాటలు రాయడంగా కూడా మారిపోయింది. ఇకనుంచి ఈ Shiva K Creations వెబ్ సైట్ లో నేను రాసే పాటలు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొదటి పాయింట్
నాకు నేను చేసే ఏ పనిలో అయిన ఎంత కష్టం ఉన్నప్పటికీ ఆ పని నాకు ఫలితాన్ని ఇచ్చిన ఇవ్వకపోయినప్పటికీ ఆ పని గురించి ఒక్క నాలుగు లైన్లు ఒక కవిత రాస్తే. నేను ఆ పనిలో ఎంత కష్టం ఉన్నా మరిచిపోతాను. ఎన్నో కోట్ల రూపాయలు ఫలితం వచ్చినట్లుగా ఆనంద పడిపోతాను. అప్పుడే నేను అనుకుంటాను. ఒకవేళ ఎవరైనా వారు చేసే పనిలో ఒక ఆనందమైన పద్ధతిని ఎంచుకుంటే ఎంత కష్టమైనా పని అయినా సరదాగా చేసేయవచ్చు అని. ఇలా వారు చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కొని చేస్తేనే వారు ఎక్కువగా ఆ పనిని చేయగలరు. ఇంకా ఆ పనిలో ఫలితాన్ని సాధించ గలుగుతారు.
రెండవ పాయింట్
ఒక ఇష్టమైన పనిని చేయటం వల్ల మీకు ఆదాయం రాకపోవచ్చు. లేదా మొదట్లో గొప్ప పేరు రాకపోవచ్చు. దీనివల్ల మీరు మీలో ఉన్న ఒక టాలెంట్ ని పక్కన పెట్టేయొచ్చు. కానీ అలా చేయడం తప్పు. మీకు ఆదాయం వచ్చే ఏ పనినైనా మీరు మొదట ఎంచుకోండి.. అది చేస్తూ ఒక గంట సమయం లేదా కనీసం ఒక అరగంట సమయం అయిన మీరు మీకు నచ్చిన పనిమీద ధ్యాస పెట్టండి. దీనివల్ల మీరు ఎవరో నిర్ణయించిన ఆదాయంలో బ్రతకనవసరం లేదు. ఎవరో నిర్ణయించిన ఆదాయంలో మీకు చిన్న చిన్న అవసరాలు మాత్రమే తీరుతాయి. అదే మీరు సొంతంగా పెట్టిన వ్యాపారం అయితే మీరు ఏది కావాలనుకుంటే దానిని పొందవచ్చు. ఎందుకంటే మీరు మొదలుపెట్టిన మీ ఇష్టమైన పని కొంతకాలానికి కచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడుతుంది.
మూడవ పాయింట్
అనుకున్నది సాధించాలనే కోరికతో పాటు పట్టుదల చాలా అవసరం. దీనికి ఉదాహరణ ఆంజనేయస్వామి ఎందుకంటే రాములవారికి సీతమ్మ వారి జాడను తెలియజేస్తానని మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకోవాలని ఎంత కష్టం ఎదురైనా ఆగిపోకుండా సీతమ్మ వారి జాడను కనిపెట్టాడు. సముద్రం అడ్డు వచ్చినా. రాక్షసులు ఎదురైన ఆయన ప్రయాణం ఆపలేదు. ఎవరికి భయపడలేదు. ధైర్యం కోల్పోయి ఆగిపోలేదు. ఆఖరికి సీతమ్మ వారి జాడ కనుగొని రాములవారికి తెలియజేశాడు. ఆ విధంగా మనం మొదలుపెట్టిన ఏ పని అయినా ఆటంకాలు వచ్చినా విడిచి పెట్టకూడదు.
నాల్గవ పాయింట్
మొదట మనం ప్రారంభించిన పనికి ప్రజల నుంచి ఎటువంటి మంచి అభిప్రాయాలు ఇవ్వరు. ఇంకా ఏదో మనం చేసే పని బాగోలేదని కామెంట్స్ చేస్తారు. అప్పుడు మీకు మనసులో బాధ కలగొచ్చు. అయినప్పటికీ వారి నుంచి వచ్చే నెగటివ్ కామెంట్రీ ని పట్టించుకోకుండా ఎవరైతే మీ టాలెంట్ ని గుర్తించి మంచి అభిప్రాయాలని తెలియజేస్తారో వారితో మాట్లాడుతు మనం పాజిటివిటిని పెంచుకుంటూ మన పని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం.
ఐదవ పాయింట్
మనం చేసిన పని కొద్దిగా సక్సెస్ బాటలోకి వచ్చినప్పుడు. దానిని చూసి మరికొందరు కాంపిటీటర్స్ మొదలవుతారు. మీరు నాణ్యంగా ఇస్తున్న ప్రోడక్ట్ డెలివరీని వారు చీప్ గా మరియు మోసపూరితమైన అట్రాక్షన్ తో కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తారు. దానితో మన పనికి ఆటంకం రావచ్చు. అయినప్పటికీ కంగారు పడకుండా.. మనం ఇంతకుముందు ఎంత క్వాలిటీ అయితే మెయిన్ టెయిన్ చేసామో అదే క్వాలిటీ మెయిన్ టైన్ చేస్తూ కస్టమర్స్ కి ప్రోడక్ట్ని డెలివర్ చేస్తే మన వర్క్ గొప్పతనం వారు గ్రహించి, మనల్ని నమ్మి మన దగ్గరకే వస్తారు. దానితో మన పని యూనిక్గా అయిపోతుంది.
ఆరవ పాయింట్
మీరు చేసే పనిలో కొంత లాభాన్ని చూడగానే గర్వంతో మీరు అందరి పట్ల గౌరవాన్ని మరిచి మాట్లాడవద్దు. దీనివల్ల ఏదో కారణంగా వారు మీరు చేసే పనికి ఆటంకం కలుగ చేయవచ్చు. దీనితో మీరు డిస్టర్బ్ అయ్యి మీరు చేసే పని మీద దృష్టి కోల్పోవచ్చు. కనుక మీరు ఎప్పుడూ మీకు వచ్చిన సక్సెస్ తో ఇతరుల పట్ల గర్వంతో మాట్లాడవద్దు.
ఏడవ పాయింట్
మీరు మొదలు పెట్టిన పని సక్సెస్ అయినప్పటికీ ఒకే రకమైన పద్ధతిని అనుసరించకూడదు. ఎందుకంటే మొదట్లో మీ ప్రొడక్టివిటీ అందరికీ నచ్చినప్పటికీ తర్వాత బోర్ కొట్టొచ్చు. అందుకే మీరు సక్సెస్ అయినప్పటికీ ప్రతిసారి మీ ప్రొడక్టివిటీలో కొత్తదనం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం మొదలు పెట్టిన పని చిరస్థాయిగా నిలుస్తుంది.
ఎనిమిదవ పాయింట్
మీ పని గురించి అందరికీ సులభంగా సక్సెస్ వచ్చిందన్నట్టుగా చేయకండి. అప్పుడు మీరు సాధించిన పని పట్ల విలువ ఉండదు. మీరు పడిన కష్టం వారు గుర్తించరు. హేలన చేస్తూ మీ పని పట్ల మీకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు. లేదా వారికి టాలెంట్ లేకుండానే మీరు చేసే పని చేయాలని ప్రయత్నిస్తూ మీలా సక్సెస్ అవ్వాలని అత్యాశ చెందుతూ. మిమ్మల్ని అనేక రకాల ప్రశ్నలతో మీరు చేసే పనిని డిస్టర్బ్ చేస్తారు. అందుచేత మీరు చేసే పని పద్ధతిని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఒకవేళ వారిలో కూడా ఏదైనా టాలెంట్ గుర్తించినట్లయితే.. వారు నమ్మకమైన వ్యక్తి అయితే సహాయం చేయడానికి ప్రయత్నించండి. వారిలో ఏ టాలెంట్ లేనప్పుడు మాత్రం మీ పని గురించి వారితో చర్చించకండి.
తొమ్మిదవ పాయింట్
మీ వర్క్ డెవలప్మెంట్ గురించి మీరు ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు అనేక రకాల మంచి మార్గాలు కనిపిస్తాయి. మంచి అవకాశాలు లభిస్తాయి. పక్కవారితో లేదా ప్రతి ఒక్కరితో మీరు చేసే పని గురించి చర్చించే బదులు మీకు మీరుగా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని మీ పని గురించి మీరు రీసెర్చ్ చేసుకుంటే మంచిది. అప్పుడే మీరు అనుకున్న పనిలో కొనసాగలుగుతారు. మంచి మార్గాలు లభించడం కోసం మంచి పుస్తకాలను చదవడం మంచిది.
పదవ పాయింట్
ఇది నేను చేసే పనిలో ఎదుర్కొన్న కష్టం యొక్క అనుభవంలో చివరి పాయింట్. పైన నేను చెప్పిన అన్ని పాయింట్స్ ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ మనం చేసే పని పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం రాకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి లేకపోతే తర్వాత ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి. సక్సెస్ వచ్చిన వెంటనే ఫలితాన్ని మొత్తం ఖర్చు చేయకూడదు. అలా చేస్తే మనం పని చేయటానికి బలాన్ని కోల్పోతాము. మనం చేసే పనిలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు. నిలబడటానికి మన దగ్గర బలం ఉండాలి. బలం ఏ విధంగా వస్తుందో మీకు తెలుసు కదా! వచ్చి వచ్చిన ఫలితాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా సగమైన దాచినట్లయితే ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం చేసే పనిలో ఆదాయం తక్కువ అయినప్పటికీ పూర్వం చేసిన ఆదాయం ఉంటుంది కాబట్టి మనం వేరే ఒక పద్ధతిని కనుక్కొని దానిలో మళ్లీ నిలబడటానికి అవకాశాన్ని తెచ్చుకోవచ్చు. ఈ విధమైన పద్ధతిని ఉపయోగిస్తే మనం చేసే పనిలో ఆటంకాలు వచ్చినప్పటికీ నిలబడి మంచి జీవితాన్ని సాధించుకోవచ్చు.
నేను మొదటి పాట రాసినప్పుడు
నేను మొదటి పాట రాసినప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. పాట రాసిన వెంటనే మా తమ్ముడికి మొదట చూపించాను. నిజం చెప్పు ఈ పాట నువ్వే రాసావా అని అన్నాడు. అవును నేనే రాసాను అంటే చాలాసేపు నమ్మలేదు. ఎందుకంటే ఆ పాట అంతగా బాగుంది. నాకే నమ్మబుద్ది అవ్వలేదు ఈ పాట నేనే రాసానా అని అనిపించింది. పాట తయారయ్యాక కొన్ని వందలసార్లు ఆ పాటను విన్నాను. ఇలా ఒక్క పాటతో ఆగిపోకూడదని నాలో ఉన్న టాలెంట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇలా పేర్లతో పాటలు రాయడం కొనసాగిస్తున్నాను. ఈ పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు నేను సరదాగా రాసిన మాటలు, కవితలు ఈ విధంగా నన్ను పాటలు రాసే అంతగా అయినందుకు నా ఆనందానికి అవధులు లేవు. నిజం చెప్పాలంటే ఈ ఆనందంతో దీనిపైన కూడా ఒక పాట రాయాలి అనేంతగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు నేను నాలుగు లవ్ సాంగ్స్ & పిల్లలకు,పెద్దలకు మరియు ఆడవారికి,మగవారికి ఉపయోగపడేలా వారి పేర్లతో బర్త్ డే సాంగ్స్ రాశాను ఇంకా ప్రజలకు మంచి చేసే వారి గురించి మంచి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ ఒక వ్యక్తిని అతని మంచితనాన్ని పాటలో ఉండేటట్టుగా మంచి ఎలివేషన్ తో ఒక పాట రాశాను. నేను ఇంకా ఇలాగే ఎన్నో పాటలు రాయాలని అనుకుంటున్నాను. ఆనందంతో మీ శివ
ఇక్కడ Download అనే దాని పైన క్లిక్ చేసి వైషు పాటని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Divya Song Link 👇
ఈ విధంగా మీకు నచ్చిన పేరు మీద సాంగ్స్ చేసి ఈ వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తాము. మేము అప్లోడ్ చేసిన సాంగ్స్ ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అలాగే మీకు పాట నచ్చినట్లయితే మన instagram పేజ్ ని ఫాలో అవ్వండి. పాట ఎలా ఉందో,మీరు ఎలా ఫీలయ్యారో, ఎవరికోసం ఈ పాటని మీరు డౌన్లోడ్ చేసుకున్నారో తెలియజేయడం మరిచిపోకండి. మీరు తెలిపే అభిప్రాయం వల్ల మీరు ఈ పాట వల్ల ఎంత ఆనందాన్ని పొందారో మాకు తెలుస్తుంది. దానితో మేము చేసే పనిలో ఉత్సాహం కలిగి మేము మరిన్ని పాటలను మీ పేర్లతో చేయడానికి ప్రయత్నిస్తాము. మీ అభిమానం, మీ ఆదరణ నాకు ఎప్పటికీ లభిస్తాయని మేము అనుకుంటున్నాము.
దాని ఫలితంగా
దాని ఫలితంగా మేము మరింత మెరుగైన కంటెంట్ మీకు అందించగలుగుతాము. ఆ కంటెంట్ లో మీరు నీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో కథనాలను వినవచ్చును అలాగే మీకు ఇష్టమైన పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అందించే ఈ పాటలను మీరు పొందాలంటే, మా ఇంస్టాగ్రామ్ పేజ్ ని, మా వెబ్సైట్ ని ఫాలో అవడం మర్చిపోకండి. మీకు ఏదైనా పేరుమీద సాంగ్ కావాలంటే ఈ ఆర్టికల్ కింద యాడ్ కామెంట్ అని ఉంటుంది. మీరు మీకు కావాల్సిన పేరుని కామెంట్ చేస్తే మేము ఎక్కువగా ఏ పేరు అయితే కామెంట్ చేస్తారో ఆ పేరు మీద సాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. చివరిగా మీకు ఒక విషయం మేము అందించే ఈ ఫ్రీ సాంగ్స్ ని మీకు ఇష్టమైన వారికి లేదా మీకు నచ్చిన విధంగా వినండి ఎంజాయ్ చేయండి. ఎటువంటి దుర్వినియోగం చేయకండి.
Nice 🥰
Thankyou 😊
My name is CHANDANA please send a 🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂
Time paduthundi but compalsary chesthamu